By: ABP Desam | Published : 28 Oct 2021 01:05 PM (IST)|Updated : 28 Oct 2021 01:05 PM (IST)
Edited By: Murali Krishna
ముంబయి డ్రగ్స్ కేసులో కీలక సాక్షి గోసవీ అరెస్ట్
ముంబయి డ్రగ్స్ కేసులో కీలక సాక్షిగా ఉన్న కిరణ్ గోసవీని పోలీసులు అరెస్ట్ చేశారు. పుణె పోలీసులు గోసవీని అదుపులోకి తీసుకున్నట్లు పుణె పోలీస్ కమిషనర్ తెలిపారు.
తాను సరెండర్ కాబోతున్నానని గోసవీ ప్రకటించిన మూడు రోజులకు అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తాను సరెండర్ కాబోతున్నానని చెప్పిన వీడియోలో గోసవీ పలు ఆరోపణలు చేశారు.
ప్రభాకర్ సాలీ అబద్ధం చెబుతున్నాడు. అతడి కాల్ డేటా రికార్డింగ్‌ను బయటపెట్టాలి. నా రికార్డింగ్‌లు, ఛాట్‌లు ఏమైనా ఉంటే విడుదల చేయండి. అప్పుడు అన్ని నిజాలు బయటకు వస్తాయి.
కిరణ్ గోసవీ, డ్రగ్స్ కేసులో కీలక సాక్షి
ఎవరీ గోసవీ?
మలేసియాలో ఉద్యోగం ఇప్పిస్తానని పుణె వ్యక్తిని మోసం చేశాడంటూ గోసవీపై కేసు నమోదైంది. గోసవీ.. దేశం విడిచిపోకుండా ఉండేందుకే ఇటీవల పోలీసులు లుక్‌ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. 2018 నుంచి కనబడకుండా తిరుగుతోన్న గోసవీని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ కేసు..
ముంబయి కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఆ ప్రయాణికుల ఓడలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడులు జరిపారు. ఈ రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేశారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడే ఎన్సీబీ అధికారులకు అధిక మొత్తంలో కొకైన్ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు.
ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. ఆదివారం ఉదయం వారందరినీ ముంబయికి తీసుకొని వచ్చారు. అదుపులోకి తీసుకున్న వారిలో 8 నుంచి 10 మందిని విచారణ జరిపారు. ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరికి వైద్య పరీక్షలు కూడా జరిపించారు.
విచారణలో ఉన్న ఆర్యన్ ఖాన్‌కు త్వరగానే బెయిల్ లభిస్తుందని అంతా భావించారు. కానీ ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను పలుమార్లు కోర్టు కొట్టివేసింది.
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!
Also Read: T20 WC, Ind vs NZ: న్యూజిలాండ్ మ్యాచ్‌లో భారత్‌కు కీలకం కానున్న టాప్-5 ప్లేయర్లు వీరే!
Also Read: IND Vs NZ: రెండు జట్లకు ఫైనల్ లాంటి మ్యాచ్.. ఓడిన జట్టు దాదాపు ఇంటికే.. ఎందుకంటే?
Also Read: T20 WC Ind vs Pak: కోహ్లీసేనకు హార్దిక్ పాండ్యే ఎదరుదెబ్బ! అతడిని ఆడించడమే కోహ్లీ తప్పన్న ఇంజమామ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి
Salary In Gold : ఆ కంపెనీలో జీతం క్యాష్ కాదు గోల్డ్ - వాళ్ల జీతం బంగారమైపోయింది !
Governor Tamili Sai : బద్ధ శత్రువునైనా గౌరవిస్తా, నాపై రాళ్లు రువ్వితే ఆ రక్తంతో చరిత్ర రాస్తా : గవర్నర్ తమిళి సై
Asaduddin Owaisi on Gyanvapi: మరో మసీదును ముస్లింలు వదులుకోరు: ఓవైసీ
One Block Board Two Classes : ఒక్క క్లాస్ రూమ్‌లో ఒకే సారి రెండు తరగతులకు పాఠాలు చెప్పడం చూశారా ? బీహార్ నుంచి చూపిస్తున్నాం చూడండి
Amalapuram Celebrations: తొలిసారి థామస్ కప్ నెగ్గిన భారత్, ఏపీలోని అమలాపురంలో సంబరాలు - ఎందుకంటే !
YSRCP Rajyasabha : బీజేపీ చాయిస్‌గా ఓ రాజ్యసభ సీటు - వైఎస్ఆర్సీపీ ఆఫర్ ఇచ్చిందా ?
Karate Kalyani Notice : ఆ చిన్నారి ఎవరు? కరాటే కళ్యాణి నుంచి నో రిప్లై, మరోసారి నోటీసులు!
Covid 19 in North Korea: కిమ్ రాజ్యంలో కరోనా వైరస్ వీరవిహారం- 10 లక్షలకు పైగా కేసులు!
Diabetes: డయాబెటిస్ ఉంటే మటన్ తినకూడదంటారు, ఎందుకు?