T20 WC Ind vs Pak: కోహ్లీసేనకు హార్దిక్ పాండ్యే ఎదరుదెబ్బ! అతడిని ఆడించడమే కోహ్లీ తప్పన్న ఇంజమామ్
పాక్ చేతిలో భారత్ ఓటమిపై ఇంజామమ్ ఉల్ హఖ్ మాట్లాడాడు. టీమ్‌ఇండియా కూర్పు అస్సలు బాగాలేదని అంటున్నాడు. హార్దిక్ పాండ్యను తీసుకోవడమే అతిపెద్ద పొరపాటని పేర్కొన్నాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్ 12 మ్యాచులో పాక్‌పై హార్దిక్ పాండ్యను తీసుకోవడమే టీమ్‌ఇండియా చేసిన తప్పిదమని పాక్ మాజీ ఆటగాడు ఇంజమామ్ ఉల్ హఖ్ అంటున్నాడు. అతడు బౌలింగ్ చేయకపోవడంతో జట్టు కూర్పు కుదరలేదని పేర్కొన్నాడు. పైగా విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయాలూ ఆశ్చర్యపరిచాయని వెల్లడించాడు. తన యూట్యూబ్ ఛానల్లో అతడు మాట్లాడాడు.
'హార్దిక్ పాండ్యను తీసుకోవడమే టీమ్‌ఇండియా పొరపాటు! వారి జట్టు ఎంపిక బాగాలేదు. తన జట్టుతో ఏం చేయించాలో బాబర్ ఆజామ్‌కు బాగా తెలుసు. భారత్‌లో అలాంటదేమీ కనిపించలేదు. పైగా కోహ్లీసేనకు ఆరో బౌలర్ లేడు. అలా ఉండుంటే మిగతా ఐదుగురు బౌలర్లకు బ్యాకప్ దొరికేది' అని ఇంజీ అన్నాడు.
'బంతి తగలగానే పాండ్య తన భుజం చూపించడం సరికాదని నా అభిప్రాయం. ఇలాంటి హై వోల్టేజీ మ్యాచ్ ఆడుతున్నప్పుడు గాయపడ్డా ప్రత్యర్థికి అలాంటి సూచనలు ఇవ్వకూడదు. సచిన్ తెందూల్కర్ లాంటివారు దేహానికి బంతి తగిలినా కనీసం రుద్దుకొనేవారు కాదు. పాండ్య అలా చేయగానే టీమ్ఇండియా ఒత్తిడిలో ఉన్నట్టు నాకు అర్థమైపోయింది. అతడు మైదానానికి రాలేదు. ఫీల్డింగ్, బౌలింగ్ చేయలేదు' అని ఇంజీ పేర్కొన్నాడు.
'టీమ్‌ఇండియా ఆరో బౌలర్‌తో ఆడుంటే పరిస్థితి మెరుగ్గా ఉండేది. బాబర్ ఆజామ్‌కు మహ్మద్ హఫీజ్ ఎంత ఉపయోగకరంగా మారాడో చూడండి. అతడితో రెండు ఓవర్లు వేయించడంతో ఇమాద్ వసీమ్‌తో నాలుగు ఓవర్లు వేయించే అవసరం రాలేదు. పైగా బౌలింగ్ చేసేందుకు షోయబ్ మాలిక్ కూడా ఉన్నాడు. ఏదేమైనా ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాను పాక్ ఓడించేందుకు 30 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. అయినప్పటికీ టీమ్‌ఇండియా ఇప్పటికీ ఫేవరెట్టే' అని ఇంజీ తెలిపాడు.
Also Read: T20 WC, SA vs WI preview: ఓడిన జట్ల పట్టుదల..! కరీబియన్లపై సఫారీల పోరులో విజయం ఎవరిదో?
Also Read: Hardik Pandya Health: హార్దిక్ స్కానింగ్ రిపోర్ట్ వచ్చేసింది.. న్యూజిలాండ్ మ్యాచ్ ఆడగలడా? లేదా?
Also Read: IPL New Teams: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు ఇవే.. చేజిక్కించుకున్న కంపెనీలు ఏవంటే?
Also Read: Ind Vs Pak: పాక్ పైచేయి సాధించింది అక్కడే.. కాస్త జాగ్రత్త పడి ఉంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Time to reflect and come back stronger 👍#TeamIndia #T20WorldCup pic.twitter.com/ZGvkQAMASy
— BCCI (@BCCI) October 24, 2021