T20 WC, SA vs WI preview: ఓడిన జట్ల పట్టుదల..! కరీబియన్లపై సఫారీల పోరులో విజయం ఎవరిదో?
దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ప్రపంచకప్ తొలి మ్యాచుల్లో ఓడిపోయాయి. ఆ జట్లు సెమీస్‌కు చేరాలంటే రెండో మ్యాచులో గెలవడం అనివార్యం. అందుకే దుబాయ్‌లో గెలుపు కోసం ఉవ్విళ్లూరుతున్నాయి.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్ 12లో 18వ మ్యాచుకు డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్, దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్లూ తమ మొదటిలో మ్యాచుల్లో ఓడిపోయాయి. ఇప్పుడు ఎవరో ఒకరిని గెలుపు వర్తిస్తుంది. విజయం కోసం ప్రత్యర్థులు ఇద్దరూ పట్టుదలగా ఉండటం ఆసక్తికరం!
సఫారీలే బెస్టు
అంతర్జాతీయ టీ20ల్లో కరీబియన్ జట్టుపై సఫారీలదే ఆధిపత్యం. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 15 సార్లు తలపడగా 9సార్లు దక్షిణాఫ్రికా గెలిచింది. చివరిసారి తలపడ్డ ఆఖరి ఐదింట్లోనూ ఆ జట్టే మూడు విజయాలు అందుకుంది. ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో విండీస్ మొదటి మ్యాచ్ ఆడింది 55 పరుగులకే ఆలౌటై అపజయం మూటగట్టుకుంది. ఆస్ట్రేలియాతో తలపడ్డ సఫారీలూ ఆఖరి ఓవర్లో ఓటమి చెందారు.
అంచనాలు తప్పొద్దు
జట్టు నిండా మ్యాచ్ విన్నర్లే కావడంతో భారీ ఆశలతో యూఏఈలో అడుగుపెట్టింది కరీబియన్ జట్టు. ఒకరా.. ఇద్దరా.. తొమ్మిదో నంబర్ వరకు బ్యాటింగ్‌లో దడదడలాడించగలరు. అలాంటి జట్టు ఇంగ్లాండ్ చేతుల్లో దారుణంగా ఓడిపోయింది. అందుకే ఈ మ్యాచ్ వారికి కీలకం. తొలి మ్యాచులో ఆ జట్టు ఎక్కడో అంచనాలు తప్పింది. వ్యూహాల అమల్లో విఫలమైంది. ఈసారి అలా కాకపోవచ్చు. ఓపెనర్లు ఎవిన్ లూయిస్, సిమ్మన్స్ మంచి ఓపెనింగ్ ఇవ్వాలి. అలా జరిగితే క్రిస్‌గేల్, పూరన్, హెట్‌మైయిర్, పొలార్డ్, బ్రావో, రసెల్‌లో కనీసం ఇద్దరు నిలబడి భారీ స్కోరు చేయగలరు. బౌలింగ్‌లోనూ ఆ జట్టు ఫర్వాలేదు. ఇంగ్లాండ్‌పై తక్కువ స్కోరే చేసినా నాలుగు వికెట్లు తీశారు.
బ్యాటర్లు ఆడితేనే
ఆస్ట్రేలియాతో మ్యాచులో దక్షిణాఫ్రికా ప్రాణం పెట్టి ఆడింది. అయితే అయిడెన్ మార్‌క్రమ్ తప్పా ఏ ఒక్కరూ భారీ స్కోరు చేయలేదు. ఓపెనింగ్‌లో డికాక్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. క్లాసెన్ తన ఫామ్ కొనసాగించాలి. మిడిలార్డర్‌లో డేవిడ్ మిల్లర్‌పై ఒత్తిడి ఉంది. బ్యాటర్లు కనీసం పోరాడే టార్గెట్ ఇవ్వగలిగితే బౌలర్లు కచ్చితంగా మ్యాచులు గెలిపించగలరు. ఎందుకంటే ఆన్రిచ్ నార్జ్, రబాడ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. తబ్రైజ్ శంషీ, కేశవ్ మహారాజ్ నెమ్మది పిచ్‌లపై వికెట్లు తీస్తారు. ప్రిటోరియస్ కూడా ఫర్వాలేదు. ఆల్‌రౌండర్లు బంతితో ఆదుకుంటే ఒత్తిడి తగ్గుతుంది.
Also Read: నలుగురు కెప్టెన్లు.. నానా చర్చలు.. 18 ఓవర్ ముందు యాంటీ క్లైమాక్స్! 'నా మాటే శాసనం' అని ఎవరన్నారో?
Also Read: పాక్ విజయానికి 'పంచ సూత్రాలు'.. కోహ్లీసేన పరాభవానికి కారణాలు! మిస్టేక్ అయింది ఇక్కడే..!
Also Read: India Vs Pakistan: నిన్న వెస్టిండీస్.. నేడు టీమిండియా.. ‘6’ సెంటిమెంట్ వెక్కిరించిందా?
Also Read: IND vs PAK, Match Highlights: దాయాది చేతిలో దారుణ ఓటమి.. పాక్‌పై పది వికెట్లతో చిత్తయిన టీమిండియా!
West Indies go down to England in T20 World Cup Opener.
— Windies Cricket (@windiescricket) October 23, 2021
Match Report: https://t.co/2qjaY4sLaZ