అన్వేషించండి

IND vs PAK, Match Highlights: దాయాది చేతిలో దారుణ ఓటమి.. పాక్‌పై పది వికెట్లతో చిత్తయిన టీమిండియా!

ICC T20 WC 2021, IND vs PAK: టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ పది వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది.

టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌కు ఘోర పరాజయం ఎదురైంది. దాయాది దేశం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 151 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన పాక్ ఓపెనర్లు బాబర్ ఆజమ్ (68 నాటౌట్: 52 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు), మహ్మద్ రిజ్వాన్ (79 నాటౌట్: 55 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా ఆడటంతో పాకిస్తాన్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో పాకిస్తాన్.. భారత్‌పై గెలవడం ఇదే మొదటిసారి. ఈ ఓటమితో టీ20 వరల్డ్‌కప్‌లో సెమీస్‌కు వెళ్లాలంటే దాదాపు అన్ని మ్యాచ్‌లూ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు కీలక వికెట్లు తీసిన షహీన్ అఫ్రిదికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

కింగ్ కోహ్లీ ఫాంలోకి..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. మొదటి ఓవర్‌లో రోహిత్ శర్మ(0: 1 బంతి), మూడో ఓవర్లో ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌లను (3: 8 బంతుల్లో) అవుట్ చేసి షహీన్ అఫ్రిది పాకిస్తాన్‌కు మంచి బ్రేక్ అందించాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (11: 8 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కూడా అవుటవ్వడంతో ఆరు ఓవర్లు ముగిసేసరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 36 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత రిషబ్ పంత్ (39: 30 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), విరాట్ కోహ్లీ (57: 49 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించారు. వికెట్లు పడిన ఒత్తిడి లేకుండా స్కోరింగ్ రేట్ పడకుండా వీరిద్దరూ బ్యాటింగ్ చేశారు. దీంతో పది ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 60 పరుగులను భారత్ సాధించింది.

హసన్ అలీ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో పంత్ రెండు వరుస సిక్సర్లు రాబట్టాడు. అయితే ఆ తర్వాతి ఓవర్లోనే షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అవ్వడంతో.. భారత్ మరోసారి కష్టాల్లో పడింది. జడేజా (13: 11 బంతుల్లో, ఒక ఫోర్), కోహ్లీ కాసేపు నిదానంగా ఆడారు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో 45 బంతుల్లో కోహ్లీ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్లో జడేజా కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత షహీన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో విరాట్ కోహ్లీ అవుటయినా 17 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా అవుట్ కావడంతో.. కేవలం ఏడు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో షహీన్ అఫ్రిది మూడు వికెట్లు తీయగా, హసన్ అలీ రెండు వికెట్లు, షాదబ్ ఖాన్, రవూఫ్ చెరో వికెట్ తీశారు.

ఒక్క వికెట్టూ తీయలేక..
ఇక పాకిస్తాన్ బ్యాటింగ్.. భారత్ బ్యాటింగ్‌కు పూర్తి భిన్నంగా సాగింది. పాక్ ఓపెనర్లు బాబర్ ఆజమ్ (68 నాటౌట్: 52 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు), మహ్మద్ రిజ్వాన్ (79 నాటౌట్: 55 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) టీమిండియాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. కనీసం ఒక్క సాధికారిక అప్పీల్ కానీ, ఒక క్యాచ్ కానీ.. ఏ అవకాశం ఇవ్వకుండా పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఆడారు. పవర్ ప్లేలో నుంచే వీరు వేగంగా ఆడటం ప్రారంభించారు. దీంతో ఆరు ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. స్పిన్నర్ల బౌలింగ్‌లో మొదట ఇబ్బంది పడినా.. మెల్లగా వారి బౌలింగ్‌లో కూడా పరుగులు సాధించారు. పది ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 71 పరుగులకు చేరుకుంది.

పది ఓవర్ల తర్వాత వీరు గేర్ మార్చారు. వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో వీరు 16 పరుగులు రాబట్టారు. ఆ తర్వాత రవీంద్ర జడేజా వేసిన ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 121 పరుగులకు చేరుకుంది. ఆ తర్వాత కూడా వీరు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడటంతో పాకిస్తాన్ 17.5 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. 

Also Read: ENG Vs WI, Match Highlights: వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ విజయం.. ఆ రికార్డు బ్రేక్!

Also watch: T20 World Cup 2021: పదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?

Also Read: Virat Kohli Pressmeet: మంటలో పెట్రోల్ పోయను.. మాట్లాడటానికేమీ లేదు.. ప్రెస్‌మీట్‌లో కోహ్లీ ఏమన్నాడంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sandhya Theater: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
Vizag news: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ -  జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Non Detention Policy: 5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sandhya Theater: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
Vizag news: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ -  జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Non Detention Policy: 5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
Allu Arjun Father-in-law: కాంగ్రెస్‌ పెద్దలతో అల్లు అర్జున్ మామ సమావేశం, సంధ్య థియేటర్ ఎపిసోడ్‌లో నెక్ట్స్ ఏం జరగబోతోంది?
కాంగ్రెస్‌ పెద్దలతో అల్లు అర్జున్ మామ సమావేశం, సంధ్య థియేటర్ ఎపిసోడ్‌లో నెక్ట్స్ ఏం జరగబోతోంది?
Paatal Lok 2: సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ 'పాతాళ్‌ లోక్‌' సీజన్‌ 2 - స్ట్రీమింగ్‌ డేట్ వచ్చేసిందోచ్ 
సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ 'పాతాళ్‌ లోక్‌' సీజన్‌ 2 - స్ట్రీమింగ్‌ డేట్ వచ్చేసిందోచ్ 
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Sania Mirza And Shami : దుబాయ్‌లో జంటగా కనిపించిన సానియా మీర్జా, షమీ - సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందా ?
దుబాయ్‌లో జంటగా కనిపించిన సానియా మీర్జా, షమీ - సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందా ?
Embed widget