Changes In Futures And Options: చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
SEBI New Rules: తక్కువ పెట్టుబడిలో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇద్దామనుకునే వాళ్లకు సెబీ చెక్ పెట్టింది. అదే టైంలో మోసాలకు అవకాశం లేకుండా రూల్స్ ఫ్రేమ్ చేసింది.
Stock Markets New Rules : స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఐపీవోలు, ప్రాఫిట్స్ ఈ మధ్య కాలంలో ఏ ఇద్దరు కలుసుకున్నా ఇదే టాపిక్‌పై చర్చ నడుస్తోంది. చిన్న చిన్న పెట్టుబడులతో అధిక లాభాలు తీసుకునేందుకు స్టాక్ మార్కెట్ చాలా మందికి ఓ ఆప్షన్‌గా కనిపిస్తోంది. మరోవైపు పక్క వారిని చూసి ఎలాంటి అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్‌లో ఊరూ పేరూ లేని సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నా వాళ్లు కూడా ఉన్నారు. అందుకే దీన్ని కట్టడి చేయడానికి సెబీ రంగంలోకి దిగింది. ప్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో భారీ మార్పులు చేస్తూ కొత్త సర్క్యులర్ జారీ చేసింది సెబి(Securities and Exchange Board of India ).
ఎవరు పడితే వాళ్లు మార్కెట్‌లోకి వచ్చి ఇష్టం మోసాలు చేయడానికి వీలు లేకుండా ఉండటంతో పాటు చిన్న మదుపురులను కంట్రోల్ చేసేలా ఈ రూల్స్ ఫ్రేమ్స్ చేసింది సెబీ. సెబీ ఆదేశాల మేరకు నేషనల్ స్టాక్ ఎక్సెంజి బోర్డు కొత్త సర్క్యులర్ విడుదల చేసింది. చాలా మార్పులు ఇందులో ఉన్నాయి. అందులో ప్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో చేసిన మార్పులే ప్రధానమైనవి.
తాజాగా చేసిన మార్పుల ప్రకారం నవంబర్ 20 నుంచి డేరీటీవ్స్ కాంట్రాక్స్ట్‌లలో వీక్లీ ఎక్స్‌పయిరీస్ తొలగించి మంత్లీ ఎక్స్‌పయిరీస్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఎన్‌ఎస్‌ఈ వెబ్ సైట్‌లో వీక్లీ కాంట్రాక్ట్స్ తొలగించి, మంత్లీ కాంట్రాక్ట్స్‌ను పొందుపరిచింది. ఎఫ్ అండ్ వో సెగ్మెంట్‌లో ఎక్కువగా ఇండెక్స్ ట్రెడింగ్ ప్రధానమైంది. ఇందులో రిటైలర్ ట్రేడర్స్ పెద్ద ఎత్తున ట్రేడింగ్ చేస్తారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చన్న కారణంగా ఈ సెగ్మెంట్లో ట్రేడర్స్‌ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. అయితే దీనిలో కూడా కొన్ని మార్పులు జరగనున్నాయి . ప్రధాన ఇండెక్స్ అయిన నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాంప్ నిఫ్టీ, నిఫ్టీ నెక్స్ట్ 50 లలో లాట్ సైజుల్లో మార్పులు తీసుకువచ్చింది.
ఎఫ్ అండ్ వో(futures and options) సెగ్మెంట్ లో ఇండేక్స్ మార్పులు ఇలా..
ఎన్‌ఎస్‌ఈ( National Stock Exchange)
ఇండెక్స్ | ప్రస్తుత లాట్ సైజ్ | రివైజింగ్ లాట్ సైజ్ |
నిఫ్టీ 50 | 25 | 75 |
నిఫ్టీ బ్యాంక్ | 15 | 30 |
నిఫ్టీ ఫైనాన్సియల్ సర్వీస్ | 25 | 65 |
నిఫ్టీ మిడ్ క్యాప్ సెలక్ట్ | 50 | 120 |
నిఫ్టీ నెక్స్ట్ 50 | 10 | 25 |
లాట్ సైజ్ పెంచడం వల్ల ఏం జరగనుంది. ?
లాట్ సైజ్ పెంచడం వల్ల ఎఫ్ అండ్ వో లో తక్కువ డబ్బులతో ట్రెడింగ్ చేసే వారికి చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. లాట్ సైజ్ పెరగడం వల్ల మార్కెట్లో లిక్విడిటీ తగ్గుతుంది. హై రిస్క్, హై ప్రాఫిట్ ఉంటుంది. దీని వల్ల చిన్న స్థాయి ట్రేడర్లు ఎప్ అండ్ వో సెగ్మెంట్‌లో ట్రేడ్ చేసే అవకాశం ఉండదు. ఒక వేళ ట్రేడింగ్ చేస్తే లాట్ సైజ్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ పెట్టుబడి మార్కెట్లో పెట్టాల్సి ఉంది. హై రిస్క్ ఉంటుంది. దీని వల్ల ట్రేడింగ్ కంపెనీలు, బ్రోకర్లు, ట్రేడింగ్ ఫ్రోఫెషనల్స్ మాత్రమే స్టాక్ మార్కెట్లో ఎఫ్. అండ్ వో సెగ్మెంట్ అనుకూలంగా ఉంటుంది.
ఈ మార్పుల వెనుక కారణం ఇదేనా ?
ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ బీహార్ సహా తెలంగాణలోను ఎఫ్ అండ్ వోసెగ్మెంట్‌లో చిరు ట్రేడర్లు బాగా నష్టపోతున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఎక్కువ లాభాలు వస్తాయన్న ఆశ సరైన అవగాహన లేకుండా మారెట్లో ఎక్కువ మంది చిన్న స్థాయి ట్రేడర్లు ప్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లోకి దిగి తీవ్రంగా నష్టపోతున్నట్లు ఈ నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఈ పరిస్థితిని అరికట్టడానికి ఈ సర్క్యులర్ తీసుకువస్తున్నట్లు స్టాక్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ కారణంతోనే ఇండెక్స్ లాట్ సైజ్ పెంచడం, వీక్లీ కాంట్రాక్ట్‌లు తొలగించి వాటి స్థానంలో మంత్లీ కాంట్రాక్ట్ తీసుకురావడం జరిగింది. దీని వల్ల మార్జిన్ పెరిగి రిటైల్ ట్రేడర్స్ పై ప్రభావం చూపనుంది. చాలా మంది రిటైల్ ట్రేడర్స్ ఎఫ్ అండ్ వో సెగ్మెంట్ వదిలి స్టాక్స్‌లో ట్రేడ్ చేస్తారన్నది సెబీ ఆలోచనగా చెబుతున్నారు. కానీ అంత త్వరగా ఎఫ్ అండ్ వోను వదిలే పరిస్థితి ఉండదని స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం.
Also Read: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!