అన్వేషించండి

Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!

Tirumala News: తిరుమల శ్రీవారి దర్శనం 2, 3 గంటల్లోనే పూర్తయ్యేలా చర్యలు చేపట్టనున్నట్లు టీటీడీ సోమవారం తెలిపింది. ఈ క్రమంలో పాత దర్శనం విధానాలు అమలు చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

TTD Decision On Venkateswara Darshan: తిరుమలలో (Tirumala) సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు 2, 3 గంటల్లోనే శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ (TTD) నిర్ణయించింది. ఈ మేరకు ఇది ఎలా సాధ్యమనే విషయాలు పరిశీలిస్తే.. కంకణం విధానం తిరిగి అమల్లోకి తీసుకొస్తారనే ప్రచారం సాగుతోంది. కాగా, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశుని దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. వీరికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ.10,500 ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవలు, స్లాట్ దర్శనం, సర్వ దర్శనం వంటి విధానాలు అమల్లో ఉన్నాయి. తిరుమలకు వచ్చే భక్తులు అత్యధికులు సామాన్య భక్తులే. వీరికి పెద్దపీట వేస్తామని టీటీడీ నూతన పాలక మండలి చెబుతోంది. అయితే, రద్దీ ఉన్న సమయాల్లో వైకుంఠం రెండో క్యూ కాంప్లెక్స్‌లోనే దాదాపు 30 గంటలు స్వామి వారి దర్శనం కోసం సామాన్య భక్తులు వేచి చూాడాల్సి వస్తోంది.

స్లాట్ దర్శనం అంటే శ్రీనివాసం, విష్ణునివాసంలో ఆధార్ కార్డు ద్వారా భక్తులకు దర్శన సమయం కేటాయిస్తారు. దీంతో 2, 3 గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది. అయితే, ఈ టికెట్లు పరిమితంగానే ఉంటాయి. అటు, అలిపిరి, శ్రీవారి మెట్ల నుంచి కాలి నడకన వచ్చే భక్తులకు గతంలో దివ్య దర్శనం పేరుతో కొన్ని టికెట్లు కేటాయించేవారు. ఇందులో భాగంగా 2, 3 గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తయ్యేది. అయితే, గత ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసింది.

ఆ విధానం ప్రవేశ పెడతారా.?

  • 2 దశాబ్దాల కిందట టీటీడీ ఈవోగా ఐవీ సుబ్బారావు ఉన్న సమయంలో 'కంకణం' విధానం ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ప్రతీ భక్తుడి చేతికి రిస్ట్ బాండ్ తరహాలో ఓ కంకణాన్ని ట్యాగ్ చేస్తారు. ఇది వాటర్ ప్రూఫ్ తరహాలో ఉంటుంది.
  • దీన్ని తిరుపతిలోని అనే కేంద్రాలతో పాటు రేణిగుంట తదితర ప్రాంతాల్లో వేసేవారు. ఈ విధానంతో మనకు కేటాయించిన సమయానికి వెళ్లి 2, 3 గంటల్లోనే స్వామి దర్శనం చేసుకుని రావొచ్చు. 
  • టీటీడీ ప్రస్తుత ఛైర్మన్ ఈ అంశాన్ని గతంలో ప్రస్తావించారు. దీన్నే తిరిగి అమలు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
  • కాగా, 30 ఏళ్ల క్రితం వరకూ సామాన్య భక్తుడు కూడా శ్రీవారి మూలవిరాట్‌ను అత్యంత సమీపంలో అంటే కులశేఖరపడి వరకూ వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. ప్రస్తుతం వీఐపీలు, రూ.10,500 దర్శనాలకు మాత్రమే ఇక్కడి వరకూ అనుమతిస్తున్నారు.
  • ఆ తర్వాతి కాలంలో లఘు దర్శనం ఏర్పాటు చేశారు. దీని ప్రకారం గరుడాళ్వార్ సన్నిధి నుంచి జయవిజయులను దాటి స్నపన మండపం వరకూ వెళ్లి దర్శించుకునేవారు. అనంతరం దీన్ని కూడా రద్దు చేసి గరుడాళ్వార్ సన్నిధి నుంచి దర్శనం కల్పిస్తున్నారు. దీనికి మహా లఘుదర్శనంగా పేరు పెట్టారు.
  • అయితే, భక్తులు మాత్రం లఘుదర్శనం కల్పించాలని కోరుతున్నారు. ఇలా చేస్తే దేవదేవుని సన్నిధిలో ప్రవేశించామన్న ఆనందానుభూతి కలుగుతుందని చెబుతున్నారు. దీన్ని పాలక మండలి పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు.

టీటీడీ నిర్ణయాలు

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో సోమవారం జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్టును రద్దు చేసి ప్రధాన ట్రస్ట్‌కే ఆ నిధులు తరలిస్తామని తెలిపారు. శ్రీవాణి పథకం మాత్రం కొనసాగుతుందని ఛైర్మన్ చెప్పారు. 'అన్యమతస్తులను వేరే చోటకు బదిలీ చేయాలని నిర్ణయం. శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు పునరుద్ధరణ. తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు. నిత్యన్నదాన కార్యక్రమాన్ని మరింత మెరుగుపరుస్తాం. లడ్డూలోని నెయ్యి నాణ్యతను మరింత పెంచాలని నిర్ణయం. టీటీడీ ఉద్యోగులకు 10 శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయం. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయం. టూరిజం శాఖ ద్వారా ఇచ్చే టికెట్లను రద్దు చేయాలని నిర్ణయం. టూరిజం శాఖ ఇచ్చే 4 వేల టికెట్ల రద్దుకు నిర్ణయం. టూరిజం శాఖ ఇచ్చే టికెట్లలో అవకతవకలు జరిగాయి. ఏఐ సహకారంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం. ఏళ్ల తరబడి డంపింగ్ యార్డులో పేరుకున్న చెత్తను తొలగిస్తాం. తిరుపతిలోని స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం. శారదాపీఠం లీజు రద్దు చేసి స్థలం స్వాధీనం చేసుకుంటాం. ముంతాజ్ హోటల్స్ సంస్థకు గత ప్రభుత్వం ఇచ్చిన భూముల లీజ్ రద్దు. ప్రసాదాల తయారీ పోటుకు మరమ్మతులు చేయాలని నిర్ణయం.' చేసినట్లు ఛైర్మన్ పేర్కొన్నారు.

Also Read: Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget