(Source: ECI/ABP News/ABP Majha)
వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడి
ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన పనితీరును విమర్శిస్తూ హెచ్చరించారు. ఇటీవల ఆయన ఓ కార్యక్రమానికి వెళ్లి ప్రసంగిస్తున్న సమయంలో చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఆయన సమక్షంలోనే వైసిపి నాయకునిపై దాడి జరిగింది. కాకినాడలోని మెక్లరిన్ స్కూల్ గ్రౌండ్ లో శెట్టిబలిజ వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లిన మంత్రి సుభాష్ శెట్టిబలిజ సంఘానికి చెందిన ఓ నాయకుని పైన తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీకి చెందిన రామచంద్రపురం మండల వైసిపి అధ్యక్షుడు కట్టా సూర్యనారాయణ ఘాటుగా స్పందించారు. దీంతో ఒక్కసారిగా మంత్రి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరవాత మంత్రి అనుచరులు ఆ వైసీపీ నేతపై దాడి చేశారు. ఇంతలో పోలీసులు వచ్చి సర్ది చెప్పారు. అప్పటికే మంత్రి అనుచరులు ఆ వైసీపీ నాయకున్ని గాయపరిచారు. కుర్చీలు విసురుతూ దాడి చేశారు.