Supreme Court: రాజ్యాంగ ప్రవేశికపై దాఖలైన పిటిషన్లపై విచారణ, సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
Indian Constitution | భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చిన సామ్యవాద, లౌకిక అనే పదాలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం నాడు కొట్టివేిసింది.
Supreme Court Junks Pleas Against Insertion Of 'Socialist' And 'Secular' In Preamble | న్యూఢిల్లీ: అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం భారత్. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగానూ భారత్ ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అయితే రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచిన లౌకిక, సామ్యవాద పదాలు తొలగించాలని దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రవేశికలో ఆ రెండు పదాలను తొలగించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆ పిటిషన్లపై విచారణ చేపట్టింది. రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న లౌకిక, సామ్యవాద అనే పదాలు తొలగించాలన్న పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది.
1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో సామ్యవాద, లౌకిక అనే పదాలు చేర్చారు. ఈ పదాలను సవాలు చేస్తూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సహా పలువురు పిటిషన్లు వేశారు. ఆ సమయంలో పార్లమెంట్ లో దీనిపై చర్చ జరగకుండానే పదాలను ప్రవేశికలో చేర్చారని పిటిషనర్ల వాదన. రాజ్యాంగంపై పార్లమెంట్ కు ఉన్న సవరణ అధికారం పీఠికకు సైతం వర్తిస్తుందని, కానీ ఇన్నేళ్ల తరువాత ఆ విషయంపై చర్చకు వచ్చి, పిటిషన్లు దాఖలు కావడంతో సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆర్టికల్ 368 ప్రకారం ప్రభుత్వానికి అధికారం ఉంటుందన్నారు. అధికారాన్ని తగ్గించదని కోర్టు పేర్కొంది.
ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగ సవరణపై పిటిషన్లు
భారతదేశంలో ఎమర్జెన్సీ సమయంలో 1975- 77 మధ్య కాలంలో జరిగిన రాజ్యాంగ సవరణల చట్టబద్ధతను పిటిషనర్లు ఛాలెంజ్ చేశారు. దీనిపై దాఖలైన అన్ని ఈ పిటిషన్లపై విచారణ చేపట్టి సుప్రీంకోర్టు పలుమార్లు వాదనలు విన్నది. నవంబర్ 22న తీర్పు రిజర్వ్ చేసిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం (నవంబర్ 25) నాడు ఆ పిటిషన్లను కొట్టివేసింది. సోషలిజం అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, సమానత్వం అని అర్థం వస్తుందని ధర్మాసనం పేర్కొంది. దీనిని మరో రకంగా చూడకూదని, అందరికీ సమానత్వం అనే విషయంపై రాజ్యాంగం ఎన్నటికీ అడ్డు చెప్పదని, సెక్యూలర్ పదం సైతం అంతా ఒకటే అని చెబుతుందన్నారు.
చాలా ఏళ్ల తరువాత ఈ విషయాన్ని ఎందుకు లేవనెత్తారు అని సీజేఐ సంజీవ్ ఖన్నా అడిగారు. సోషలిజం, లౌకికవాదం అనే పదాలకు అర్థం పలు సందర్బాలలో వివరించినట్లు పేర్కొన్నారు. గత విచారణలో లాయర్ న్యాయవాది విష్ణు శంకర్ జైన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 (బి) ప్రకారం ఏదైనా వర్గం సంక్షేమం కోసం ప్రైవేట్ వనరులను తీసుకునే రాష్ట్ర అధికారాలపై ఇటీవల 9 మంది న్యాయమూర్తుల బెంచ్ తీర్పును ప్రస్తావించారు. ఇతర దేశాలతో పోల్చితే భారతదేశంలో సోషలిజం భిన్నంగా ఉందని సీజేఐ వ్యాఖ్యానించారు. బీజేపీ నేత డాక్టర్ సుబ్రమణ్యస్వామి, బలరామ్ సింగ్, లాయర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ లౌకికవాద, సామ్యవాదం పదాలను ఛాలెంజ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది.
Also Read: Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా !