Nani: మహాభారతంలో నాని ఫిక్స్... కన్ఫర్మ్ చేసిన రాజమౌళి
Rajamouli Mahabharata Cast: దర్శక ధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం. అది తీయడానికి ఇంకా టైం ఉంది. ఎప్పుడు తీసిన సరే అందులో నాని మాత్రం ఉంటాడని ఆయన కన్ఫర్మ్ చేశారు.

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం (Mahabharat Movie). ఒకటి కాదు... రెండు మూడు పార్టీలుగా పురాణ ఇతిహాస గ్రంధాన్ని జక్కన్న వెండితెరపైకి తీసుకు రానున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పాన్ వరల్డ్ సినిమా (SSMB29) తీస్తున్న రాజమౌళి... మహాభారతాన్ని సెట్స్ మీదకు తీసుకు వెళ్లడానికి ఇంకా చాలా సమయం ఉంది. అది ఎప్పుడు తీసినా సరే... అందులో నాచురల్ స్టార్ నాని (Nani) ఒక క్యారెక్టర్ చేస్తారని తెలిపారు. అది ఫిక్స్, అందులో మరో డౌట్ లేదు.
మహాభారతంలో నాని... కన్ఫర్మ్ చేసిన రాజమౌళి!
నాని కథానాయకుడిగా నటించిన 'హిట్ 3' (Hit 3) మే 1న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దానికి రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రెగ్యులర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు భిన్నంగా... వెరైటీగా ఈ ఫంక్షన్ జరిగింది. అందులో భాగంగా రాజమౌళి నానిని యాంకర్ సుమ ఇంటరాగేషన్ చేశారు. అప్పుడు మహాభారతంలో నాని ఒక క్యారెక్టర్ చేస్తున్నారని సుమ అడగ్గా... ''మహాభారతంలో నాని ఉంటాడు'' అని రాజమౌళి చెప్పారు. అది సంగతి!
#Nani will definitely be a part of Mahabharatam
— IndiaGlitz Telugu™ (@igtelugu) April 27, 2025
- #SSRajaMouli#HIT3 #HIT3FromMay1st @NameisNani pic.twitter.com/TUPUmLEVjX
నా ఊహను మించి నాని ఎదిగాడు - రాజమౌళి!
రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఈగ'లో నాని నటించారు. ఆ సినిమాలో హీరోది చాలా చిన్న పాత్ర. అయితే ఈగ రూపంలో చివరి వరకు ఉంటారు. ఆ క్యారెక్టర్ నాని చేశారు. అప్పటి నుంచి రాజమౌళి కుటుంబంతో నానికి అనుబంధం ఏర్పడింది. తాను అనుకున్న దాని కంటే నాని ఎత్తుకు ఎదిగాడని 'హిట్ 3' ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళి చెప్పారు.
Also Read: కశ్మీర్ ఇండియాదే... పాకిస్తాన్ మీద ఎటాక్ చేయాల్సిన పనే లేదు - విజయ్ దేవరకొండ
నేను ఎక్స్ పెక్ట్ చేసిన దానికన్నా #Nani చాలా ముందుకెళ్లిపోయాడు - #SSRajamouli pic.twitter.com/1P0kok97Y1
— Rajesh Manne (@rajeshmanne1) April 27, 2025
నాని సినిమా చూసేందుకు ఉదయం ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్లకు రాజమౌళి ఫ్యామిలీ రావడం కొన్నాళ్ళుగా జరుగుతున్న ఆనవాయితీ. అయితే ఇటీవల ఆ సెంటిమెంట్ కి బ్రేక్ పడిందని, కానీ 'హిట్ 3' సినిమాను రాజమౌళి ఫ్యామిలీతో కలిసి చూస్తానని నాని పేర్కొన్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన 'హిట్ 3' సినిమాలో కేజిఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటించారు. అడవి శేష్ అతిథి పాత్ర చేశారు. 'హిట్ 2'లో ఆయన క్యారెక్టర్ ఇందులో కూడా కంటిన్యూ అవుతుంది. 'హిట్ 3' మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి అడ్వాన్స్ బుకింగ్ కూడా జోరుగా జరుగుతున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమా విడుదల అవుతోంది.
Also Read: ఏఆర్ రెహమాన్ కాపీ కొట్టారు... రెండు కోట్లు డిపాజిట్ చేయండి... ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు





















