MI vs LSG Match Highlights IPL 2025 | లక్నో సూపర్ జెయింట్స్ పై 54పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం | ABP Desam
ఆరో విజయం కోసం ఇరు జట్లూ ఈ రోజు హోరా హోరాగా తలపడాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ను కంప్లీట్ గా డామినేట్ చేసింది ముంబై ఇండియన్స్. ఏకంగా 54 పరుగుల భారీ తేడాతో నెగ్గిన ముంబై పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానానికి ఎగబాకిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. ర్యాన్ రికెల్టన్ షో
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణయం తప్పని నిరూపించేలా ముంబై ఇండియన్స్ ఓపెనర్ ర్యాన్ రికెల్టెన్ దడదడలాడించాడు. వరుసగా రెండు హాఫ్ సెంచరీలు కొట్టి ఊపు మీదున్న రోహిత్ శర్మ రెండు సిక్సులు కొట్టి దూకుడు చూపించినా 12 పరుగులకే అవుట్ కాగా...వన్ డౌన్ లో వచ్చిన విల్ జాక్స్ బౌండరీలతో డీల్ చేస్తూ 29 పరుగులు చేశాడు. అయితే మరోవైపు ర్యాన్ రికెల్టన్ మాత్రం తను ఫామ్ లోకి వచ్చిన అంశాన్ని బలంగా చాటుకునేలా బ్యాటింగ్ చేశాడు. 32 బాల్స్ లో 6 ఫోర్లు 4 సిక్సర్లతో 58పరుగులు చేసిన రికెల్టన్ తను అవుట్ అయ్యే టైమ్ కి 8 ఓవర్లకే LSG స్కోరును 88 పెట్టాడు.
2. సూర్యాభాయ్ సూపర్ ఫిఫ్టీ
రికెల్టన్ అవుటయ్యాక దిగిన సూర్యా భాయ్ ఆడిన మొదటి ఓవర్ నుంచి బాదుతునే ఉన్నాడు. విల్ జాక్స్ ను నాన్ స్టైక్ లో ఎక్కువ ఉంచుతూ వీలైనంత స్కోరు లాగే ప్రయత్నం చేశాడు సూర్య కుమార్ యాదవ్. 28 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతో 54 పరుగులు చేసి సూర్య ముంబై ను భారీ స్కోరు దిశగా తెలుసుకున్నాడు.
3. నమన్, కార్బిన్ క్యామియో
రికెల్టన్, సూర్య కుమార్ హాఫ్ సెంచరీలు చేసినా ముంబై 200 దాటుతుందా లేదా అన్న సందేహాన్ని బద్ధలు కొట్టేలా కోర్బిన్ బోస్, నమన్ ధీర్ లు బ్యాట్ ఝళిపించారు. కోర్బిన్ 10 బంతుల్లో 2 ఫోర్లు ఓ సిక్సర్ తో 20 పరుగులు చేస్తే...నమన్ ధీర్ 11 బాల్స్ ఆడి 2 ఫోర్లు 2 సిక్సర్లతో 25 పరుగులు చేయటంతో ముంబై ఇండియన్స్ లక్నోకు ఏకంగా 216పరుగులు భారీ టార్గెట్ ను సెట్ చేయగలిగింది.
4. బూమ్ బూమ్ బుమ్రా
217 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నోను రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ముంబై బౌలర్లు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. మంచి ఫామ్ లో ఉన్న మార్ క్రమ్ ను 9 పరుగులకే బుమ్రా తన మొదటి ఓవర్ బౌలింగ్ లోనే అవుట్ చేయగా...తన కోటాలో 3 ఓవర్..ఇన్నింగ్స్ 16 వ ఓవర్ లో LSG కుదేలు చేసి పారేశాడు. మిల్లర్, అబ్దుల్ సమద్, ఆవేశ్ ఖాన్ ల వికెట్లు తీసుకున్నాడు బుమ్రా. సమద్ ఆవేశ్ ఖాన్ లవి అయితే క్లీన్ బౌల్డ్స్..మొత్తంగా 4 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4వికెట్లు తీసుకున్నాడు.
5. బౌల్ట్, విల్ జాక్స్ మాస్
బుమ్రా నే ఓ వైపు చావగొడుతున్నాడంటే మరో వైపు ట్రెంట్ బౌల్ట్, విల్ జాక్స్ కూడా LSG ని కుదురుకోనివ్వలేదు. 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన విల్ జాక్స్...రెండు ఓవర్లలో ప్రమాదకర నికోలస్ పూరన్, కెప్టెన్ రిషభ్ పంత్ వికెట్లను తీశాడు. మరో ఎండ్ ట్రెంట్ బౌల్ట్ తన క్లాస్ ప్లస్ మాస్ ను బౌలింగ్ లో చూపించాడు. ఫామ్ లో ఉన్న మిచ్ మార్ష్ ను, ఆయుష్ బడోనీని...చివర్లో దిగ్వేష్ రాఠీని ఔట్ చేసిన బౌల్ట్ మొత్తం 3 వికెట్లు తీసి LSG ని 161 పరుగులకే ఆలౌట్ చేయటం ద్వారా ముంబైకి 54పరుగులకే భారీ విజయాన్ని అంధించాడు.
ఈ విక్టరీ ద్వారా ముంబై ఇండియన్స్ 10 మ్యాచుల్లో 6 విజయాలతో పాయింట్స్ టేబుల్ లో 2వ స్థానానికి ఎగబాకితే...మ్యాచ్ ఓడిన LSG ఆరో స్థానానికి దిగింది.





















