DC vs RCB Match Highlights IPL 2025 | ఢిల్లీ క్యాపిటల్స్ పై 6వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం | ABP Desam
సమ ఉజ్జీలాంటి రెండు జట్ల మధ్య ఈ రోజు ఐపీఎల్ పోరు జరిగింది. బెంగుళూరులో తమను ఓడించిన ఢిల్లీని..ఢిల్లీ సొంత గడ్డమీదే ఓడించాలని కసితో ఉన్న రాయల్స్ చాలెంజర్స్ బెంగుళూరు తను అనుకున్నది సాధించి 6వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. ఆపద్భాంధవుడు కేఎల్ రాహుల్
మొన్న బెంగుళూరులో బెంగళూరును కొట్టి కాంతార సెలబ్రేషన్ చేసిన కేఎల్ రాహుల్..ఈ రోజు కూడా తన ఢిల్లీ జట్టు భారాన్ని తనే మోశాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ...పరుగులు బాగానే ఇస్తున్నట్లు కనిపించినా వికెట్లు కూడా తీశారు వాళ్ల బౌలర్లు. రాగానే విరుచుకుపడిన ఓపెనర్ పోరెల్ వికెట్ ను హేజిల్ వుడ్ తీస్తే...టెస్ట్ ఆడుతున్న డుప్లెసిని కృనాల్ పాండ్యా, కరుణ్ నాయర్ ను యశ్ దయాల్ అవుట్ చేశారు. ఇక అలాంటి టైమ్ లో టీమ్ భారాన్ని మీదేసుకున్నాడు రాహుల్. 39 బాల్స్ ఆడినా 3 ఫోర్లతో 41పరుగులు చేసిన రాహుల్ భువనేశ్వర్ బౌలింగ్ లో అవుటయ్యాడు.
2. భువీ మ్యాజిక్
ఆర్సీబీ బౌలింగ్ లో మెరుపు దెబ్బేసింది ఎవరన్నా ఉన్నారంటే అది భువనేశ్వర్ కుమారే. అసలే టాప్ ఆర్డర్ ఫెయింది పోనీ మిడిల్ తో మంచి స్కోరు చేద్దామనుకున్న ఢిల్లీని తన బౌలింగ్ తో దెబ్బ తీశాడు భువీ. 4 ఓవర్లలో 33 పరుగులు 3 వికెట్లు తీశాడు. వాళ్లలో ప్రమాదకర కేఎల్ రాహుల్, స్టబ్స్, అశుతోష్ శర్మ వికెట్లు ఉన్నాయి. విప్రాజ్ నిగమ్ ను రన్ అవుట్ కూడా చేసి ఢిల్లీ భారీ స్కోరు కొట్టకుండా అడ్డం పడిపోయాడు భువనేశ్వర్ కుమార్.
3. స్టబ్స్ క్యామియో
మొత్తంగా ఢిల్లీ 162 పరుగులన్నా చేసింది అంటే రీజన్ స్టబ్స్. 18 బాల్స్ ఆడిన స్టబ్స్ 5 ఫోర్లు ఓ సిక్సర్ తో చేసిన 34 పరుగులే ఆర్సీబీకి 163పరుగుల టార్గెట్ ఇవ్వగలిగాయి.
4. అక్షర్ పటేల్ అరుపులు
పిచ్ కండీషన్స్ ను అద్భుతంగా స్టడీ చేసిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మొదటి తనే బౌలింగ్ కి వచ్చి ఆశ్చర్య పరిచాడు. పరుగులను కట్టడి చేయటంతో పాటు రెండు కీలక వికెట్లు తీసి ఆర్సీబీ కి ఊహించని షాక్ కూడా ఇచ్చాడు. ఊపు చూపిస్తున్న జాకెబ్ బెత్ హెల్ ను అవుట్ చేయటంతో పాటు...దేవదత్త్ పడిక్కల్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు అక్షర్. మరో వైపు రజత్ పటీదార్ రన్ అవుట్ అవ్వటంతో ఆర్సీబీ 26 పరుగులకే 3వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
5. కింగ్ సహనం - కృనాల్ పోరాటం
ఆర్సీబీ కుప్పకూలిపోకుండా కృనాల్ పాండ్యా తో కలిసి కింగ్ విరాట్ కొహ్లీ ఇన్నింగ్స్ ను సహనంగా నడిపించాడు. స్పిన్నర్లను అడ్డుకుంటూ...పేసర్లను బాదుకుంటూ స్కోరు బోర్డును ముందుకు కదలించారు కృనాల్, విరాట్. ప్రత్యేకించి కృనాల్ పాండ్యా సిక్సర్స్ తో రెచ్చిపోయాడు. బంతుల్లో ఫోర్లు సిక్సర్లతో పరుగులు చేశాడు కృనాల్. మరో వైపు విరాట్ కొహ్లీ కూడా పరిస్థితులకు తగ్గట్లుగా ఆడుతూ 47 బాల్స్ లో 4 ఫోర్లతో 51పరుగులు చేశాడు విరాట్. ఈ సీజన్ లో 6 వ హాఫ్ సెంచరీ ఇది విరాట్ కు. చివర్లో విరాట్ అవుటైనా 47బంతుల్లో 5ఫోర్లు 4సిక్సర్లతో 73పరుగులు చేసిన కృనాల్, టిమ్ డేవిడ్ కలిసి మిగిలిన పనిని పూర్తి చేసేసి ఢిల్లీని ఢిల్లీ లో ఓడించి 6వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టేయటంతో పాటు 14పాయింట్స్ తో టేబుల్ లో మొదటి స్థానాన్ని ఆర్సీబీ సగర్వంగా అధిష్టించింది.





















