DC vs RCB Match Preview IPL 2025 | ఈరోజు డీసీ, ఆర్సీబీ జట్ల మధ్య హోరా హోరీ పోరు | ABP Desam
మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆర్సీబీకి మధ్య బెంగుళూరు చిన్న స్వామిలో ఓ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో ఆర్సీబీ విసిరిన 164పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 17.5 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. ఆ మ్యాచ్ లో ఢిల్లీని దగ్గరుండి గెలిపించింది కేఎల్ రాహుల్. 53 బాల్స్ లో 7ఫోర్లు, 6 సిక్సర్లతో 93 పరుగులు చేసి కేఎల్ రాహుల్..స్టబ్స్ తో కలిసి ఆర్సీబీ పై రుద్రతాండవం ఆడాడు. ఆర్సీబీ బౌలర్లకు సౌండ్ ఆఫ్ చేస్తూ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత చిన్నస్వామి గడ్డపై ఇదిగో ఈ సెలబ్రేషన్ చేశాడు రాహుల్. కాంతారా సినిమాలో రిషభ్ శెట్టి చేసిన సీన్ ను ఇక్కడ రీ క్రియేట్ చేశాడు రాహుల్. బ్యాట్ లో నేలలో దింపుతూ.. ఈ నేల నాది చిన్నప్పటి నుంచి ఇదే పిచ్ పై ఆడి పెరిగినవాడిని కనుక దీనిపై మొత్తం హక్కు అంతా తనకే ఉందంటూ రాహుల్ రీ క్రియేట్ చేసిన కాంతారా సీన్ సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే ఆ రోజు సైలెంట్ అయిపోయిన ఆర్సీబీ...ఇప్పుడు రివెంజ్ తీర్చుకునే టైమ్ ఇవాళ నచ్చింది. ఇవాళ నైట్ జరిగే మ్యాచ్ లో ఢిల్లీని ఢీకొడుతోంది ఆర్సీబీ. గెలిచిన టీమ్ ఫస్ట్ ప్లేస్ కి వెళ్తుంది అనేది ఓ ఎత్తైతే..ఢిల్లీ విరాట్ కొహ్లీకి హోం గ్రౌండ్. మరి కొహ్లీ కూడా చిన్నప్పటి నుంచి ఇవే గ్రౌండ్స్ లో క్రికెట్ ఆడి పెరిగినవాడే. మొన్న రాహుల్ చేసిన దాన్ని గుర్తు పెట్టుకున్న కొహ్లీ కచ్చితంగా ఈ రోజు ఆర్సీబీని ఢిల్లీ గడ్డపై గెలిపించి కాంతారా రీ క్రియేట్ చేస్తాడని...రాహుల్ బెంగుళూరు లో ఆడి పెరిగితే..తనను ఇంతటివాడిని చేసింది ఢిల్లీనే అని కొహ్లీ కూడా స్టేట్మెంట్ పాస్ చేసేలా బ్యాటింగ్ చేస్తాడంటూ ఊర మాస్ హైప్ ఇస్తున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్.





















