(Source: Poll of Polls)
Mahua Moitra: TMC ఎంపీ మహువా మొయిత్రాపై అనర్హత వేటు? ప్రతిపాదించిన లోక్‌సభ ఎథిక్స్ కమిటీ
MP Mahua Moitra: మహువా మొయిత్రాపై అనర్హతా వేటు వేయాలని లోక్‌సభ ఎథిక్స్ ప్యానెల్ ప్రతిపాదించింది.
MP Mahua Moitra:
అనర్హత వేటు తప్పదా..?
TMC ఎంపీ మహువా మొయిత్రాపై (Mahua Moitra Disqualification) అనర్హతా వేటు వేయాలని లోక్‌సభ ఎథిక్స్ ప్యానెల్ (Lok Sabha Ethics Panel) ప్రతిపాదించింది. మహువా మొయిత్రా తన లోక్‌సభ లాగిన్ క్రెడెన్షియల్స్‌ని బిజినెస్‌మేన్ దర్శన్ హీరానందని (Darshan Hiranandani)కి ఇవ్వడం వివాదానికి దారి తీసింది. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ 'Cash for Query' వివాదంపై చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నవంబర్ 9వ తేదీన లోక్‌సభ ఎథిక్స్ ప్యానెల్ ప్రత్యేకంగా సమావేశమైంది. ఆ ప్యానెల్ ఛైర్మన్ తయారు చేసిన రిపోర్ట్‌లో మొయిత్రాని సస్పెండ్ చేయాలన్న ప్రతిపాదనలున్నాయి. అయితే...ఇప్పటికే సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎంపీ ప్రణీత్ కౌర్ ఈ రిపోర్ట్‌కి అనుకూలంగా ఓటు వేశారు. నలుగురు ప్రతిపక్ష ఎంపీలు మాత్రం వ్యతిరేకించారు. ఈ ఎథిక్స్ కమిటీకి బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ నేతృత్వం వహించారు. ఇప్పటికే బీజేపీ నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మహువా మొయిత్రా. లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు దర్శన్ హీరానందని నుంచి పెద్ద ఎత్తున లంచం తీసుకున్నారని ఆరోపించారు. అయితే...ఈ ఆరోపణల్ని ఎంపీ కొట్టి పారేశారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని మండి పడ్డారు. దర్శన్ హీరానందనికి సమన్లు జారీ చేయాలని లోక్‌సభ ఎథిక్స్ కమిటీని కోరారు. కానీ అందుకు కమిటీ ఒప్పుకోలేదు.
సభా ఉల్లంఘన..
సభా ఉల్లంఘన (Contempt of House) కింద ఆమెని సస్పెండ్ (Mahua Moitra Suspension) చేయాలన్నది కమిటీ తయారు చేసిన రిపోర్ట్‌లోని ప్రధాన అంశం. అంతే కాదు. కఠిన చర్యలూ తీసుకోవాలని తేల్చి చెప్పింది. అయితే...ఈ అంశంపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ఇక్కడ మరో వివాదం ఏంటంటే...ఎథిక్స్ కమిటీలో బీజేపీ నేతలు ఉండడమే కాకుండా తమకు తగ్గట్టుగా రిపోర్ట్‌ని తయారు చేయించుకున్నారన్న ఆరోపణలు రావడం. కేవలం నిముషాల్లోనే నివేదిక రూపొందించడం ఎలా సాధ్యమైందని ప్రతిపక్ష ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఎథిక్స్ కమిటీ రిపోర్ట్‌ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకి పంపనున్నారు. దాన్ని బహిరంగపరచాలా వద్దా అన్నది స్పీకర్ నిర్ణయమే. రూల్స్ ప్రకారమైతే వచ్చే పార్లమెంట్ సెషనల్‌లో ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ కూడా పాల్గొనాలి. ఆ తరవాతే ఈ రిపోర్ట్‌పై డిబేట్ జరుగుతుంది. ఈ చర్చల తరవాత కేంద్రం ఆమెని సస్పెండ్ చేయాలనుకుంటే వెంటనే చేసేయొచ్చు. కమిటీ ప్రతిపాదనలపై మహువా అసహనం వ్యక్తం చేశారు. ఇది Kangaroo Court ఇచ్చిన తీర్పులానే ఉందని, అంతా హడావుడి చేస్తున్నారని మండి పడ్డారు. ట్విటర్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఎలాంటి ఆధారాల్లేకుండానే ఓ ఎంపీ ఆరోపణలు చేయడమే కాకుండా అనర్హత వేటు (TMC MP Disqualification) వేయడాన్ని ప్రతిపాదించడం పార్లమెంట్ చరిత్రలో ఇదే తొలిసారి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, ఆ కీలక బిల్లులపై కేంద్రం ఫోకస్!