Budget 2024 LIVE Updates: ఉద్యోగులకు గుడ్ న్యూస్- స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ. 75వేలకు పెంపు
Union Budget 2024 LIVE Updates: మోదీ ప్రభుత్వం మూడోసారి ప్రవేశ పెడుతున్న బడ్జెట్‌పై భారీ అంచనాలున్నాయి. బడ్జెట్‌కి సంబంధించిన అప్‌డేట్స్ తెలుసుకునేందుకు ఈ లైవ్‌బ్లాగ్‌ని ఫాలో అవ్వండి.
LIVE
Background
Budget 2024 LIVE Updates: మోదీ ప్రభుత్వం మూడోసారి బడ్జెట్‌ని ప్రవేశపెట్టనుంది. లోక్‌సభ ఎన్నికల ముందు ఓట్ ఆన్ అకౌంట్ పద్దుని ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. మూడోసారి అధికారంలోకి వచ్చిన తరవాత ఇప్పుడు పూర్తిస్థాయిలో బడ్జెట్‌ని వెల్లడించనున్నారు. అయితే..ఈ పద్దుపై ఉద్యోగులతో పాటు మధ్యతరగతి ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఆదాయపన్ను శ్లాబులపై ఏమైనా ఆసక్తికర ప్రకటనలు చేస్తారా అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే విధంగా మోదీ ప్రభుత్వం ఏ నిర్ణయాలుతీసుకోనుందో అన్నదీ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 2023-24కి సంబంధించిన ఎకనామిక్ సర్వేని నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి GDP 6.5% నుంచి 7% వరకూ ఉంటుందని అంచనా వేశారు. ఈ అంచనాలకు అనుగుణంగానే కేంద్రం కేటాయింపులు చేయనుంది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఏడో బడ్జెట్‌ను ఇవాళ ప్రవేశపెట్టబోతున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశ పెట్టే బడ్జెట్‌పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మోదీ 3.0 తొలి బడ్జెట్ ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సబలో ప్రవేశపెట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ ఇది. ఆర్థిక మంత్రి సీతారామన్ నాయకత్వంలో వరుసగా పెట్టే ఏడో బడ్జెట్ ఇది.
బడ్జెట్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు indiabudget.gov.inలో లభిస్తాయి. దూరదర్శన్, సంసద్ టీవీ, వివిధ అధికారిక ప్రభుత్వ యూట్యూబ్ ఛానళ్లలో బడ్జెట్ ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డు బద్దలు కొట్టనున్నారు. అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు ఇప్పటికీ దేశాయ్ పేరిట ఉంది. వచ్చే నెలలో 65వ వసంతంలోకి అడుగుపెడుతున్న నిర్మలా సీతారామన్ ఈ ఘనత సాధించనున్నారు.
రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్
2019లో భారతదేశపు మొట్టమొదటి పూర్తికాల మహిళా ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా రెండోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆమెను ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెడుతూ వస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ సహా వరుసగా ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఇప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరానికి (2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు) పూర్తి బడ్జెట్ వరుసగా ఏడో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 1959 నుంచి 1964 వరకు వరుసగా 5 పూర్తిస్థాయి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన దేశాయ్ రికార్డును ఆమె అధిగమించనున్నారు.
బడ్జెట్ పై ప్రజల ఆకాంక్షలు ఏమిటి?
కొత్త పెన్షన్ విధానం, ఆయుష్మాన్ భారత్ వంటి సామాజిక భద్రతా పథకాలపై సాధారణ బడ్జెట్‌లో ప్రకటనలు చేయవచ్చని అంచనా ఉంది. ఆదాయపు పన్ను విషయంలో ఉపశమనం లభిస్తుందనే ఆశలు ఉద్యోగుల్లో లేవు. ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడం, గ్రామీణ, వ్యవసాయ కేటాయింపులు పెంచడం, సూక్ష్మ, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించే చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ... 70 ఏళ్లు పైబడిన పౌరులందరినీ ఆయుష్మాన్ పథకం పరిధిలోకి తీసుకువస్తామని, రూ .5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుందని చెప్పారు. పెట్టుబడుల ద్వారా గౌరవప్రదమైన జీవన ప్రమాణాలు, ఉపాధి కల్పించడంపై దృష్టి పెట్టామన్నారు. దానికి అనుగుణంగానే బడ్జెట్ ఉంటుందని చెబుతున్నారు.
బడ్జెట్ పై మూడీస్ అనాలసిస్
పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్‌లో మూలధన వ్యయం పెరగవచ్చని మూడీస్ తెలిపింది.
లోక్ సభలో సంపూర్ణ మెజారిటీ సాధించలేకపోయిన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోంది. ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తుందని మూడీస్ అనలిటిక్స్ ఆర్థికవేత్త అదితి రామన్ సోమవారం అన్నారు. మధ్యంతర బడ్జెట్‌లో పన్ను రేట్లు అలానే ఉంచారని, అయితే లోటు పెరగకుండా ఉండేందుకు పన్నులతోపాటు ప్రణాళికాబద్ధమైన ప్రభుత్వ వ్యయం పెరగాల్సి ఉందన్నారు.
ఈ బడ్జెట్ వ్యాపారం, వినియోగదారుల విశ్వాసంపై ప్రభావం చూపుతుందని మూడీస్ అనలిటిక్స్ తెలిపింది. మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలపై మూలధన వ్యయానికి నిధులు ఖర్చు చేయనున్నారు. పన్నుల విషయంలో మరింత ప్రామాణిక విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని, అయితే విధానాల కొనసాగింపుపై ఎక్కువ దృష్టి సారిస్తామని చెప్పింది.
Union Budget 2024 LIVE Updates: 8 మంది బీజేపీ ఎంపీలున్నా, 8 రూపాయలు కూడా తేలేదు: కేటీఆర్
తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను ప్రజలు గెలిపించినా, కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రాష్ట్రానికి 8 రూపాయలు కూడా కేటాయించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో మరోసారి రాష్ట్రానికి మొండిచేయి చూపించారని, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
Budget 2024 LIVE Updates: ఏ రూపంలో అయినా నిధులు నిధులే - ఏపీకి సూపర్ బడ్జెట్!
కేంద్ర బడ్జెట్ ప్రకటన తర్వాత దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలు కావడంతో.. ఈ రెండు రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించారని మాట్లాడుకుంటున్నారు. బీహార్ గురించి పక్కన పెడితే ఈ కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకమే అని అంటున్నారు. ఎన్నో సమస్యల్లో ఉన్న ఏపీకి ఊపిరి పోసేలా నిధుల కేటాయింపు ఉందని వినిపిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
Budget 2024 LIVE Updates: మహిళలకు వరాల జల్లు
Budget 2024 LIVE Updates: మహిళలు, బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.3 లక్షల కోట్లు మంజూరు చేశారు నిర్మలా సీతారామన్. ఈశాన్య ప్రాంతంలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ 100కు పైగా శాఖలు ఏర్పాటు చేయనున్నారు. దేశ ఆహార భద్రత కోసం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయాలని భావించారు. కేంద్ర బడ్జెట్ 2024-25 ఎంఎస్ఎంఈలు, కార్మిక ఆధారిత తయారీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎంఎస్ఎంఈలకు చేయూత ఇచ్చేందుకు ముద్ర రుణ పరిమితి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు
Budget 2024 LIVE Updates: ఉద్యోగులకు గుడ్ న్యూస్ స్టాండర్డ్ డిడక్షన్ 75వేలకు పెంపు
Budget 2024 LIVE Updates: ఉద్యోగులకు గుడ్ న్యూస్ స్టాండర్డ్ డిడక్షన్ 75వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
Budget 2024 LIVE Updates: ఆదాయపు పన్నుపై కీలక ప్రకటన
Budget 2024 LIVE Updates: ఆదాయపు పన్నును సులభతరం చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సకాలంలో టీడీఎస్ చెల్లించకపోవడం ఇకపై నేరం కాదన్నారు.