అన్వేషించండి
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రవాది ఆదిల్ ఇల్లు ధ్వంసం- సైన్యం చేసిన పనా? తీవ్రవాదుల కుట్ర?
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో భారత ఆర్మీ సైనికులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో త్రాల్‌లోని ఒక ఉగ్రవాది ఇంట్లో పేలుడు జరిగింది.
పహల్గాం ఉగ్రవాది ఆదిల్ ఇల్లు ధ్వంసం- సైన్యం పనా? తీవ్రవాదుల కుట్ర?
1/7

పహల్గామ్ దాడి తర్వాత, భారత సైన్యం గాలింపు చర్యను ముమ్మరం చేసింది. జమ్మూ కాశ్మీర్ పోలీసుల సహకారంతో NIA దర్యాప్తు ప్రారంభించింది.
2/7

ఈ క్రమంలోనే ఉగ్రవాదులు ఆసిఫ్ షేక్, ఆదిల్ గురి పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి.
3/7

ఆసిఫ్, ఆదిల్ ఇంట్లో సోదాలు చేయడానికి పోలీసులు వెళ్లినప్పుడు ఇల్లు పేలిపోయింది. అక్కడ అనుమానాస్పద వస్తువులు కూడా గుర్తించారు.
4/7

ఆదిల్, ఆసిఫ్ షేక్ ఇంటికి సోదాలకు వెళ్తున్న టైంలోనే అనుమానాస్పద వస్తువులను చూసిన పోలీసులు ఆగిపోయారు.
5/7

మరుక్షణమే పెద్ద పేలుడు జరిగింది. ఇల్లు తీవ్రంగా దెబ్బతింది. ఇంట్లో పేలుడు పదార్థం ఉందని ముందేగ్రహించిన పోలీసులు చెబుతున్నారు.
6/7

ఆదిల్ థోకర్ లష్కరే తోయిబా ఉగ్రవాది. అతన్ని ఆదిల్ గురి అని కూడా పిలుస్తారు. ఆదిల్ బిజ్‌బెహార నివాసి.
7/7

ఇప్పుడు జరిగిన పేలుడు ధాటికి అతని ఇల్లు పేలిపోయింది. పహల్గామ్ దాడిలో కూడా ఆదిల్ పేరు వచ్చింది. అతను 2018లో చట్టబద్ధంగా పాకిస్తాన్ వెళ్లాడు. అతను పాకిస్తాన్‌లో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతేడాదేే జమ్మూ కాశ్మీర్‌కి తిరిగి వచ్చాడు.
Published at : 25 Apr 2025 03:26 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
బిజినెస్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















