అన్వేషించండి

దేశంలోనే తొలి AI టీచర్, పాఠాలు చెబుతున్న రోబో పంతులమ్మ - ప్రత్యేకతలివే

AI Teacher in Kerala: కేరళలోని ఓ స్కూల్‌లో తొలి AI టీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు.

AI Teacher Iris in Kerala: విద్యారంగంలో అగ్రస్థానంలో ఉన్న కేరళ ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు AI టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోనే తొలి AI టీచర్‌ Iris తో పాఠాలు బోధిస్తోంది. Makerlabs Edutech Private Limited ఈ AI రోబోని తయారు చేసింది. తిరువనంతపురంలోని KTCT Higher Secondary Schoolలో ఈ హ్యూమనాయిడ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. పిల్లలకు ఈ AI టీచర్ పాఠాలు చెబుతోంది. దీనికి సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.  "ఐరిస్ హ్యూమనాయిడ్‌తో విద్యారంగంలో కొత్త మార్పులు తీసుకొచ్చాం. విద్యాబోధనా విధానాన్ని పూర్తిస్థాయిలో మార్చేసే విధంగా AI టెక్నాలజీని వినియోగించాం" అని మేకర్‌ల్యాబ్స్ సంస్థ వెల్లడించింది. విద్యార్థులతో ఇంటరాక్ట్ అవడం నుంచి  పాఠాలు చెప్పడం వరకూ అన్ని విషయాల్లోనూ ప్రత్యేకంగా నిలుస్తోంది. నీతి ఆయోగ్ తీసుకొచ్చిన  Atal Tinkering Lab (ATL) ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ AI టీచర్‌ని తయారు చేశారు. మొత్తం మూడు భాషల్లో మాట్లాడేస్తుంది. ఎంత కష్టమైన ప్రశ్నలకైనా సులువుగా సమాధానం చెబుతుంది. వాయిస్ అసిస్టెన్స్, ఇంటరాక్టివ్ లెర్నింగ్ మాడ్యూల్స్ లాంటి ఫీచర్స్ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అన్ని తరగతి గదుల్లోకి తిరుగుతూ విద్యార్థులతో మాట్లాడుతోంది ఈ ఐరిస్ హ్యూమనాయిడ్. వాయిస్ అసిస్టెంట్‌ మాడ్యూల్‌ తయారీలో  Robotics and Generative AI టెక్నాలజీస్ తోడ్పాటునందించింది. ఇంటెల్ ప్రాసెసర్‌తో తయారు చేశారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Maker Labs (@makerlabs_official)

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల (Satya Nadella) కీలక ప్రకటన చేశారు. 2025 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్కిల్స్‌పై యువతకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. 20 లక్షల మంది విద్యార్థులకు AI స్కిల్క్‌పై ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌తో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించినట్టవుతుందని వివరించారు. ముంబయిలో జరిగిన Microsoft CEO Connection ఈవెంట్‌లో ఈ విషయం వెల్లడించారు. ఈ సమయంలోనే AI స్టార్టప్‌ Karya సంస్థపై ప్రశంసలు కురిపించారు. గ్రామాల్లోని 30 వేల మందిని ఎంపిక చేసింది ఈ కంపెనీ. స్పీచ్, టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్ ద్వారా డేటా సెట్స్‌ని తయారు చేసేందుకు వీళ్లందరికీ ట్రైనింగ్ ఇచ్చింది. అంతే కాదు. వాళ్లకు కొంత వేతనమూ చెల్లించింది. మొత్తం 12 భారతీయ భాషలకు సంబంధించిన డేటాసెట్స్‌ని రూపొందించనుంది. ప్రభుత్వానికి సహకరించేందుకు తయారు చేసిన GenAI చాట్‌బోట్‌ Jugalbandhi గురించీ ప్రస్తావించారు సత్య నాదెళ్ల. దీంతో పాటు Bhashini లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ గురించీ మాట్లాడారు. జుగల్‌బందీ చాట్‌బోట్‌ని భాషిణి ట్రాన్స్‌లేట్‌ టూల్‌ని కలిపి వినియోగించుకుంటే మారుమూల గ్రామాల్లో రకరకాల భాషలు మాట్లాడేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. 2025 నాటికి భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల GDP లక్ష్యంగా పెట్టుకుందన్న సత్యనాదెళ్ల ఆ సమయానికి AI టెక్నాలజీదే 500 బిలియన్ డాలర్ల వాటా ఉంటుందని అంచనా వేశారు.

Also Read: బెంగళూరు బాంబు పేలుడు కేసు - నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల నజరానా

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Ramprasad Reddy: కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Anasuya Bharadwaj : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramprasad Reddy: కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
కేబినెట్ భేటీలో భావోద్వేగం - కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి - ఓదార్చిన సీఎం చంద్రబాబు
Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Anasuya Bharadwaj : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కామెంట్స్ - కౌంటర్స్, రియాక్షన్స్... ఈ వివాదానికి చెక్ పడేదెప్పుడు?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Bigg Boss Emmanuel : అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
Apple iPhone Record Sales: ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
Embed widget