World Red Cross Day 2024 : సమస్యల్లో చిక్కుకున్న పేద ప్రజలకు సేవచేయడమే లక్ష్యం.. రెడ్ క్రాస్ డే 2024 థీమ్, దాని వెనుకున్న చరిత్ర ఇదే
World Red Cross Day : ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసరాల సమయంలో ప్రజలని రక్షిస్తూ.. శాంతియుతంగా ఉంచేందుకు ప్రపంచ రెడ్ క్రాస్ డేని నిర్వహిస్తున్నారు. ఈ గ్లోబల్ ఈవెంట్ జరుపుకోవడం వెనుక చరిత్ర ఏమిటంటే..
![World Red Cross Day 2024 : సమస్యల్లో చిక్కుకున్న పేద ప్రజలకు సేవచేయడమే లక్ష్యం.. రెడ్ క్రాస్ డే 2024 థీమ్, దాని వెనుకున్న చరిత్ర ఇదే World Red Cross Day 2024 Get to know the date history significance and more details in telugu World Red Cross Day 2024 : సమస్యల్లో చిక్కుకున్న పేద ప్రజలకు సేవచేయడమే లక్ష్యం.. రెడ్ క్రాస్ డే 2024 థీమ్, దాని వెనుకున్న చరిత్ర ఇదే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/08/c352a09e3b103bd6d6f5b217f85c30471715134880958874_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
World Red Cross Day Theme 2024 : ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్నే(World Red Cross Day 2024 ) రెడ్ క్రెసెంట్ డే అని కూడా అంటారు. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, వివిధ సమస్యల నుంచి ప్రజలను రక్షిస్తూ.. ఐక్యతను చాటుకోవడమే లక్ష్యంగా దీనిని ఏటా మే 8వ తేదీన జరుపుతున్నారు. అసలు రెడ్ క్రాస్ డేని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? దీని ప్రధాన అజెండా ఏమిటి? ఈ సంవత్సరం ఏ థీమ్‌తో వస్తున్నారు? ఈ రెడ్ క్రాస్ డే చరిత్ర ఏంటి వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రెడ్ క్రాస్, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ (ICRC) స్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ జన్మదినాన్ని పురస్కరించుకుని మే 8వ తేదీన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అతను చేసిన సేవలకు గుర్తుగా నోబెల్ శాంతి బహుమతిని కూడా అందుకున్నారు. ఈ రెడ్ క్రాస్ డే రోజు.. విపత్తులతో బాధపడుతున్న పేద ప్రజలకు సహాయం చేయడానికి అనేక ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి.. వారికి అవసరమైన సేవలు అందిస్తాయి. ప్రాథమిక అవసరాలకు దూరంగా ఉన్నవారికి సౌకర్యాలు కూడా అందిస్తారు. ఆహార కొరత, ప్రకృతి వైపరీత్యాలు, అంటువ్యాధుల్లో, యుద్ధాలలో చిక్కుపోయినవారికి ఈ రోజును అంకితం చేశారు.
ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం 2024 థీమ్
ప్రతి సంవత్సరం ఈ రెడ్ క్రాస్ డేని ఓ కొత్త థీమ్‌తో సెలబ్రేట్ చేస్తారు. ఈ సంవత్సరం.. నేను ఏ సేవ చేసిన దానిని ఆనందంతో చేస్తాను.. నేను ఆనందంగా సేవ చేయడమే నేను ఇచ్చే బహుమతి.. అనే థీమ్‌తో ఈ సంవత్సరం ముందుకు వచ్చారు. అంటే మనం చేసే ప్రతి పని హృదయం నుంచే వస్తుంది అనే థీమ్‌పై ఈ రెడ్ క్రెసెంట్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ థీమ్స్‌తో ప్రజలకు సేవ చేస్తూ రెడ్ క్రాస్ డే ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. అలాగే ప్రజల్లో రెడ్ క్రెసెంట్ ఉద్యమంపై అవగాహన పెంచింది.
ప్రపంచ రెడ్ క్రాడ్ డే చరిత్ర (World Red Cross Day History)ఇదే
మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత.. రెడ్ క్రాస్ శాంతికి ప్రధాన సహకారంగా ముందుకు వచ్చింది. ఈ రెడ్ క్రాస్ ట్రూస్ను అధ్యయనం చేయడానికి 14వ అంతర్జాతీయ సమావేశంలో ఓ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 1934లో రెడ్‌క్రాస్ ట్రూస్ తమ నివేదికను సమర్పించింది. దాని సూత్రాలు గురించి 15వ అంతర్జాతీయ సమావేశంలో చర్చించారు. అప్పుడే దీనికి ఆమోదం లభించింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో దీనిని నిర్వహించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 1946లో టోక్యోలో ఈ ప్రతిపాదన అమలులోకి వచ్చింది. దీనికి రెండు సంవత్సరాల తర్వాత 1948లో రెడ్‌క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ బర్త్ డేని పురస్కరించుకుని.. మే 8వ తేదీన ఈ రెడ్‌క్రాస్ డే ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించారు. 1984లో అధికారికంగా.. వరల్డ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ డే అని పేరు పెట్టారు.
ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ప్రాముఖ్యత
ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్తు కార్యకలాపాల నుంచి ప్రజలను రక్షించేందుకు ఈ రోజును నిర్వహిస్తున్నారు. అందుకే ప్రభుత్వాలు కూడా ఈ దినోత్సవాల్లో పాల్గొంటాయి. సమస్యను మెరుగైన రీతిలో జరిపించేందుకు కొందరు వాలంటీర్లు స్వచ్ఛందంగా వస్తారు. ఈ డే ద్వారా రెడ్ క్రాస్ సోసైటీ ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రచార, సహాయ కార్యక్రమాలను సమర్థవంతంగా చేస్తోంది. శాంతియుత వాతావరణం, ప్రజలు ఇబ్బంది పడని నేపథ్యం సృష్టించడమే లక్ష్యంగా ఇది పని చేస్తుంది.
Also Read : ఆస్తమా ఉన్నవారిని ట్రిగర్ చేసే అంశాలు ఇవే.. అస్సలు తినకూడని ఫుడ్స్ లిస్ట్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)