అన్వేషించండి

Cold in Summer: కాలం కాని కాలం.. వేసవిలో జలుబు చేయడం ఏమిటీ? అనుకుంటున్నారా? కారణం ఇదే

Summer deceases : వేసవిలో చేసే జలుబుకు పెద్ద ప్రత్యేక లక్షణాలేమీ ఉండవు. శీతాకాలపు జలుబు మాదిరిగానే ఉంటుంది. వేడి వాతావరణంలో జలుబు వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతుందట.

ఈ సంవత్సరం ఎండలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. భానుడి ప్రతాపం మేలో హద్దులు దాటుతోందని చెప్పవచ్చు. పెరుగుతున్న ఎండ వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా వేధించే ప్రమాదం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో డీహైడ్రేషన్, ఎండ దెబ్బకు కొందరు ఆనారోగ్యం పాలైతే, మరికొందరిని వేసవిలో జలుబు, దగ్గు కూడా వేధిస్తుంది. అసలు వేసవిలో జలుబు ఎందుకు చేస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? వాటిని నివారించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి వివరాలు తెలుసుకోవడం అవసరం.

వేసవి జలుబుకు కారణాలు

సాధారణంగా వర్షాకాలం, శీతాకాలాల్లో అంటువ్యాధులు త్వరగా వ్యాపిస్తాయని అంటారు. కానీ మన జీవన శైలి మారుతున్నట్టే సూక్ష్మజీవులు కూడా వాటి స్వభావాన్ని మార్చుకుంటున్నాయి. అందువల్ల వేసవిలో ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తున్నాయి.

  • వేసవిలో జలుబు, దగ్గుకు ప్రధాన కారణం అలర్జీలు, వైరస్ సంక్రమణ వల్ల అని చెప్పుకోవచ్చు. వ్యక్తిగత శుభ్రత విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల శరీరంలోకి దుమ్ము చేరి అలర్జీలకు కారణం అవుతుంది.
  • వేసవిలో బలమైన వేడి గాలులు వీస్తాయి. ఈ గాలి ద్వారా పుప్పొడి, దుమ్ము వంటి అలర్జీ కారకాలు వ్యాపిస్తాయి. ఇవి శరీరంలో చేరినపుడు జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం ఉంటుంది.
  • వేసవి వేడి భరించలేక ఈ మధ్య చాలా మంది ఎక్కువ సమయాన్ని ఏసీ గదుల్లోనే గడుపుతున్నారు. ఏసిలో ఎక్కువ సమయం గడిపేవారిలో డ్రైనెస్ పెరుగుతుంది. ముక్కు, చెవి, నోటిలోపలి పొరల్లో కూడా పొడిబారుతుంది. ఇలా జరిగినపుడు ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయి. ఫలితంగా జలుబు దగ్గు వేధించవచ్చు.
  • ఇంట్లో ఒకరికి జలుబు చేస్తే అందరికీ ఇది వ్యాపించే ప్రమాదం ఉంటుంది. జలుబు వైరస్ చాలా సులభంగా వ్యాపిస్తుంది.

లక్షణాలు

  • తుమ్ములు రావడం
  • ముక్కు కారడం
  • ముక్కు దిబ్బడ
  • గొంతులో దురద, నొప్పి
  • పొడి లేదా కఫంతో కూడిన దగ్గు
  • వేడిగా అనిపించడం, చెమటలు
  • జ్వరం

నివారణ

  • వేసవిలో వచ్చే దగ్గు, జలుబును నివారించడం  కొన్న రకాల జాగ్రత్తలతో సాధ్యమే.
  • ఇంటి నుంచి బయటకు వెళ్తున్నపుడు తప్పకుండా మాస్క్ ధరించాలి. ఇది దుమ్మూ, దూళీ శరీరంలో ప్రవేశించకుండా ఆపుతుంది.
  • ఎవరైనా జలుబు, దగ్గుతో బాధపడే వారు ఎదురైతే వారికి తగినంత దూరాన్ని పాటించడం అవసరం. ఈ జాగ్రత్తతో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు.
  • ఇంటిని, పనిచేసుకునే ప్రదేశాన్ని ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. కొద్దిగా డయేరియాతో బాధపడుతున్నా కూడా నిరోధక వ్యవస్థ బలహీన పడి జలుబు,దగ్గు సంక్రమించే ప్రమాదం ఉంటుంది.

Also read : బీట్ రూట్‌‌తో ఆ సామర్థ్యం పెరుగుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Dementia Risk Factors : వినికిడి, నిద్ర తగ్గినా జ్ఞాపకశక్తి తగ్గిపోతుందట.. ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయకండి
వినికిడి, నిద్ర తగ్గినా జ్ఞాపకశక్తి తగ్గిపోతుందట.. ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయకండి
Fenugreek Seeds : జుట్టు, స్కిన్, ఆరోగ్యానికి మెంతులు మంచివే అయినా.. కొందరు వీటిని తినకూడదట, ఎందుకంటే?
జుట్టు, స్కిన్, ఆరోగ్యానికి మెంతులు మంచివే అయినా.. కొందరు వీటిని తినకూడదట, ఎందుకంటే?
PCOD, PMOS Diet : PCOD లేదా PMOSతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ఫుడ్స్ కచ్చితంగా తినేయండి
PCOD లేదా PMOSతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ఫుడ్స్ కచ్చితంగా తినేయండి
Japan Population Crisis : జపాన్​లో పెరుగుతోన్న వృద్ధులు, తగ్గుతోన్న యువత.. జాబ్ స్ట్రెస్​తో పెళ్లి, పిల్లలకు దూరం!
జపాన్​లో పెరుగుతోన్న వృద్ధులు, తగ్గుతోన్న యువత.. జాబ్ స్ట్రెస్​తో పెళ్లి, పిల్లలకు దూరం!

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
Embed widget