By: ABP Desam | Updated at : 31 Jan 2022 05:19 PM (IST)
Representational Image/Pixabay
కరోనా వైరస్ ప్రాణాంతకమనే సంగతి తెలిసిందే. అయితే, ఒక్కోసారి కోవిడ్-19 లక్షణాలు కూడా ప్రమాదకరమే. అందుకు ఈ ఘటనే నిదర్శనం. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. టెక్సాస్‌లోని అల్వార్డ్‌కు చెందిన కైలా, నాథన్ డాల్ దంపతులకు ఎదురైన అనుభవం ఇది. వారు మంచి నిద్రలో ఉన్న సమయంలో ఇంటికి నిప్పు అంటుకుంది. ఇల్లంతా పొగ ఆవహించింది. కైలా, నాథల్‌కు కోవిడ్-19 సోకవడం వల్ల కాలుతున్న వాసన తెలుసుకోలేకపోయారు.
అయితే, వారి రెండేళ్ల కుమారుడు బ్రాండన్‌కు ఆ వాసన తెలిసింది. ‘‘అమ్మా.. వేడిగా ఉంది’’ ఉందంటూ గట్టి ఏడ్చాడు. దీంతో వారు నిద్ర నుంచి మేల్కొని చూడగా.. మంటలు కనిపించాయి. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. పిల్లాడిని పట్టుకుని బయటకు పరుగులు పెట్టారు. చిత్రం ఏ ఏమిటంటే బ్రాండన్‌కు సరిగా మాటలు కూడా రావు. అమ్మ.. వేడి.. అనే రెండు పదాలే వచ్చు.
వాస్తవానికి వారి ఇంట్లో స్మోక్ అలారం ఉంది. అయితే, ప్రమాదం సమయంలో అవి పనిచేయలేదు. ఆ రెండేళ్ల బాలుడు నిద్రలేపడం వల్ల మిగతా గదుల్లో నిద్రిస్తున్న వారి ఐదుగురి పిల్లలు, తల్లిదండ్రులను కైలా, నాథన్‌లు అప్రమత్తం చేయగలిగారు. లేకపోతే.. వారు కూడా మంటల్లో చిక్కుకొనేవారు. ఆ సమయంలో మంటలు ప్రవేశ ద్వారం వద్దకు వ్యాపించడంతో అటు నుంచి బయటకు వెళ్లడం కష్టమైంది. లక్కీగా ఆ ఇంటికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండటంతో కుటుబమంతా సురక్షితంగా తప్పించుకోగలిగారు. వెంటనే 911కు కాల్ చేసినా లాభం లేకపోయింది. మంటలు ఇంటిని చుట్టుముట్టాయి. అగ్నిమాపక శకటాలు వచ్చేసరికే ఇల్లు మొత్తం కాలి బూడిదైంది. ఈ ఘటనతో రెండేళ్ల పసివాడు హీరో అయ్యాడు. అతడే లేకపోయి ఉంటే.. ఆ కుటుంబం మొత్తం అగ్నికి ఆహుతయ్యేది.
Viral Video: చిరుతతో ఆటలేంట్రా నాయనా? అదేమైనా కుక్క పిల్లా, తోకపట్టుకుని లాగుతున్నావ్?
స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత కడుపులో మంటగా ఉందా? ఇవిగో ఆయుర్వేద చిట్కాలు
టాయిలెట్లో టైంపాస్? గంటలు గంటలు కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!
30 Days Water Challenge: 30 డేస్ వాటర్ ఛాలెంజ్ - ఈ ట్రెండ్ ఫాలో కావద్దు, ప్రాణాలు పోతాయ్, ఎందుకంటే..
70 ఏళ్ల వయస్సులో బిడ్డకు జన్మనిచ్చిన బామ్మగారు, 54 ఏళ్ల కల ఫలించిన వేళ!
iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!
Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !
WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?
Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు