(Source: ECI/ABP News/ABP Majha)
Alia Bhatt: అచ్చు అలియా భట్‌లాగే ఉంది కదా, అదే ఆ పిల్లకు శాపమైంది, ఓ మోడల్ కథ
అలియా భట్ వల్ల ఓ మోడల్ చాలా ఇబ్బంది పడుతోంది.
అలియా భట్‌ను చూస్తే ఎవరికైనా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఆమె సినిమాలు కూడా చాలా మేరకు హిట్లు కొడతాయి. ఆమె వల్ల ఓ మోడల్ ఇబ్బంది పడుతోంది. నిజానికి ఈ మోడల్ కి, ఆలియాతో పరిచయం కూడా లేదు, అయినా ఇబ్బంది తప్పడం లేదు. ఎందుకంటే ఈ అమ్మాయి అచ్చు అలియాలా ఉంటుంది. ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు.ఈ మోడల్‌ను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఆమె పేరు సెలెస్టి బైరాగే. అసోంకు చెందిన మోడల్. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఆమెను చూడగానే అందరూ అలియా భట్ లా ఉన్నవంటూ అనడం మొదలుపెట్టారు. చాలా ఏళ్లుగా ఆ మాటలు విని విని విసిగిపోయింది సెలెస్టి. ఈమెను చూస్తే మీరు కూడా అలియా ట్విన్ సిస్టరా అని అడుగుతారు.
నాకిష్టమే కానీ...
‘నాకు అలియా నచ్చుతుంది. ఆమె నటన కూడా ఇష్టమే, కానీ నాకు నా సొంత గుర్తింపు కావాలి, అలియాగా కాదు సెలెస్టీగా గుర్తింపు రావాలి’ అని చెప్పుకొచ్చింది సెలెస్టీ. గుండ్రటి ముఖం, సొట్టలో బుగ్గ, అలియాలాగే నవ్వు... ఆమెను ఎవరైనా చూస్తే కవల సోదరేమో అనుకుంటారు. ఈమె 1999 మార్చి 12న పుట్టింది. రాజస్థాన్ లోని అజ్మీర్ నుంచి ఆంగ్లంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
లాక్ డౌన్లో ఖాళీగా ఉండడం ఇష్టంలే ఇన్ స్టాలా ఖాతా తెరిచింది. అనేక రకాల వీడియోలను, ఫోటోలను పోస్టు చేయడం ప్రారంభించింది. ఆమెను చూసిన చాలా మంది అలియా భట్ లా ఉన్నావంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు ఆమెకు వేల సంఖ్యంలో ఫాలోవర్లు పెరిగారు. ఆమెకు ప్రకటనల్లో నటించే అవకాశాలు వచ్చాయి. మ్యూజిక్ ఆల్బమ్స్ లోనూ నటిస్తోంది. సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. కానీ ఆమె అలియా భట్ లా ఉండడంతో దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. బుల్లితెరపైనే తన కెరీర్ ను వెతుక్కోవడం మొదలుపెట్టింది సెలెస్టీ. స్టార్ ప్లస్ వచ్చే ఓ షోలో అవకాశాన్ని దక్కించుకుంది.
అంతేకాదు మరో సీరియల్ లో కూడా లీడ్ రోల్ చేస్తోంది. ఆమె సినిమా అవకాశాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ... అలియాలా కనిపించడమే శాపంగా మారింది. ఒక అలియా ఉండగా మరో అలియా ఎందుకు అంటూ పక్కన పెడుతున్నారంట. అందుకే సెలెస్టీ ‘నాకు నా సొంత గుర్తింపు కావాలి’ అని అరిచి మరీ చెబుతోంది.
View this post on Instagram
Also read: ఏసీలో ఎక్కువ సమయం ఉంటున్నారా? అయితే త్వరగా ముసలోళ్లయిపోతారు
Also read: ఆ దేశంలో డబ్బులకు బదులు పేమెంట్‌గా పుచ్చకాయలు, వెల్లుల్లి, గోధుమలు, ఎందుకలా?