News
News
X

Skin Protection: ఏసీలో ఎక్కువ సమయం ఉంటున్నారా? అయితే త్వరగా ముసలోళ్లయిపోతారు

ఏసీలో ఉంటే చల్లగా, హాయిగా ఉంటుంది. కానీ చర్మానికి మాత్రం అలా ఉండదు. చికాకుగా ఉంటుంది.

FOLLOW US: 

వేసవిలో ఏసీలో ఉండడం సహజం, కానీ  వేసవే కాదు వాతావరణం మారి చల్లబడినా కూడా ఏసీకి  అలవాటు పడిపోతారు కొంతమంది. ఇక ఆఫీసుల విషయానికి వస్తే 24 గంటలు ఏసీలు ఆన్2లో ఉండాల్సిందే. ఇలా ఎక్కువ కాలం ఎయిర్ కండిషన్ల కింద ఉండే వాళ్లకి ఒక బ్యాడ్ న్యూస్. వారి చర్మం త్వరగా ముసలిదైపోతుంది. ఎయిర్ కండిషన్ నుంచి వచ్చే చల్లదనం చర్మాన్ని దెబ్బతీస్తుంది. నిత్యం ఏసీలో ఉండేవారి చర్మం త్వరగా ముడతలు పడి, తేమను కోల్పోతుంది. అంతేకాదు చర్మం కుచించుకుపోయి, గీతలు పడిపోతాయి. అందుకే ఏసీలో ఉండేవారు రోజులో కొన్ని గంటలు బయటి వాతావరణంలో కూడా తిరగాలి. కొంతమంది ఇంట్లో, కారులో ఏసీలు వేసుకుని ఉంటారు.ఏసీలో ఉండే వారి చర్మంలో కలిగే మార్పులు ఎలా ఉంటాయంటే...

సహజనూనె ఉత్పత్తి తగ్గుతుంది
మన చర్మం తేమవంతంగా, ఆరోగ్యంగా ఉండాలంటే సహజంగా నూనెలు ఉత్పత్తి అవ్వాలి. ఎయిర్ కండిషన్లోంచి వచ్చే చల్లని గాలి చెమట ఉత్పత్తిని, అలాగే నూనె ఉత్పత్తిని తగ్గిస్తుంది. చర్మంలో టాక్సిన్స్ పెరిగేలా చేస్తుంది. దీని వల్ల చర్మం నిస్తేజంగా, అనారోగ్యకరమైనదిగా మారుతుంది. 

త్వరగా వృద్ధాప్యం
ఏసీలో ఉండడం వల్ల చర్మంలో తేమ తగ్గి పొడిగా మారుతుంది. దీంతో చర్మంలో కొల్లాజెన్ అనే ప్రొటీన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీని వల్ల ముసలితనం వచ్చినట్టు అవుతుంది. 

చర్మ వ్యాధులు
చల్లని గాలి గంటల పాటూ నిరంతరం తగలడం వల్ల చర్మ సమస్యలు మొదలవుతాయి. తామర, సొరియాసిస్, రొసేసియా వంటి సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. 

ఇలా తట్టుకోండి....
కొందరికి ఏసీలోనే ఎక్కువకాలం ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆఫీసులో ఉండే 9 గంటలు చల్లని వాతావరణంలోనే ఉండాలి. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మాన్ని కాపాడుకోవచ్చు. 

ఏసీ ఫిల్టర్లను మార్చాలి
ఎయిర్ కండిషన్ ఫిల్టర్లు త్వరగా ధూళికణాలతో నిండిపోతాయి. అక్కడంతా ధూళి పేరుకుపతుంది. ఇవి చర్మానికి హాని చేస్తాయి. కాబట్టి ఈ ఏసీ ఫిల్టర్లను తరచుగా మార్చాలి. శుభ్రం చేస్తూ ఉండాలి. 

తగినంత నీరు
చర్మాన్ని తేమ వంతంగా ఉంచాలంటే నీరు అధికంగా తాగాలి. ఏసీలో దాహం వేయదు. అయినా గంటకోసారైనా గుక్కెడు నీళ్లు తాగుతూ ఉండాలి. మొత్తం మీద రోజుకు 8 గ్లాసుల నీరు తగ్గకుండా చూసుకోవాలి. దీని వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటికి పోతాయి. 

మాయిశ్చరైజ్
తేలికపాటి మాయిశ్చరైజర్‌ను చర్మానికి రాయాలి. ఏసీలో ఉండడం చర్మంలోని నూనెల ఇంకిపోతాయి. కాబట్టి వాటిని భర్తీ చేయాల్సిన అవసరం మీకుంది. కాబట్టి మాయిశ్చరైజర్లు రాస్తూ ఉండాలి. 

Also read: ఆ దేశంలో డబ్బులకు బదులు పేమెంట్‌గా పుచ్చకాయలు, వెల్లుల్లి, గోధుమలు, ఎందుకలా?

Also read: ఈ చిత్రం ద్వారా మీరు మీ జీవిత భాగస్వామిని మోసం చేసే వారో కాదో చెప్పేయచ్చు

Published at : 05 Jul 2022 01:21 PM (IST) Tags: Skin Problems Air Conditioner Skin Protection Staying in AC

సంబంధిత కథనాలు

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Diarrhoea: ప్రయాణాల్లో కడుపు గడబిడ? జర్నీకి ముందు ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి!

Diarrhoea: ప్రయాణాల్లో కడుపు గడబిడ? జర్నీకి ముందు ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి!

Eye Problems: కంటి చూపు సమస్యలా? ఈ ఆహారంతో కళ్లజోడుకు బై బై చెప్పొచ్చు!

Eye Problems: కంటి చూపు సమస్యలా? ఈ ఆహారంతో కళ్లజోడుకు బై బై చెప్పొచ్చు!

Harsha Sai: హ్యాట్సాఫ్ హర్షసాయి, ఫైవ్ స్టార్ హోటల్‌లో 101 మంది నిరుపేదలకు విందు, ఒక్కో ప్లేటు రూ.30 వేలు

Harsha Sai: హ్యాట్సాఫ్ హర్షసాయి, ఫైవ్ స్టార్ హోటల్‌లో 101 మంది నిరుపేదలకు విందు, ఒక్కో ప్లేటు రూ.30 వేలు

108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?

108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?

టాప్ స్టోరీస్

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం

Venkatesh: దేవుడిగా వెంకీ - విశ్వక్ సేన్ సినిమాకి బజ్ వస్తుందా?

Venkatesh: దేవుడిగా వెంకీ - విశ్వక్ సేన్ సినిమాకి బజ్ వస్తుందా?

Cinnamon Tea: దాల్చిన చెక్కతో టీ ఎప్పుడైనా ట్రై చేశారా? దీని ప్రయోజనాలు తెలిస్తే మీరు వదిలిపెట్టరు

Cinnamon Tea: దాల్చిన చెక్కతో టీ ఎప్పుడైనా ట్రై చేశారా? దీని ప్రయోజనాలు తెలిస్తే మీరు వదిలిపెట్టరు