Dhanurmasam Special Sweet : ఆగ్రా స్వీట్స్‌లా ఉత్తరాంధ్ర బ్రాండ్ ఈ ధనుర్మాసం చిక్కీ - అందరికీ దొరకదు..ఎల్లప్పుడూ ఉండదు ! అందుకే స్పెషల్
ఉత్తరాంధ్రకే ప్రత్యేకమైన స్వీట్ ధనుర్మాస చిక్కీ. ఈ స్వీట్ గురించి డీటైల్స్ ఇవిగో
Dhanurmasam Special Sweet : దేవుడికి ప్రసాదంగా పెట్టే స్వీట్ ఇది. ఆ స్వీటే కొత్తగా పెళ్లైన ఆడపిల్లలకు సారెగా కూడా ఇస్తారు. సంక్రాంతి పండగకి తప్పనిసరిగా ఈ స్వీట్ ఉండాల్సిదే. చలికాలంలో మాత్రమే దొరకడం ఈ స్వీట్ మరో ప్రత్యేకత. అన్నింటి కంటే మించి ప్రేమికులకు ఇష్టమైన లవ్ సింబల్ ఆకృతిలో ఉంటుంది. ఇంకా ఎన్నో రకాలుగా కూడా తయారు చేస్తారు ఎన్నో ప్రత్యేకతులున్నఈ సంక్రాంతి స్వీట్ నెలన్నర రోజులే దొరుకుతుంది. ఇన్ని ప్రత్యేకతులున్న ఈ స్వీట్ అన్నీ చోట్ల దొరకదు. కేవలం ఉత్తరాంధ్రలో మాత్రమే లభ్యమవుతుంది. వీటిని తయారీదారులు థనుర్మువ్వలు అని పిలుస్తారు. సాధారణ ప్రజలు మాత్రం ధనుర్మాస చిక్కీలు అంటారు. ఈ పేరుతోనే ఉత్తరాంధ్రలో ఈ స్వీట్ ఫేమస్. అసలు దీనిని ఎలా తయారు చేస్తారు. చలికాలంలో మాత్రమే తయారయ్యే ఈ స్వీట్ ఎండకాలంలో ఎందుకు చేయకూడదు...? ఈ స్వీట్ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి...?
పూరీ జగన్నాథుడి ప్రసాదం ధనుర్మాస చిక్కీ !
సాధారణంగా పల్లీలు (వేరు శనగలు), బాదం, బెల్లం, పంచదార కలిపి తయారు చేసే చిక్కీలు చాలా చోట్ల దొరుకుతాయి. కానీ ధాన్యంలోని పాలతో తయారు చేసే ఈ ధనుర్మాస చిక్కీలు సంక్రాంతి స్పెషల్. సంక్రాంతి సమయంలో ఈ స్వీట్ తినలేకపోతే...మళ్లీ మరో సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే. ఈ ధనుర్మాస చికీలు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో. ఒడిస్సా ను ఆనురుని ఉన్న గ్రామాల్లో ఎక్కువగా తయారవుతాయి. కొన్ని తరాల కిందట ఒడిశా నుంచి వచ్చి ఉత్తరాంధ్రలో స్థిరపడిన కుటుంబాలు ఈ స్వీట్ ను తయారు చేయడం ప్రారంభించాయి. ఇప్పటీకి ధనుర్మాస చిక్కీలంటే ఇచ్ఛాపురం వెళ్లాల్సిందే. అయితే కాలక్రమంలో వీటి అమ్మకాలు మాత్రం ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో ధనుర్మాస స్వీట్ రుచులు ఉత్తరాంధ్రలోచాలా మందికి తెలుసు. ఈ స్వీట్‌కు జౌషధ గుణాలు కూడా ఉన్నాయని అంటున్నారు తయారీదారులు.
ఎలా తయారు చేస్తారంటే ?
ప్రతి ఏటా నవంబర్ నుంచి జనవరి వరకు వీటిని తయారు చేస్తారు. ఇది ధనుర్మాసంలోనే తయారవుతుంది. ధనుర్మాసంలో చేసే చిక్కీ ఇది. పూరిలో జగన్నాధస్వామికి ప్రసాదంగా పెడతారు. ఇది ఫుడ్ తర్వాత నైట్ టైమ్ తీసుకుంటే మంచి డైజేషన్ అవుతుంది. దీనిలో షుగర్, కొబ్బరి, వాము, సోపు వంటివి అన్నింటిని మిక్స్ చేసి తయారుచేస్తారు. రైతులు కోతలైన తర్వాత...కొత్త ధాన్యాన్ని దంచి వాటి పాలతో చిక్కీలు చేస్తారు. ఈ పాలకు, పేలాలు, పంచదార పాకాన్ని కలిపి...పోషక విలువలు, అలంకరణ కోసం కోసం కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం కూడా వాడతారు. స్పెషల్ డిజైన్లలో కూడా ఆర్డర్లపై తయారు చేస్తారు. ధాన్యం నుంచి వచ్చినవే ఇవి. పేలాలంటారు. ఇందులో వాము, సోపు మిక్సింగ్ చేసి పాకంలో వేసి కలిపిన తర్వాత అవి వేడివేడిగా కలిపిన తర్వాత గబగబ నొక్కేస్తుండాలి. లేదంటే గట్టిగా అయిరోతుంది పాకం. ఆరిపోతే మరి పనికిరాదు. అరకుండా గబగబ నొక్కేసి, వెంట వెంటనే చేసేయాలి.
నెలన్నర మాత్రమే తయారీ తర్వాత సాధ్యం కాదు !
ధాన్యం చేతికి వచ్చినప్పుడు మాత్రమే వీటి తయారీ సాధ్యమవుతుంది. నెల పదిహేను రోజులుచేసి ఆ తర్వాత సీజన్ అయిపోతతుంది...మరేమి ఉండదు. వరికోతల కోసిన తర్వాత ధాన్యపు నిలువలను ఉంచుతారు. పాతధాన్యాన్ని తీసుకొని దాన్ని దంచిపెట్టి పేలాలుగా తయారుచేసి వీటిని మొదటిగా ఒడిస్సా లో గల పూరి జగన్నాథ స్వామి ఆలయానికి ప్రసాదంగా పంపిస్తారు. ఆ తర్వాత కొన్ని దేవాలయాలకు పంపించి అప్పుడు అమ్మకానికి చేస్తారు ఈ రెండు నెలల దొరికే ఈ సీటు కోసం ఇతర దేశాల వారు కూడా పంపించమని ఆర్డర్స్ ఇస్తుంటారు..