Current Affairs Today: అమరావతికి ఆర్థిక సాయం చేస్తున్న ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు?
Today Current Affairs And GK: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ల కోసం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా అవసరం. 15 నవంబర్ 2024 నాటి కరెంట్ అఫైర్స్ ఇక్కడ చూడొచ్చు.
Current Affairs On 15th Nov 2024: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం గ్రూప్ 2, డీఎస్సీ కోసం లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు. తెలంగాణలో గ్రూప్ 3, గ్రూప్-2, టెట్ కోసం సన్నద్ధమవుతున్నారు. బ్యాంకు, ఇతర జాతీయ పోటీ పరీక్షల కోసం రెడీ అవుతున్న వాళ్లు కోట్లలో ఉన్నారు. అలాంటి వారందరికీ ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ అండ్ స్టాక్ జీకే ఇక్కడ ఇస్తున్నాం.
కరెంట్ అఫైర్స్
1. ప్రపంచ బ్యాంకు యొక్క అధ్యక్షుడిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు?--అజయ్ బంగా
2. అంతర్జాతీయ ఆకలి సూచీ 2024 భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది?--105 (స్కోర్ 27.3%)
3. UNLEASHED పుస్తకమును రాసిన వారు?--బోరిస్ జాన్సన్
4. లారెన్స్&టబ్రో(L&T) సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు?--ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్
5. రాటపాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు?--మధ్యప్రదేశ్
6. ప్రపంచంలో అత్యంత ఎత్తైన 14 పర్వతాలను అధిరోహించిన నేపాల్ కు చెందిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ సృష్టించినది ఎవరు?--నిమారంజి షెర్పా
7. నాబార్డ్ బ్యాంక్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు?--కె.వి. షాజీ
8. జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఇటీవలే ఎవరు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది?--ఓమర్ అబ్దుల్లా
9. భారత అణుశక్తి కమిషన్ యొక్క అధ్యక్షుడిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు?--అజిత్ కుమార్ మొహంతి
10. సైబర్ సేఫ్టీ ఇనిషియేటివ్ కు నేషనల్ అంబాసిడర్ గా ఎవరు నియమతులయ్యారు?--రష్మిక మందాన
11. భారత సుప్రీంకోర్టుకు 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు?--జస్టిస్ సంజీవ్ ఖన్నా
12. ప్రస్తుత 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు?--అరవింద్ పనగారియా
13. భారతదేశంలో ఏ రాష్ట్రంలో దీపావళి పండగ తరువాత రోజు జరుపుకునే సోహ్రయ్ గిరిజన పండగ జరుపుకుంటారు?--జార్ఖండ్
14. కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు?--అర్జున్ రామ్ మేఘ్వల్.
15. FSSAI( Food Safety and Standards Authority of India ప్రస్తుత చైర్ పర్సన్ ఎవరు?--అపూర్వ చంద్ర
జనరల్ నాలెడ్జ్(General Knowledge)
1. శాతవాహన చక్రవర్తుల్లో గొప్పవాడైన గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదులు ఏమిటి? ఏక బ్రాహ్మణ, క్షత్రియ దర్పమాన మర్ధన, ఏకధనుర్ధర, త్రిసముద్ర తోయపీతవాహన, ఆగమ నిలయ, శకారి, శాతవాహన యశః, ప్రతిష్టానకరుడు, ధనకటక స్వామి, రారాజు.
2. భారతదేశ అత్యున్నత సాహితీ పురస్కారంగా పరిగణించే అవార్డు జ్ఞానపీఠ్, ఈ అవార్డు ఎప్పటినుండి ఇవ్వడం జరుగుతుంది?--1965
3. భారత చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ పాల్కే అవార్డు. అయితే దాదాసాహెబ్ ఫాల్కే అసలు పేరు ఏమిటి?--దుండి రాజ్ గోవింద్ ఫాల్కే.
4. భారత్ లో మొదటి చలనచిత్ర కథానాయకుడు (హీరో) ఎవరు?--Dattatraya Damodar dabke (రాజా హరిశ్చంద్ర చిత్రంలో హరిశ్చంద్ర పాత్ర)
5. ఐక్యరాజ్య సమితి (UNO) అధికార భాషలు ఎన్ని అవి ఏవి?--6(అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, రష్యన్, ఇంగ్లీష్, స్పానిస్)
6. "లాంగ్ వాక్ టు ఫ్రీడం" ఏ ప్రముఖ వ్యక్తి యొక్క ఆత్మ కథ?--నెల్సన్ మండేలా
7. జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?--నవంబర్ 11 (భారతదేశ మొదటి విద్యా శాఖ మంత్రి "మౌలానా అబుల్ కలాం" జయంతి)
8. "జెండ్ అవెస్థా" ఏ మతం యొక్క పవిత్ర గ్రంథం?--జొరాస్ట్రియన్(పార్శి) మతం
9. కీటకాలు గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు?-- ఎంటమాలజీ
10. "నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ" పరిశోధన కేంద్రం ఎక్కడ కలదు?--పూణె (మహారాష్ట్ర)
11. ప్రపంచంలో మొట్టమొదటి స్థాపించిన "స్టాక్ ఎక్స్చేంజ్" ఏది?--లండన్ స్టాప్ ఎక్స్చేంజ్
12. "భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఆర్థికంగా నరకాన్ని పెంపొందించేవాడువుతాడు" అని వ్యాఖ్యానించిన వారు ఎవరు?--థామస్ మాల్థస్ (ఇంగ్లాండ్)
13. చంద్రుని కాంతి భూమిని చేరుటకు పట్టు కాలం ఎంత?--1.3 సెకన్లు
14. గ్రీకులు "ఎరిత్రియన్ సీ" అని పిలిచే మహాసముద్రం పేరేమిటి?--హిందూ మహాసముద్రం
15. ప్రభుత్వ ఉద్యోగాల నియమకానికి పోటీ పరీక్షలు నిర్వహించిన తొలి దేశం ఏది?--చైనా
భారతరత్న అవార్డ్స్ (Bharat Ratna Awards)
1.భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఏ సంవత్సరం నుండి ప్రదానం చేస్తున్నారు?--1954 జనవరి 26
2.భారతరత్న పురస్కారం ఇప్పటివరకు ఎంతమందికి ప్రకటించడం జరిగింది?--53 మందికి (2024లో 5 గురు)
3.భారతరత్న అవార్డు పొందిన మహిళలు మొత్తం ఎంతమంది?--ఐదు(5 గురు)
4.భారతరత్న పురస్కారం అందుకున్న మొదటి వ్యక్తులు ఎవరు?--సి. రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సి.వి. రామన్ (1954)
5.భారతరత్న అవార్డు పొందిన మొదటి మహిళ ఎవరు?--ఇందిరాగాంధీ.
6.భారతరత్న అవార్డును అందుకున్న అతిపెద్ద వయస్కుడు ఎవరు?--డి.కె.కార్వే(Dhondo Keshav Karve)
7. భారతరత్న అవార్డు అందుకున్న అతిపిన్న వయస్కుడు ఎవరు?--సచిన్ టెండూల్కర్ (క్రీడారంగం)
8.భారతరత్న అవార్డు పొందిన మొదటి విదేశీయుడు ఎవరు?--ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (పాకిస్తాన్)
9. భారతరత్న అవార్డు అందుకున్న రెండవ విదేశీయుడు ఎవరు?--నెల్సన్ మండేలా (దక్షిణాఫ్రికా)
10. భారతరత్న అవార్డు అందుకున్న మొదటి శాస్త్రవేత్త ఎవరు?--సి.వి.రామన్(1954)
11. భారతరత్న అవార్డు అందుకున్న తొలి సంగీత వేత్త?--ఎం.ఎస్. సుబ్బలక్ష్మి
12. భారత రత్న అవార్డు గరిష్టంగా ఏ సంవత్సరంలో నలుగురికి ఇవ్వడం జరిగింది?--1999
13. ఏ సంవత్సరానికి గరిష్టంగా భారతరత్న అవార్డు ఐదుగురికి ప్రకటించడం జరిగింది ?--2024
14. 2024 సంవత్సరానికి గాను భారతరత్న అవార్డు ప్రకటించబడిన వారు?--కర్పూరీ ఠాకూర్, చౌదరి చరణ్ సింగ్, పి.వి.నరసింహారావు, ఎం.ఎస్. స్వామినాథన్ (మరణాంతరం) మరియు ఎల్ .కె .అద్వానీ
15."బృహస్పతి" అను మారు పేరు గల భారత ప్రధాన మంత్రి ఎవరు?-- పి.వి. నరసింహారావు.
16."My Country My Life" (ఆత్మకథ) పుస్తకము రాసిన ఎల్. కె.అద్వానీ కలం పేరు?--నేత్ర
17. పార్లమెంటును ఎదుర్కోకుండానే రాజీనామా చేసిన ప్రధాని, మరియు "రైతు బాంధవుడు"గా పేరుగాంచిన వారు?-- చౌదరి చరణ్ సింగ్.
18. "ది ఇన్ సైడర్, సహస్రఫణ్, అయోధ్య" వంటి పుస్తకాలు రాసిన ప్రధానమంత్రి?-- పి.వి.నరసింహారావు
19. "జన్ నాయక్" అని పేరు పొందిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఎవరు?-- కర్పూరీ ఠాకూర్
20. భారత హరిత విప్లవ పితామహుడు ఎవరు?-- ఎం.ఎస్. సోమనాథన్.