చెమట కంపు వేదిస్తోందా? ఈ 4 రోగాలే కారణం!
కొందరి శరీరం నుంచి వచ్చే దుర్గందం వారి శరీరంలో కలుగుతున్న అనారోగ్యానికి సూచన అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్నానం ఆలస్యమయ్యే కొద్దీ శరీరం నుంచి ఒక దుర్వాసన రావడం మొదలవుతుంది. ఇది సాధారణంగా అందరికీ జరిగేదే. ప్రతి శరీరం ఒక ప్రత్యేక వాసన కలిగి ఉంటుంది. అయితే కొందరి శరీరం నుంచి వచ్చే దుర్గందం వారి శరీరంలో కలుగుతున్న అనారోగ్యానికి సూచన అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అసలు చెమట వాసన అంటే?
శరీరం నుంచి వెలువడే చెమట వల్ల చర్మం మీద బ్యాక్టీరియా చేరుతుంది. ఈ బ్యాక్టీరియా చెమటను ఆసిడ్ గా మారుస్తుంది. సాధారణంగా ఈ స్థితి ప్యూబర్టీ మొదలైన తర్వాత హర్మోన్ల వల్ల ఏర్పడుతుంది. ఈ హార్మోన్లను ఆండ్రోజెన్స్ అంటారు.
చెమట ఎలాంటి వాసన కలిగి ఉండదు. చెమటతో శరీరానికి చాలా ఉపయోగం కూడా. ఇది బాడీ టెంపరేచర్ ను బ్యాలెన్స్ చేస్తుంది. కానీ చెమట బ్యాక్టీరియాకు నెలవుగా మారుతాయి. అందువల్ల శరీరం నుంచి దుర్వాసన వస్తుంది.
ఈ దుర్వాసన ఎందుకు?
ఒబెసిటి - ఇలా దుర్వాసన వచ్చే వారిలో చాలా మంది ఒబేసిటితో బాధ పడుతున్నవారే ఉంటారు. ఎక్కువ బరువు ఉన్న వారి శరీరంలో మడతలు ఎక్కువగా ఉంటాయి. ఈ మడతలు బ్యాక్టీరియాకు ఆవాసాలుగా మారుతాయి. అందువల్ల ఎక్కువ దుర్వాసన వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒక అధ్యయనంలో బరువు ఎక్కువగా ఉన్నవారికి వాసన గ్రహించే శక్తి కూడా తక్కువగా ఉంటుందట. అందువల్ల వాళ్లకు తమ దగ్గర నుంచి దుర్వాసన వస్తున్నట్టు గ్రహించేందుకు కూడా సమయం ఎక్కువ పడుతుందట.
డయాబెటిస్: డయాబెటిస్ తో బాధపడేవారిలో కూడా చెమట దుర్వాసన వస్తుందని అంటున్నారు. వీరి నుంచి వచ్చే వాసన పండులాగ తియ్యగా ఉంటుందని అంటున్నారు. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు గణనీయంగా తగ్గినపుడు డయాబెటిక్ కీటోఅసిడోసిస్ (డీకేఏ) అనే స్థితి ఏర్పడుతుంది. ఈ స్థితిలో శరీరంలోని చక్కెరలను శక్తిగా మార్చుకోవడంలో విఫలమవుతుంది. అందువల్ల శరీరం కొవ్వును శక్తి గా మార్చి వినియోగించడం ప్రారంభిస్తుంది. అందువల్ల శరీరంలో కీటోన్ స్థాయిలు పెరిగిపోతాయి. ఫలితంగా రక్తం అసిడిక్ గా మారుతుంది. అందువల్ల చెమట వాసన తియ్యగా మారుతుంది.
లివర్ సమస్యలు: లివర్ పనితీరు మందగించినపుడు కూడా శరీర వాసనలో మార్పు వస్తుంది. లివర్ సమస్యలతో బాధపడే వారిలో చెమట ఎక్కువగా వస్తుంది. ఇలాంటి చెమట చెడిపోయిన గుడ్డు వాసనను పోలి ఉంటుంది.
కిడ్నీ సమస్యలు: అడ్వాన్స్డ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ ఫేయిల్యూర్ సమస్యతో బాధ పడుతున్న వారిలో కూడా శరీర దుర్వాసన ఉంటుంది. వీరి నుంచి వచ్చే వాసన అమోనియాను పోలి ఉంటుంది.
శరీర దుర్వాసనను అధిగమించడం ఎలా?
⦿ రోజుకు ఒకటి లేదా రెండు సార్లు సబ్బు లేదా సబ్చు ప్రత్యామ్నాయాలు ఏవైనా ఉపయోగించి స్నానం చెయ్యాలి. సబ్బు బ్యాక్టీరియాను సమర్థవంతంగా నిర్మూలిస్తుంది.
⦿ చెమట ఎక్కువగా వచ్చేవారు సాధారణ డియోడరెంట్లకు బదులుగా యాంటి పెరిస్పెరెంట్లను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. డియోరెంట్లు దుర్వాసనను నివారించవు. కేవలం పైన పూత లాగ మాత్రమే ఉంటాయి. యాంటిపెరిస్పెరెంట్లు శరీరం నుంచి అధికంగా చెమట వెలువడకుండా నివారిస్తాయి.
⦿ వీలైనంత వరకు సహజమైన కాటన్ వస్త్రాలను వాడడం మంచిది. ఇవి చర్మం శ్వాసించడానికి అవకాశం కలిగిస్తాయి.
⦿ ఎక్కువ మసాలాలు కలిగిన ఆహారం తీసుకునే వారిలో కూడా శరీర దుర్గంధం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ విషయం కూడా ఒక సారి పరిశీలించుకోవడం మంచిది.
Also read: రాత్రిపూట ఏడుగంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? అయితే ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువే
Also read: అధికంగా ఉడికించడం వల్ల కూరగాయల్లోని పోషకాలు తగ్గిపోతాయా? ఇందులో నిజమెంత?