News
News
X

RGV Tweet On Hyderabad : హైదరాబాద్‌లో తాలిబన్ పాలన - కేసీఆర్, కేటీఆర్‌ను టచ్ చేసిన ఆర్జీవీ

హైదరాబాద్‌లో తాలిబన్ పాలన కొనసాగుతున్న విషయం తనకు తెలియదంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఏకంగా కేసీఆర్, కేటీఆర్‌ను టచ్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్ ఏం రిప్లై ఇస్తారో చూడాలి.

FOLLOW US: 
 
రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే! ఆయన ఏం ట్వీట్ చేసినా వైరలే! వర్మ చేసే ట్వీట్లు, వ్యాఖ్యల్లో విషయమూ ఉంటుంది. అదే సమయంలో వ్యంగ్యం కూడా ఉంటుంది. సాధారణంగా రాత్రి వేళల్లో ఎక్కువగా ట్వీట్లు చేసే వర్మ, ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ట్వీట్ చేశారు. అదీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన తనయుడు తారక రామారావు (కేటీఆర్)ను టచ్ చేశారు. వాళ్ళ పాలనను తాలిబన్ పాలనతో పోలుస్తూ ట్విట్టర్ వేదికగా వర్మ వరుస విమర్శలు చేశారు. 

''కేసీఆర్ (KCR) గారూ, కేటీఆర్ (KTR) గారూ, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గారూ... రాత్రి పది గంటల తర్వాత పబ్ లో మ్యూజిక్ ప్లే చేయకూడదనే రూల్ తీసుకురావడంతో పబ్ శ్మశాన వాటికను తలపించింది. అప్పుడు నా ఫీలింగ్ ఏంటో తెలుసా? తాలిబన్ల తరహాలో హైదరాబాద్ నగరాన్ని పాలిస్తున్నారని నాకు తెలియలేదు'' అని రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆయన వరుస ట్వీట్లు చేశారు. 

రోజంతా కష్టపడిన తర్వాత యువత కాస్త సరదాగా గడపడానికి వీలు లేకుండా పది గంటల తర్వాత 'నో మ్యూజిక్' పాలసీ తీసుకు రావడం తాలిబన్ల తరహాలో ఉందని వర్మ వ్యాఖ్యానించారు. సౌండ్ పొల్యూషన్ విషయం తనకు అర్థం అవుతుందని, అయితే అన్ని ఏరియాల్లో పది గంటల తర్వాత మ్యూజిక్ ప్లే చేయకూడదని నిబంధనలు తీసుకు రావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
 
యాక్సిడెంట్లు అవుతున్నాయని ట్రాఫిక్ బ్యాన్ చేస్తారా?
సౌండ్ లేకుండా థియేటర్లలో సినిమాలను ప్రదర్శిస్తారా?
ప్రతి విషయంలో లాజిక్ తీసుకు వచ్చే రామ్ గోపాల్ వర్మ, 'నో మ్యూజిక్ ఆఫ్టర్ 10' పాలసీ విషయంలోనూ కొన్ని లాజిక్స్ బయటకు లాగారు. కొన్ని యాక్సిడెంట్లు జరిగాయని ట్రాఫిక్ బ్యాన్ చేస్తామా? అనే ప్రశ్న ఆయన మాటల్లో వ్యక్తం అయ్యింది. కొన్ని ఘటనలు జరిగాయని రాత్రి పది గంటల తర్వాత మ్యూజిక్ ప్లే చేయకపోవడం కూడా అంతేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప‌బ్‌ల దగ్గరకు వెళ్లే పోలీసులు అక్కడ ఉన్న యువత, పబ్ యాజమాన్యాలను క్రిమినల్స్ తరహాలో చూస్తున్నారని వర్మ పేర్కొన్నారు. రాత్రి పది గంటల తర్వాత సౌండ్ రావడం ప్రాబ్లమ్ అయితే... థియేటర్లలో సౌండ్ లేకుండా సినిమా ప్రదర్శిస్తారా? అని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు. 

హైదరాబాద్‌లో మాత్రమే ఎందుకు ఆ రూల్?
మనమంతా ఇండియాలో ఉంటున్నప్పుడు.... హైదరాబాదీలకు మాత్రమే ఈ తాలిబన్ రూల్ ఎందుకు? అని కేసీఆర్, కేటీఆర్‌ల‌ను వర్మ ప్రశ్నించారు. దేశంలో రాత్రి ఒంటి గంట తర్వాత 'నో మ్యూజిక్' పాలసీ ఉంటే... హైదరాబాద్ సిటీలో మాత్రమే పది తర్వాత 'నో మ్యూజిక్' పాలసీ ఏంటి? అని అడిగారు. పబ్ లో పది గంటల తర్వాత మ్యూజిక్ ఆపేయడంతో ఫారినర్స్ రియాక్షన్ తాను ఇంకా మార్చనిపోలేనని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల హైదరాబాద్ మరో 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందన్నారు.

News Reels

Also Read : కొరటాల శివపై ఒత్తిడి పెంచిన 'గాడ్ ఫాదర్'?

Published at : 13 Oct 2022 11:00 AM (IST) Tags: Ram Gopal Varma Hyderabad pubs RGV on Hyderabad Hyderabad Taliban hyderabad pubs no music RGV Tweet On KCR KTR RGV Targets KCR KTR KCR Ruling Like Taliban

సంబంధిత కథనాలు

NTR : అమెరికాలో ఎన్టీఆర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

NTR : అమెరికాలో ఎన్టీఆర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఇమిటేషన్ టాస్క్, అదరగొట్టిన ఇనాయ, శ్రీసత్య

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఇమిటేషన్ టాస్క్, అదరగొట్టిన ఇనాయ, శ్రీసత్య

Gruhalakshmi December 10th: లాస్య శాడిజం, ఫ్రిజ్ కి తాళం వేసి శ్రుతికి అవమానం- వింత సమస్యలో చిక్కుకున్న సామ్రాట్

Gruhalakshmi December 10th: లాస్య శాడిజం, ఫ్రిజ్ కి తాళం వేసి శ్రుతికి అవమానం- వింత సమస్యలో చిక్కుకున్న సామ్రాట్

Bhavadeeyudu Bhagat Singh: పవన్ ఫ్యాన్స్‌లో కొత్త ఆశలు - భవదీయుడుపై లేటెస్ట్ న్యూస్!

Bhavadeeyudu Bhagat Singh: పవన్ ఫ్యాన్స్‌లో కొత్త ఆశలు - భవదీయుడుపై లేటెస్ట్ న్యూస్!

Inaya in Bigg Boss: క్యారెక్టర్లు మార్చుకున్న హౌస్‌మేట్స్ - మళ్లీ రొమాన్స్ మొదలెట్టిన శ్రీహాన్, ఇనయా

Inaya in Bigg Boss: క్యారెక్టర్లు మార్చుకున్న హౌస్‌మేట్స్ - మళ్లీ రొమాన్స్ మొదలెట్టిన శ్రీహాన్, ఇనయా

టాప్ స్టోరీస్

Weather Latest Update: తీరందాటిన మాండస్ తుపాను, ఈ జిల్లాల్ని వణికిస్తున్న వానలు

Weather Latest Update: తీరందాటిన మాండస్ తుపాను, ఈ జిల్లాల్ని వణికిస్తున్న వానలు

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Tirumala News: నేడు శ్రీ వేంకటేశ్వరుడికి నివేదించే ప్రసాదం ఏంటో తెలుసా? నిన్నటి హుండీ ఆదాయం ఇదీ

Tirumala News: నేడు శ్రీ వేంకటేశ్వరుడికి నివేదించే ప్రసాదం ఏంటో తెలుసా? నిన్నటి హుండీ ఆదాయం ఇదీ