News
News
X

Koratala Siva : కొరటాల శివపై ఒత్తిడి పెంచిన 'గాడ్ ఫాదర్'?

దర్శకుడు కొరటాల శివపై 'గాడ్ ఫాదర్' ఒత్తిడి పెంచిందా? ఇప్పుడు ఆయన బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన టైమ్ వచ్చిందా? NTR30 సెట్స్ మీదకు వెళ్ళకపోవడం, సోషల్ మీడియా ట్రోల్స్ ఆయన ఇమేజ్‌ను మరింత డ్యామేజ్ చేస్తున్నాయా?

FOLLOW US: 
 
ఎన్టీఆర్ 30 (NTR30 Movie) ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది? ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పలేని ప్రశ్న! యంగ్ టైగర్ ఫ్యాన్స్ సినిమా అప్‌డేట్‌ ఇవ్వమంటూ సోషల్ మీడియాలోట్రెండ్స్ చేస్తున్నారు. మరోవైపు 'గాడ్ ఫాదర్' విడుదల తర్వాత కొందరు మెగా ఫ్యాన్స్ ఎన్టీఆర్ 30 దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) ను ట్రోల్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయనపై ఒత్తిడి ఏర్పడుతోందా? ఇప్పుడు కొరటాల బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన సమయం వచ్చిందా? ఎన్టీఆర్ 30ను ఇంకా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళకపోవడం వల్ల ఆయన ఇమేజ్‌కు డ్యామేజ్ జరుగుతోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

'గాడ్ ఫాదర్' (Godfather) విడుదల తర్వాత కొరటాల శివ పేరు తెరపైకి వచ్చింది. ఎందుకంటే... ఆ సినిమాకు ముందు మెగాస్టార్ చిరంజీవితో ఆయన 'ఆచార్య' చేశారు. అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. కనీసం మెగా అభిమానులను కూడా మెప్పించలేదు. కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్లు... 'ఆచార్య' పరాజయానికి చాలా కారణాలు వినిపించాయి. కొరటాల శివకు మెగాస్టార్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదనే మాటలు వినిపించాయి. తర్వాత ఓ వేదికపై దర్శకుడు చెప్పినట్లు చేశారనని చిరంజీవి సెలవిచ్చారు. తప్పు ఎక్కడ జరిగింది? అనేది పక్కన పెడితే... 'గాడ్ ఫాదర్' విడుదల తర్వాత ఎక్కువ మంది వేళ్ళు కొరటాల శివ వైపు తిరిగాయి. మెగాస్టార్‌ను మాస్ ఆడియన్స్, మెగా అభిమానులు కోరుకునే విధంగా మోహన్ రాజా చూపించారని... ఆ విషయంలో కొరటాల ఫెయిల్ అయ్యారని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేశారు.

'ఆచార్య' ఫలితంతో కొరటాల శివ ప్రతిభను తక్కువ అంచనా వేయడం తప్పే అవుతుంది. ఈ సమయంలో గతంలో ఆయన ఇచ్చిన సూపర్ హిట్ సినిమాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్లాప్ రావడంతో ఆయన మరింత కసిగా సినిమా చేస్తారని ఊహించవచ్చు. సూపర్ డూపర్ హిట్ తీయడానికి ట్రై చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అయితే... ఆయన నెక్స్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అనేది ఇక్కడ క్వశ్చన్. 

'ఆచార్య'కు ముందే ఎన్టీఆర్ 30 అనౌన్స్ చేశారు. కరోనా కారణంగా మధ్యలో గ్యాప్ రావడంతో ఆ సినిమా స్క్రిప్ట్ మీద కొరటాల శివ వర్క్ చేశారు. 'ఆచార్య' విడుదల కంటే ముందు 'ఆర్ఆర్ఆర్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ఆచార్య' విడుదల తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా సెట్స్ మీదకు వెళ్లడమే ఆలస్యమని యంగ్ టైగర్ ఫ్యాన్స్ భావించారు. హీరో, దర్శకుడు ఇద్దరూ ఫ్రీ అయ్యి ఆరు నెలలు అవుతోంది. 'గాడ్ ఫాదర్'కు వచ్చిన టాక్, అభిమానుల నుంచి లభిస్తున్న స్పందనతో 'ఆచార్య' పరాజయం నుంచి మెగాస్టార్ బయట పడ్డారని తెలుగు సినిమా ఇండస్ట్రీలో జనాలు చెబుతున్నారు. మరి, కొరటాల? ఇంకా ఆయన 'ఆచార్య' బ్యాగేజ్ మోస్తున్నారు. ఆయన మనసులో ఏముందో గానీ... కొరటాల మీద ఒత్తిడి పెరుగుతోందని ఇండస్ట్రీ గుసగుస. స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ జాగ్రత్తగా వ్యవహరిస్తుండటంతో పుకార్లు ఎక్కువ అవుతున్నాయి.

News Reels

Also Read : ఆటో జానీ పక్కన పడేశా - చిరు ప్రశ్నకు పూరీ జగన్నాథ్ షాకింగ్ ఆన్సర్!

Published at : 13 Oct 2022 07:49 AM (IST) Tags: Koratala siva NT Rama Rao Jr NTR 30 Update NTR Chiranjeevi NTR30 Movie Koratala NTR 30

సంబంధిత కథనాలు

Rajamouli Oscar Nomination : ఆస్కార్స్ నామినేషన్స్‌లో రాజమౌళి - 72 శాతం కన్ఫర్మ్

Rajamouli Oscar Nomination : ఆస్కార్స్ నామినేషన్స్‌లో రాజమౌళి - 72 శాతం కన్ఫర్మ్

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?

Bigg Boss 6 Telugu: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్

Bigg Boss 6 Telugu: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్

Time Ivvu Pilla - 18 Pages Song : '18 పేజెస్'లో శింబు బ్రేకప్ సాంగ్ - టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్ డేట్ తెలుసా?

Time Ivvu Pilla - 18 Pages Song : '18 పేజెస్'లో శింబు బ్రేకప్ సాంగ్ - టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్ డేట్ తెలుసా?

Veera Simha Reddy Release Date : సంక్రాంతి బరిలో బాలయ్య - 'వీర సింహా రెడ్డి' విడుదల తేదీ చెప్పేశారోచ్

Veera Simha Reddy Release Date : సంక్రాంతి బరిలో బాలయ్య - 'వీర సింహా రెడ్డి' విడుదల తేదీ చెప్పేశారోచ్

టాప్ స్టోరీస్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ? యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ?  యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Sundar Pichai: ప్రపంచంలో ఏ మూలకెళ్లినా నేను భారతీయుడినే - పద్మ భూషణ్‌ స్వీకరించిన సుందర్‌ పిచాయ్‌

Sundar Pichai: ప్రపంచంలో ఏ మూలకెళ్లినా నేను భారతీయుడినే - పద్మ భూషణ్‌ స్వీకరించిన సుందర్‌ పిచాయ్‌