Chiranjeevi: ఆటో జానీ పక్కన పడేశా - చిరు ప్రశ్నకు పూరీ జగన్నాథ్ షాకింగ్ ఆన్సర్!
చిరంజీవి, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన ఆటో జానీ సినిమా పూరి ఏమన్నారంటే...
మెగాస్టార్ చిరంజీవి హీరోగా పూరి జగన్నాథ్ ‘ఆటో జానీ’ అనే కథను తెరకెక్కించడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి స్క్రిప్ట్‌తో కన్విన్స్ కాకపోవడం వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇన్నాళ్లకు ‘ఆటో జానీ’ మళ్లీ వినిపించింది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి నోటి నుంచే కావడం విశేషం. గాడ్ ఫాదర్ సక్సెస్ సందర్భంగా పూరి జగన్నాథ్‌తో జరిగిన సంభాషణలో చిరంజీవి ‘ఆటో జానీ’ ప్రస్తావన తెచ్చారు.
‘ఆటో జానీ స్క్రిప్ట్ ఎంతవరకు వచ్చింది? ఉందా? చించి పక్కన పడేశారా?’ అని చిరంజీవి అడిగినప్పుడు ‘ఆటో జానీ పక్కన పడేశా... మళ్లీ కొత్తగా స్క్రిప్ట్ రాసుకుని వస్తా. అది కొంచెం అవుట్ డేటెడ్ అయినట్లు అనిపించింది.’ అని పూరి బదులిచ్చారు. ‘నీ తర్వాతి సినిమాకు వచ్చి క్లాప్ కొట్టమన్నా నేను వస్తాను. నువ్వు మంచి స్క్రిప్టుతో వస్తే మనం కలిసి సినిమా చేద్దాం.’ అని చిరంజీవి అన్నారు.
ఇక గాడ్ ఫాదర్ విషయానికి వస్తే... ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. వీక్ డేస్‌లో కూడా నిలకడగా వసూళ్లు రాబడుతుంది. నార్త్‌తో కూడా ఈ సినిమాకు కలెక్షన్లు వస్తుండటంతో సినిమాను టీమ్ ఇంకా ప్రమోట్ చేస్తూనే ఉంది. ఈ సినిమాలో పూరి జగన్నాథ్ కూడా కీలక పాత్రలో కనిపించారు. జర్నలిస్ట్ గోవర్ధన్ అనే కీలక పాత్రలో కనిపించారు పూరి. దీంతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా మెగాస్టార్‌ను ఇంటర్వ్యూ చేశారు.
బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాల్లో చిరంజీవి నటిస్తున్నారు. వీటిలో వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి, భోళా శంకర్ 2023 వేసవికి విడుదల కానుంది. వీటికి సంబంధించిన రిలీజ్ డేట్స్‌ను కూడా అఫీషియల్‌గా ప్రకటించారు.
ఇక పూరి జగన్నాథ్ ప్రస్తుతం తర్వాతి సినిమాకు స్క్రిప్టు రాసుకోవడంలో బిజీగా ఉన్నారు. ‘లైగర్’ హిట్ అయితే విజయ్ దేవరకొండతో ‘జనగణమన’ వెంటనే పట్టాలెక్కేది. అయితే లైగర్ రిజల్ట్ తేడా కొట్టడంతో జనగణమనకు బ్రేకులు పడ్డాయి. మరి పూరి తన తర్వాతి సినిమాకు ఏ హీరోను అప్రోచ్ అవుతాడో చూడాలి.
View this post on Instagram