News
News
X

Raghavendra Rao New Movie : రాఘవేంద్రుడితో రామ సత్యనారాయణ 'శ్రీవల్లి కళ్యాణం'

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో త్వరలో 'శ్రీవల్లి కళ్యాణం' సినిమా ప్రారంభం కానుంది. నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటించారు.

FOLLOW US: 

దర్శ కేంద్రుడు కె. రాఘవేంద్ర రావు (K Raghavendra Rao) మళ్ళీ మెగా ఫోన్ పట్టనున్నారు. 'ఓం నమో వేంకటేశాయ' తర్వాత ఆయన దర్శకత్వంలో మరో సినిమా రాలేదు. అయితే... ఆయన నిర్మాణ సంస్థ నుంచి, ఆయన సమర్పణ - దర్శకత్వ పర్యవేక్షణలో కొన్ని చిత్రాలు వచ్చాయి. కొంత విరామం తర్వాత, మళ్ళీ ఆయన మెగా ఫోన్ పడుతున్నారు. 

తుమ్మలపల్లి రామ సత్యనారాయణ (Tummalapalli Rama Satyanarayana) కు చెందిన భీమవరం టాకీస్ నిర్మాణంలో దర్శ కేంద్రుడి తాజా సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి 'శ్రీవల్లి కళ్యాణం' (Sri Valli Kalyanam Telugu Movie) టైటిల్ ఖరారు చేశారు. సెప్టెంబర్ 10న తుమ్మలపల్లి రామ సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. 

'శ్రీవల్లి కళ్యాణం' సినిమా గురించి మాట్లాడుతూ ''నిర్మాతగా నా జీవిత ఆశయం నూరవ చిత్రం... అదీ దర్శ కేంద్రుడు కె. రాఘవేంద్ర రావు గారితో 'శ్రీవల్లి కళ్యాణం. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యం అవుతోంది. త్వరలో మొదలు పెట్టి, వచ్చే ఏడాది విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం'' అని తుమ్మలపల్లి రామ సత్యనారాయణ అన్నారు. 

కెరీర్ గురించి తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ ''సుమన్, రవళి జంటగా రూపొందిన 'ఎస్.పి. సింహా' సినిమాతో 2004లో నిర్మాతగా నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. రామ్ గోపాల్ వర్మ 'ఐస్ క్రీమ్ పార్ట్ ఒన్', 'ఐస్ క్రీమ్ పార్ట్ టు'లతో వేగం అందుకుంది. స్ట్రెయిట్ సినిమాలు మాత్రమే కాదు... సూర్య 'ట్రాఫిక్', అజిత్, తమన్నా భాటియా జంటగా నటించిన 'వీరుడొక్కడే', కిచ్చా సుదీప్, జగపతి బాబు కలయికలో 'బచ్చన్', ఉదయనిధి స్టాలిన్, నయనతార జంటగా రూపొందిన 'శీను గాడి లవ్ స్టోరీ' తదితర అనువాద చిత్రాలను తెలుగులో విడుదల చేశా. అవి నాకు లాభాలతో పాటు ఆత్మ సంతృప్తినీ ఇచ్చాయి'' అని చెప్పారు. 

Also Read : 'బ్రహ్మాస్త్ర' రివ్యూ : బాలీవుడ్‌ను ఫ్లాపుల నుంచి బయట పడేస్తుందా? లేదా?

ఈ ఏడాది యండమూరి దర్శకత్వంలో ప్రముఖ నటుడు సునీల్, 'బిగ్ బాస్' కౌశల్ (Bigg Boss Kaushal)తో 'అతడు ఆమె ప్రియుడు', జాతీయ పురస్కార గ్రహీత నరసింహ నంది దర్శకత్వంలో 'జాతీయ రహదారి' చిత్రాలను తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మించారు.

రాఘవేంద్ర రావు సమర్పణలో ఇటీవల 'వాంటెడ్ పండుగాడ్' సినిమా వచ్చింది. అందులో అనసూయ భరద్వాజ్, సునీల్, 'వెన్నెల' కిశోర్, 'సుడిగాలి' సుధీర్, నిత్యా శెట్టి, బ్రహ్మానందం, రఘుబాబు, అనంత్, 'పుష్ప' జగదీశ్, హేమ, 'షకలక' శంకర్ తదితరులు నటించారు. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించిన ఆ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. అయితే, పాటలు దర్శ కేంద్రుడి శైలిలో ఉన్నాయని పేరు వచ్చింది. ఆయన దర్శకత్వంలో సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. భక్తి ప్రధాన సినిమా కాకుండా... కమర్షియల్ సినిమా వస్తే తప్పకుండా విజయం సాధిస్తుందని రాఘవేంద్రుడి అభిమానుల నమ్మకం. 

Also Read : తెలుగులో టైటిల్ మార్చిన శింబు, గౌతమ్ మీనన్

Published at : 09 Sep 2022 05:02 PM (IST) Tags: Raghavendra Rao Raghavendra Rao New Movie Tummalapalli Rama Satyanarayana Sri Valli Kalyanam Telugu Movie

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు

Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు

Nagarjuna Bigg Boss 6 : 'బిగ్ బాస్ 6' టీఆర్పీపై నాగార్జున కామెంట్

Nagarjuna Bigg Boss 6 : 'బిగ్ బాస్ 6' టీఆర్పీపై నాగార్జున కామెంట్

ఎన్టీఆర్ సినిమాలు చూసి నేర్చుకోండి - ‘ఆదిపురుష్’ దర్శకుడిపై ‘కేజీఎఫ్’ నటి ఆగ్రహం

ఎన్టీఆర్ సినిమాలు చూసి నేర్చుకోండి - ‘ఆదిపురుష్’ దర్శకుడిపై ‘కేజీఎఫ్’ నటి ఆగ్రహం

Dussehra 2022 Celebrations: కేజ్రీవాల్‌తో కలిసి రావణ సంహారం చేయనున్న 'ఆదిపురుష్'!

Dussehra 2022 Celebrations: కేజ్రీవాల్‌తో కలిసి రావణ సంహారం చేయనున్న 'ఆదిపురుష్'!

Adipurush Teaser Controversy: ‘ఆదిపురుష్’ దర్శకుడిపై హోం మంత్రి ఆగ్రహం - ఆ సీన్లు తొలగించకపోతే చర్యలు తప్పవు

Adipurush Teaser Controversy: ‘ఆదిపురుష్’ దర్శకుడిపై హోం మంత్రి ఆగ్రహం - ఆ సీన్లు తొలగించకపోతే చర్యలు తప్పవు

టాప్ స్టోరీస్

Munugode TRS : మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Munugode TRS :  మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

Jio 5G Launch: జియో దసరా ధమాకా! బుధవారమే 4 నగరాల్లో 5జీ స్టార్ట్‌! వెల్‌కం ఆఫర్‌ ఇదే!

Jio 5G Launch: జియో దసరా ధమాకా! బుధవారమే 4 నగరాల్లో 5జీ స్టార్ట్‌! వెల్‌కం ఆఫర్‌ ఇదే!

EC On Freebies : ఉచిత హామీల కట్టడికి ఈసీ కార్యాచరణ - నిధులెక్కడి నుంచి తెస్తారో కూడా చెప్పాల్సిందే !

EC On Freebies : ఉచిత హామీల కట్టడికి ఈసీ కార్యాచరణ - నిధులెక్కడి నుంచి తెస్తారో కూడా చెప్పాల్సిందే !