Simbu Gautham Menon New Movie : తెలుగులో టైటిల్ మార్చిన శింబు, గౌతమ్ మీనన్
The Life of Muthu Telugu Movie: శింబు కథానాయకుడిగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా 'వెందు తనిందదు కాడు'. తెలుగులోనూ ఈ నెల 15న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అయితే, టైటిల్ మార్చారు.
తమిళ స్టార్ హీరో శింబు (Simbu), తెలుగు ప్రేక్షకులలో సైతం తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) ది సూపర్ హిట్ కాంబినేషన్. వాళ్ళిద్దరూ రెండు సినిమాలు చేశారు. అక్కినేని నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన 'ఏ మాయ చేసావె', 'సాహసం శ్వాసగా సాగిపో' తమిళ వెర్షన్స్‌లో శింబు హీరో. ఆ రెండూ తమిళంలో సూపర్ హిట్స్.
శింబు, గౌతమ్ మీనన్ కాంబినేషన్‌లో ఇప్పుడు మూడో సినిమా రూపొందింది. అదే 'వెందు తనిందదు కాడు' (Vendhu Thanindhathu Kaadu). సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయనున్నారు. 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' (The Life of Muthu Telugu Movie) గా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. తెలుగులో కూడా ఈ నెల 15న విడుదల చేస్తున్నారు. తెలుగులో ఎటువంటి అర్థం లేకపోయినా... ఈ మధ్య తమిళ టైటిల్స్‌తోనే తెలుగులో సినిమాలను విడుదల చేస్తున్నారు. కానీ, ఈ సినిమాకు టైటిల్ మార్చడం విశేషం.
'ది లైఫ్ ఆఫ్ ముత్తు' సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తమిళంలో వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించారు. సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ స్రవంతి మూవీస్ తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తోంది.
'ది లైఫ్ ఆఫ్ ముత్తు' సినిమా గురించి 'స్రవంతి' మూవీస్ అధినేత రవి కిశోర్ మాట్లాడుతూ ''ట్రైలర్ చూశా. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలా పాజిటివ్‌గా ఉందని అనిపించింది. శింబు నటన గురించి, దర్శకుడు గౌతమ్ మీనన్ టేకింగ్ గురించి, ఏఆర్ రెహమాన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకుడితో పాటు శింబుకి సైతం తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇంతకు ముందు మా 'స్రవంతి' సంస్థలో 'నాయకుడు' , 'పుష్పక విమానం' , ' రెండు తోకల పిట్ట', రఘువరన్ బీటెక్' చిత్రాలు అనువదించి విడుదల చేశాం. అవి సంచలన విజయాలు సాధించాయి. ఆ జాబితాలో 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' కూడా చేరుతుందని ఆశిస్తున్నాం. ఈ సినిమాతో అసోసియేట్ కావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చే కాన్సెప్ట్ ఇది. ఈ నెల 15న భారీ ఎత్తున విడుదల చేస్తున్నాం'' అని తెలిపారు.
Also Read : 'బ్రహ్మాస్త్ర' రివ్యూ : బాలీవుడ్‌ను ఫ్లాపుల నుంచి బయట పడేస్తుందా? లేదా?
శింబు సరసన సిద్ధీ ఇద్నాని (Siddhi Idnani) కథానాయికగా నటించిన ఈ సినిమాలో హీరో తల్లి పాత్రను రాధికా శరత్ కుమార్ చేశారు. ఈ చిత్రానికి కథ: బి. జయమోహన్, సంగీతం: ఏఆర్ రెహమాన్, కెమెరా: సిద్ధార్థ నూని, ఎడిటింగ్: ఆంథోనీ, పాటలు: అనంత్ శ్రీరామ్, కృష్ణ కాంత్, గానం: శ్రేయా ఘోషల్, చిన్మయి శ్రీపాద.
Also Read : 'ఒకే ఒక జీవితం' రివ్యూ : టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ & మదర్ సెంటిమెంట్ శర్వాకు హిట్ ఇచ్చాయా?
'ది లైఫ్ ఆఫ్ ముత్తు' ఫస్ట్ లుక్ :
View this post on Instagram