News
News
X

Oke Oka Jeevitham Review - 'ఒకే ఒక జీవితం' రివ్యూ : టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ & మదర్ సెంటిమెంట్ శర్వాకు హిట్ ఇచ్చాయా?

Oke Oka Jeevitham Movie Review : అమల అక్కినేని, శర్వానంద్ తల్లీ కుమారులుగా నటించిన చిత్రం 'ఒకే ఒక జీవితం'. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో మదర్ సెంటిమెంట్‌తో రూపొందిన సైన్స్ ఫిక్షన్ చిత్రమిది.

FOLLOW US: 

సినిమా రివ్యూ : ఒకే ఒక జీవితం
రేటింగ్ : 3/5
నటీనటులు : శర్వానంద్, అమల అక్కినేని, రీతూ వర్మ, 'వెన్నెల' కిశోర్, ప్రియదర్శి, నాజర్, ఆలీ, మధునందన్, 'మాస్టర్' జై ఆదిత్య, రవి రాఘవేంద్ర తదితరులు
మాటలు : తరుణ్ భాస్కర్ (తెలుగులో)
సినిమాటోగ్రఫీ : సుజిత్ సారంగ్ 
సంగీతం: జేక్స్ బిజాయ్ 
నిర్మాతలు : ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. శేఖర్ 
రచన, దర్శకత్వం : శ్రీ కార్తీక్ 
విడుదల తేదీ: సెప్టెంబర్ 9, 2022

తెలుగులో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సినిమాలు వచ్చాయి. మదర్ సెంటిమెంట్ సినిమాలు వచ్చాయి. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో మదర్ సెంటిమెంట్ సినిమా అంటే 'ఒకే ఒక జీవితం' (Oke Oka Jeevitham Movie) అని చెప్పాలి. శర్వానంద్ హీరోగా, ఆయన తల్లి పాత్రలో అమల అక్కినేని నటించిన చిత్రమిది. హీరో స్నేహితులుగా ప్రియదర్శి, 'వెన్నెల' కిశోర్... కథానాయికగా రీతూ వర్మ, కీలక పాత్రలో నాజర్ కనిపించారు. ఈ సినిమా ఎలా ఉంది?  

కథ (Oke Oka Jeevitham Story) : ఆది (శర్వానంద్) గిటారిస్ట్. చైతు (ప్రియదర్శి) పెళ్లి చేసుకోవడం జీవిత లక్ష్యం అన్నట్లు సంబంధాలు చూస్తుంటాడు. శ్రీను ('వెన్నెల' కిశోర్) అద్దె ఇంటి కోసం వెతికే వాళ్లకు ఇల్లు చూపించే బ్రోకర్... ముగ్గురూ చిన్ననాటి నుంచి స్నేహితులు. ఆది చిన్నతనంలోనే సంగీతం వైపు అడుగులు వేసేలా తల్లి (అమల అక్కినేని) ప్రోత్సహిస్తుంది. ఆమె ఇరవై ఏళ్ల క్రితం మరణిస్తుంది. ఆది మనసులో బాధ, తల్లి లేని వెలితి ఉంటాయి. ఒక రోజు శ్రీనుతో పాటు వెళ్లిన అతడికి సైంటిస్ట్ రంగి కుట్ట పాల్ (నాజర్) పరిచయం అవుతాడు. ఇరవై ఏళ్లు వెనక్కి పంపిస్తానని, తల్లితో మళ్లీ కలిసేలా చేస్తానని చెబుతాడు. అందుకు, ఆది సరేనంటాడు. అతడితో పాటు చైతు, శ్రీను కూడా కాలంలో వెనక్కి వెళతాడు. ఆ తర్వాత ఏమైంది? విధిరాతను మార్చగలిగారా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

విశ్లేషణ (Oke Oka Jeevitham Telugu Movie Review) : ఓ కాలం నుంచి మరొక కాలానికి వెళ్లడం నిజ జీవితంలో సాధ్యం కాదు కనుక... అటువంటిది తెరపై జరుగుతుంటే కొత్తగా ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు గతంలో చూశారు. ఇప్పుడు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ మూవీస్ వాళ్లకు కొత్త కాదు. రీసెంట్‌గా 'బింబిసార' వచ్చింది. విజయం సాధించింది. మరి, 'ఒకే ఒక జీవితం'లో కొత్త పాయింట్ ఏంటంటే... దర్శకుడు కథను నడిపించిన విధానం!

ఇంటర్వెల్ వరకు 'ఒకే ఒక జీవితం' కథ సాధారణంగా సాగింది. తల్లికి దూరమై, ఆమెను తలుచుకునే కుమారుడు... పెళ్లి కోసం పరితపించే మరో యువకుడు... చదువు లేకపోవడంతో జీవితంలో ఇబ్బందులు పడిన మరో యువకుడు... కథలో కొత్త అంశాలు ఏవీ లేవు. అయితే, సినిమా పరుగులు తీయడంతో పెద్దగా కంప్లైంట్స్ ఏమీ కనిపించవు. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో? అనే కుతూహలం పెంచుతుంది. థ్రిల్ ఇస్తుంది. 

సెకండాఫ్‌లో మదర్ సెంటిమెంట్ అండ్ ఎమోషన్ ఫ్రంట్ సీట్ తీసుకున్నాక...  స్క్రీన్ ప్లేలో స్పీడ్ తగ్గింది. సాగదీత ఎక్కువైంది. కొన్ని ట్విస్టులు స‌ర్‌ప్రైజ్‌ చేసినా... ప్రేక్షకుడి ఊహకు అందకుండా కథను నడిపించడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ కాలేదు. కానీ, ఆసక్తిగా కథను ముందుకు నడిపారు. అయితే, నిదానంగా వెళ్ళడం వల్ల నిడివి ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. శర్వా, అమల, చిన్న పిల్లలు కొన్ని సన్నివేశాలను తమ నటనతో నిలబెట్టారు. ఇంటర్వెల్ తర్వాత సినిమాను రేసీగా నడిపిస్తే బావుండేది. 

తరుణ్ భాస్కర్ డైలాగులు సహజంగా ఉన్నాయి. జేక్స్ బిజాయ్ అందించిన స్వరాల్లో అమ్మ పాట బావుంది. నేపథ్య సంగీతం కూడా! సినిమాటోగ్రఫీ సూపర్. టైమ్ మెషిన్ సీన్స్‌లో గ్రాఫిక్స్ బాగా చేశారు. ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి.

'వెన్నెల' కిశోర్ ఇంట్లో గోడలపై చిరంజీవి స్టిల్స్ నుంచి మొదలుపెడితే... వీధిగోడపై పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ' పోస్టర్ చూపించడం, 'హిట్లర్' & 'సైరా నరసింహారెడ్డి' సినిమా విడుదల తేదీలను కథలో మెయిన్ ట్విస్ట్‌కు వాడుకోవడం చూస్తే... 'ఒకే ఒక జీవితం' దర్శకుడో, కథానాయకుడో, లేదంటే సినిమా కీలక సభ్యుల్లో ఎవరో ఒకరు మెగా ఫ్యామిలీ వీరాభిమాని అని అర్థమవుతుంది. లేదంటే సినిమాలో అన్ని మెగా రిఫరెన్సులు ఉండవు.  

నటీనటులు ఎలా చేశారు? : శర్వానంద్ నటుడిగా మరోసారి మెరిశారు. అక్కినేని అమలతో పాటు కనిపించే భావోద్వేగ భరిత సన్నివేశాల్లో డైలాగులు లేకున్నా... కేవలం కళ్లతో హావభావాలు పలికించారు. పాత్ర పరిధి మేరకు చక్కటి అభినయం కనబరిచారు. తల్లిగా అక్కినేని అమలను చూడటం కొత్తగా ఉంటుంది. రెగ్యులర్, సీజనల్ ఆర్టిస్టులు, సీనియర్ హీరోయిన్లను కాకుండా ఆమెను తీసుకోవడం వల్ల ఫ్రెష్‌నెస్‌ వచ్చింది. 'వెన్నెల' కిశోర్ తనలో కమెడియన్ మాత్రమే కాదు, ఆర్టిస్ట్ కూడా ఉన్నాడని కొన్ని సన్నివేశాల్లో చూపించారు. చాలా చోట్ల నవ్వించారు.  ప్రియదర్శి పర్వాలేదు. ఇక, సైంటిస్ట్‌గా నాజర్... హీరో ప్రేయసి పాత్రలో రీతూ వర్మ చక్కగా నటించారు. చిన్న పిల్లాడు 'అక్క' అని పిలిచే సన్నివేశంలో రీతూ వర్మ ఎమోషన్స్ హైలైట్. హీరో చైల్డ్‌హుడ్‌ రోల్ చేసిన 'మాస్టర్' జై ఆదిత్య కొన్నాళ్లు గుర్తుంటాడు. ఆ వయసులో అటువంటి ఎమోషనల్ సీన్స్ చేయడం మామూలు విషయం కాదు. జై ఆదిత్యతో పాటు మరో ఇద్దరు చిన్నారులు కూడా బాగా చేశారు. 

Also Read : 'కెప్టెన్' సినిమా రివ్యూ : ఆర్య గురి తప్పిందా? బావుందా?

ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'ఒకే ఒక జీవితం'... రెగ్యులర్‌గా చూసే సినిమాలకు డిఫరెంట్ పాయింట్‌తో రూపొందిన సినిమా. అంతే కాదు, రెగ్యులర్‌గా ఆడియన్స్ కోరుకునే రెగ్యులర్ కామెడీ, ఎమోషన్స్ ఉన్న సినిమా. సైన్స్ ఫిక్షన్ అనగానే మన ఊహకు అందని విషయాలు ఉంటాయని, ఈ సినిమా బుర్రకు పని చెబుతుందని అనుకోవద్దు. టైమ్ ట్రావెల్ / సైన్స్ ఫిక్షన్ నేపథ్యం తీసుకుని... దానికి రెగ్యులర్ ఎమోషన్స్ యాడ్ చేసి తీశారు. కొన్ని కొన్ని లోపాలను పక్కన పెడితే... శర్వా, అమల నటన కోసం ఒకసారి తప్పకుండా చూడొచ్చు. 'ఒకే ఒక జీవితం' ప్రేక్షకుల్ని  నవ్విస్తుంది, అక్కడక్కడా కంటతడి పెట్టిస్తుంది. చివర్లో చిన్న సందేశం కూడా ఇస్తుంది. 

Also Read : 'రంగ రంగ వైభవంగా' రివ్యూ : మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, రొమాంటిక్ హీరోయిన్ కేతికా శర్మ నటించిన సినిమా ఎలా ఉందంటే?

Published at : 09 Sep 2022 12:47 AM (IST) Tags: sharwanand Amala Akkineni ABPDesamReview Oke Oka Jeevitham Telugu Review Oke Oka Jeevitham Review In Telugu Tamil Film Kanam Telugu Review

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu Episode 27: సీజన్ 6లో తొలి మహిళా కెప్టెన్‌గా కీర్తి, శ్రీసత్య కాళ్లు పట్టిన అర్జున్ కళ్యాణ్ - జైలుకెళ్లక తప్పలేదు

Bigg Boss 6 Telugu Episode 27: సీజన్ 6లో తొలి మహిళా కెప్టెన్‌గా కీర్తి, శ్రీసత్య కాళ్లు పట్టిన అర్జున్ కళ్యాణ్ - జైలుకెళ్లక తప్పలేదు

Nanjiyamma: ఎవరీ నంజియమ్మ - మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు!

Nanjiyamma: ఎవరీ నంజియమ్మ - మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు!

68th National Film Awards: జాతీయ అవార్డుల ప్రధానోత్సవం - ఐదు అవార్డులతో ఓ మెరుపు మెరిసిన సూర్య, జ్యోతిక, ప్రత్యేక ఆకర్షణగా తమన్!

68th National Film Awards: జాతీయ అవార్డుల ప్రధానోత్సవం - ఐదు అవార్డులతో ఓ మెరుపు మెరిసిన సూర్య, జ్యోతిక, ప్రత్యేక ఆకర్షణగా తమన్!

Akanksha Mohan Suicide: నటి ఆత్మహత్య - సూసైడ్ నోట్‌లో ఏముందంటే?

Akanksha Mohan Suicide: నటి ఆత్మహత్య - సూసైడ్ నోట్‌లో ఏముందంటే?

HariHara Veeramallu: అక్టోబర్ లో 'హరిహర వీరమల్లు' షూటింగ్ - వీడియో రిలీజ్ చేసిన టీమ్!

HariHara Veeramallu: అక్టోబర్ లో 'హరిహర వీరమల్లు' షూటింగ్ - వీడియో రిలీజ్ చేసిన టీమ్!

టాప్ స్టోరీస్

YSR Kalyanamasthu : నేటి నుంచి అమల్లోకి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా- వెబ్ సైట్ ప్రారంభించిన సీఎం జగన్

YSR Kalyanamasthu : నేటి నుంచి అమల్లోకి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా- వెబ్ సైట్ ప్రారంభించిన సీఎం జగన్

Nagarjuna No Politics : విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Nagarjuna No Politics :  విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

ST Reservations: ఎస్టీలకు గుడ్ న్యూస్, 10 శాతం రిజ‌ర్వేష‌న్‌ అమలు చేస్తూ నోటిఫికేష‌న్ జారీ

ST Reservations: ఎస్టీలకు గుడ్ న్యూస్, 10 శాతం రిజ‌ర్వేష‌న్‌ అమలు చేస్తూ నోటిఫికేష‌న్ జారీ

World Coffee Day 2022: మీరు కాఫీ ప్రియులా? అయితే ఈ సమస్యల నుంచి గట్టెక్కినట్టే

World Coffee Day 2022: మీరు కాఫీ ప్రియులా? అయితే ఈ సమస్యల నుంచి గట్టెక్కినట్టే