Entertainment Top Stories Today: ‘అఖండ 2’ లాంచ్, మైత్రీ క్రేజీ డీల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Entertainment News Today In Telugu: ‘అఖండ 2’ లాంచ్ నుంచి మైత్రీ క్రేజీ డీల్ వరకు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ‘అఖండ 2’ అధికారికంగా లాంచ్ అయింది. దీనికి సంబంధించిన టైటిల్ టీజర్‌ను కూడా విడుదల చేశారు. ‘పుష్ప 2’, ఎన్టీఆర్ నీల్ ‘డ్రాగన్’ల కోసం మైత్రీ మూవీ మేకర్స్ టీ సిరీస్‌తో డీల్ కుదుర్చుకుంది. మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్... లోకేష్ కనగరాజ్‌తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.
‘పుష్ప 2’, ఎన్టీఆర్ నీల్ ‘డ్రాగన్’లకు మైత్రీ క్రేజీ డీల్
టీ-సిరీస్, మైత్రి మూవీ మేకర్స్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. నార్త్ లో టీ-సిరీస్ అగ్ర నిర్మాణ సంస్థగా కొనసాగుతుండగా, సౌత్ లో మైత్రి మూవీ మేకర్స్ దిగ్గజ ప్రముఖ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ రెండు సంస్థలు కలిశాయి. దేశ వ్యాప్తంగా పాన్ ఇండియన్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
అఖండగా ‘తాండవం’ చేయనున్న బాలయ్య
బాలయ్య కోసం బోయపాటి ‘అఖండ 2’ స్క్రిప్టు మీద కూర్చున్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ‘అఖండ 2’ని బుధవారం (అక్టోబర్ 16వ తేదీ) అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి ‘తాండవం’ అని ట్యాగ్ లైన్ పెట్టారు. దీంతో ఈ సినిమాతో బాలయ్య మాస్ తాండవం ఖాయం అని అనుకోవచ్చు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ‘అఖండ 2’ సినిమాను నిర్మించనున్నారు. బాలకృష్ణ కుమార్తె ఎం. తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
లోకేష్‌తో సూపర్ హీరో మూవీ, అల్లు అరవింద్ తో ‘గజినీ 2’
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వరుస సినిమాలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘సితార జమీన్ పర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘తారే జమీన్ పర్’ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అటు ‘అందాజ్ అప్నా అప్నా’ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషితో కలిసి ఓ మూవీ గురించి చర్చిస్తున్నారు. ఈ సినిమాకు తాత్కాలికంగా ‘చార్ దిన్ కి జిందగీ’ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు అమీర్ ఖాన్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో కలిసి ఓ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
చిన్న కుమార్తె స్విచ్ ఆన్ - పెద్ద కుమార్తె క్లాప్
గాడ్ ఆఫ్ మాసెస్ గా ఇండియాతో పాటు పలు దేశాల్లో మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న నటసింహం నందమూరి బాలయ్య కొత్త సినిమాపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా ఘనంగా జరిగింది. దీనికి బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మిణి, చిన్న కూతురు తేజస్విని కూడా హాజరు కావడం విశేషం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘అఖండ 2’ టైటిల్ వీడియోకే పూనకాలు తెప్పించిన థమన్!
నందమూరి నట సింహం బాలకృష్ణ, ఊరమాస్ సినిమాల డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరి కాంబోలో వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పటి వరకు మూడు సినిమాలు చేయగా, అన్నీ అద్భుత విజయం సాధించాయి. వసూళ్ల వర్షం కురిపించాయి. వీరిద్దరు కలిసి చివరగా ‘అఖండ’ సినిమా చేశారు. 2021లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. ఇప్పుడు ‘అఖండ’ సినిమాకు సీక్వెల్ ను ప్రకటించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)