అన్వేషించండి

Akhanda 2 : చిన్న కుమార్తె స్విచ్ ఆన్ - పెద్ద కుమార్తె క్లాప్ - బాలయ్య ' అఖండ 2' తాండవం షురూ 

Akhanda 2 Thaandavam: బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న ' అఖండ 2' సినిమా లాంచ్ ఈవెంట్ లో బాలయ్య చిన్న కుమార్తె స్విచ్ ఆన్ చేయగా, పెద్ద కుమార్తె క్లాప్ కొట్టడం విశేషం.

Akhanda 2 Thaandavam Opening: గాడ్ ఆఫ్ మాసెస్ గా ఇండియాతో పాటు పలు దేశాల్లో మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న నటసింహం నందమూరి బాలయ్య కొత్త సినిమాపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా ఘనంగా జరిగింది. దీనికి బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మిణి, చిన్న కూతురు తేజస్విని కూడా హాజరు కావడం విశేషం. 

'అఖండ 2' గ్రాండ్ లాంచ్
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో నాల్గవ సినిమాగా 'అఖండ 2' తెరకెక్కబోతోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో 'సింహా', 'లెజెండ్', 'అఖండ' వంటి హ్యాట్రిక్ హిట్స్ తెరపైకి వచ్చాయి. ఈ మూడు సినిమాలు కూడా ఒక దానికి మించి ఒకటి అన్నట్టుగా బ్లాక్ బస్టర్ హిట్స్ ను నమోదు చేసుకున్నాయి. ఇక ఇప్పుడు నాలుగవసారి బాలయ్య, బోయపాటి కాంబోలో రాబోతున్న 'అఖండ 2' సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మేకర్స్ మూవీ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఇది 'అఖండ' సీక్వెల్ అని అఫిషియల్ గా తెలిపారు. పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుండగా, ఈ సినిమా ఓపెనింగ్ విశేషాలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. దానికి కారణం బాలయ్య ఇద్దరు కుమార్తెలు. 

'అఖండ 2'లో భాగం కాబోతున్న బాలయ్య కూతురు 
ఈ సినిమాకు బాలయ్య పెద్ద కూతురు నారా బ్రాహ్మణి క్లాప్ కొట్టగా, చిన్న కుమార్తె తేజస్విని నందమూరి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మూవీ ప్రారంభోత్సవంలో క్లాప్, స్విచ్ ఆన్ లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బోయపాటి యాక్షన్ చెప్పగానే బాలయ్య అదిరిపోయే డైలాగ్ చెప్పారు. బాలయ్య కూతురు తేజస్విని 'అఖండ 2' సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'అఖండ 2' సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా మొదటి పార్ట్ లో నటించిన ప్రగ్యా జైస్వాల్ కనిపించనుంది. ఇక ఈ మూవీ ఇటు బాలయ్యతో పాటు అటు బోయపాటికి కూడా మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కాబోతోంది. 'అఖండ' సినిమాకు పూనకాలు తెప్పించే మ్యూజిక్ అందించిన తమన్ ఈ సీక్వెల్ కి కూడా సంగీతం అందించబోతున్నారు. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేసిన 'అఖండ 2' సెట్స్ పైకి వెళ్ళింది. అలాగే సంక్రాంతి కానుకగా బాలయ్య హీరోగా నటించిన 'ఎన్బికె 109' సినిమా కూడా తెరపైకి రానుంది. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉంది. అయితే మూవీ టైటిల్ ను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. అలాగే బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కూడా జరగబోతోంది. రీసెంట్ గా పుట్టినరోజు సందర్భంగా మోక్షజ్ఞ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. మొత్తానికి ఈ ఆరు నెలలలో టాలీవుడ్ లో నందమూరి నామస్మరణ జరుగుతుండడం విశేషం.

Read Also: ఎన్టీఆర్ నీల్ ‘డ్రాగన్’లకు మైత్రీ క్రేజీ డీల్ - బాలీవుడ్‌లో ఇంక జాతరే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sajjala Ramakrishna Reddy Notice : టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో సజ్జలకు నోటీసులు- రేపు విచారణకు రావాలని పోలీసులు ఆదేశం 
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో సజ్జలకు నోటీసులు- రేపు విచారణకు రావాలని పోలీసులు ఆదేశం 
Telangana News : ఆ ఒక్క కారణంతోనే మూసీ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టుకు కేసీఆర్‌ నో చెప్పారు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఆ ఒక్క కారణంతోనే మూసీ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టుకు కేసీఆర్‌ నో చెప్పారు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Tata Curvv EV Safety Rating: సేఫ్టీ రేటింగ్స్‌లో టాటా బెస్ట్ - ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన కార్లు ఇవే!
సేఫ్టీ రేటింగ్స్‌లో టాటా బెస్ట్ - ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన కార్లు ఇవే!
Akhanda 2 Thandavam: ‘అఖండ 2’ మూవీ వచ్చేస్తోంది - టైటిల్ వీడియోకే పూనకాలు తెప్పించిన థమన్!
‘అఖండ 2’ మూవీ వచ్చేస్తోంది - టైటిల్ వీడియోకే పూనకాలు తెప్పించిన థమన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హెజ్బుల్లా రహస్య సొరంగం వీడియో షేర్ చేసిన ఇజ్రాయేల్పీవీ నరసింహా రావుకి రతన్‌ టాటా లెటర్, వైరల్ అవుతున్న లేఖMaoist Nambala Keshava Rao Village | మావోయిస్టు దాడులు ఎక్కడ జరిగినా వినిపించే పేరు | ABP DesamIndian Navy VLF Station: నేవీ VLF స్టేషన్ అంటే ఏంటి? వికారాబాద్‌ అడవుల్లోనే ఎందుకు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sajjala Ramakrishna Reddy Notice : టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో సజ్జలకు నోటీసులు- రేపు విచారణకు రావాలని పోలీసులు ఆదేశం 
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో సజ్జలకు నోటీసులు- రేపు విచారణకు రావాలని పోలీసులు ఆదేశం 
Telangana News : ఆ ఒక్క కారణంతోనే మూసీ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టుకు కేసీఆర్‌ నో చెప్పారు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఆ ఒక్క కారణంతోనే మూసీ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టుకు కేసీఆర్‌ నో చెప్పారు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Tata Curvv EV Safety Rating: సేఫ్టీ రేటింగ్స్‌లో టాటా బెస్ట్ - ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన కార్లు ఇవే!
సేఫ్టీ రేటింగ్స్‌లో టాటా బెస్ట్ - ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన కార్లు ఇవే!
Akhanda 2 Thandavam: ‘అఖండ 2’ మూవీ వచ్చేస్తోంది - టైటిల్ వీడియోకే పూనకాలు తెప్పించిన థమన్!
‘అఖండ 2’ మూవీ వచ్చేస్తోంది - టైటిల్ వీడియోకే పూనకాలు తెప్పించిన థమన్!
Chennai Rains 2024: చెన్నై వర్షాలతో సూపర్ స్టార్‌కూ కష్టాలు - రజనీకాంత్ ఇంట్లోకి వరద నీరు - వీడియో
చెన్నై వర్షాలతో సూపర్ స్టార్‌కూ కష్టాలు - రజనీకాంత్ ఇంట్లోకి వరద నీరు - వీడియో
DA Hike: దీపావళి కానుక - ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరిగిందోచ్‌
దీపావళి కానుక - ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరిగిందోచ్‌
Jammu Kashmir CM: జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
Rail Bus Service In Konaseema: కోనసీమ అందాలు చూపించే కాకినాడ- కోటిపల్లి
కోనసీమ అందాలు చూపించే కాకినాడ- కోటిపల్లి "రైలు బస్సు"- రీ స్టార్ట్ చేయాలని కోరుతున్న ప్రజలు
Embed widget