అన్వేషించండి

Akhanda 2 Thandavam: ‘అఖండ 2’ మూవీ వచ్చేస్తోంది - టైటిల్ వీడియోకే పూనకాలు తెప్పించిన థమన్!

Akhanda 2: బాలయ్య, బోయపాటి క్రేజీ కాంబో మళ్లీ రిపీట్ అవుతోంది. బ్లాక్ బస్టర్ ‘అఖండ’కు సీక్వెల్ గా ‘అఖండ 2’ రాబోతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ రివీల్ చేశారు.

Boyapati Balayya New Movie:  నందమూరి నట సింహం బాలకృష్ణ, ఊరమాస్ సినిమాల డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరి కాంబోలో వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పటి వరకు మూడు సినిమాలు చేయగా, అన్నీ అద్భుత విజయం సాధించాయి. వసూళ్ల వర్షం కురిపించాయి. వీరిద్దరు కలిసి చివరగా ‘అఖండ’ సినిమా చేశారు. 2021లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. ఇప్పుడు ‘అఖండ’ సినిమాకు సీక్వెల్ ను ప్రకటించారు.   

‘అఖండ’ సీక్వెల్ టైటిల్ రివీల్ చేసిన మేకర్స్

‘అఖండ’ సినిమాకు సంబంధించి తాజాగా మేకర్స్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ను రివీల్ చేశారు. ఈ సినిమాకు ‘అఖండ 2: తాండవం’ అనే పేరును ఫిక్స్ చేశారు. ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో బాలయ్య నుదుటికి విభూతి రాసుకుంటూ ఇంటెన్స్ లుక్ లో ఆకట్టుకున్నారు. ఇక తమన్ బీజీఎం టైటిల్ రివీల్ వీడియోకు హైలెట్ గా నిలిచింది. ఈ వీడియో చూసి బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

సినిమా రంగంలోకి బాలయ్య కూతురు ఎంట్రీ

బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న నాలుగో చిత్రంతో నటసింహం చిన్న కూతురు ఎం. తేజస్వి నందమూరి సినిమా రంగంలోకి అడుగు పెడుతోంది. ‘అఖండ 2: తాండవం’ సినిమాను సమర్పిస్తోంది. అటు ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై  రామ్ అచంట , గోపీ అచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా  రూపొందనుంది. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య, బోయపాటి కలిసి చేసిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ లాంటి సినిమాలు ప్రేక్షకులను అద్భుతంగా అలరించాయి. నాలుగో సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు బాలయ్య అభిమానులు.   

‘అఖండ’కు మించిన యాక్షన్

‘అఖండ’ సినిమాలో బాలయ్య మాస్ యాక్షన్‌ ప్రేక్షకులను కట్టిపడేసింది. హిందుత్వ ఎజెండా సినిమా కథకు మరింత బలాన్ని చేకూర్చింది. దేవాలయాలు పరిరక్షణతో పాటు ఆలయాల విశిష్టతను బేస్ చేసుకుని ఈ సినిమాను అద్భుతంగా రూపొందించారు.  రెండో భాగంలో బోయపాటి ఏ పాయింట్ ను హైలెట్ చేస్తాడోనని అందరికీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం బాలయ్య, బాబీతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. బాలయ్య కెరీర్ లో 109వ సినిమా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది.  ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Read Also: ‘పుష్ప 2’, ఎన్టీఆర్ నీల్ ‘డ్రాగన్’లకు మైత్రీ క్రేజీ డీల్ - బాలీవుడ్‌లో ఇంక జాతరే!

Read Also: మెగా వర్సెస్ నందమూరి వర్సెస్ అక్కినేని, ఈ సంక్రాంతి క్లాష్ తో బాక్స్ ఆఫీసు మోత మోగాల్సిందే

టాప్ హెడ్ లైన్స్

Namitha New Look : అప్పుడు అలా... ఇప్పుడు ఇలా - స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్‌లో టాలీవుడ్ హీరోయిన్
అప్పుడు అలా... ఇప్పుడు ఇలా - స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్‌లో టాలీవుడ్ హీరోయిన్
Mahaprabhu Jagannath Release Date : మహాప్రభు జగన్నాథ్‌ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
మహాప్రభు జగన్నాథ్‌ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Family Stars Season 2 - ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్
ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్
Gedela Raju OTT : రెండు ఓటీటీల్లో రఘు కుంచె కొత్త మూవీ - పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో రఘు కుంచె కొత్త మూవీ - పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget