అన్వేషించండి

Prabhas Director Demand : 150 కోట్లు డిమాండ్ చేస్తున్న ప్రభాస్ దర్శకుడు?

Siddharth Anand : ప్రభాస్ దర్శకుడు ఒకరు చేస్తున్న డిమాండ్ విని నిర్మాతలు షాక్ అయ్యారట. చిత్ర నిర్మాతలే కాదు... ప్రభాస్ కూడా షాక్ తిన్నట్టు టాలీవుడ్ టాక్.

కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ అంటారు. అయితే, రెమ్యూనరేషన్ విషయంలో ఎక్కడో రాజమౌళి వంటి వారు మినహా దర్శకుడి కంటే హీరోలు ఎక్కువ తీసుకుంటారు. ఓ బాలీవుడ్ దర్శకుడు తనకు ప్రభాస్ రెమ్యూనరేషన్ కావాలని డిమాండ్ చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్. పూర్తి వివరాల్లోకి వెళితే... 

'పఠాన్' దర్శకుడితో ప్రభాస్ సినిమా!
పాన్ ఇండియా డార్లింగ్, రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా ప్లానింగులో ఉంది. హిందీ సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ అండ్ న్యూ ఏజ్ యాక్షన్ ఫిల్మ్స్ దర్శకుడిగా సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) పేరు తెచ్చుకున్నారు. హృతిక్ రోషన్ 'బ్యాంగ్ బ్యాంగ్', 'వార్'తో యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన 'పఠాన్' సినిమా తీసినది కూడా ఆయనే. 

150 కోట్లు డిమాండ్ చేస్తున్న సిద్ధార్థ్ ఆనంద్!?
ప్రస్తుతం ఒక్కో సినిమాకు బాహుబలి ప్రభాస్ 150 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆయన మార్కెట్ చూసి అంత ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అయితే, ప్రభాస్ హీరోగా చేయబోయే సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ కూడా అంతే మొత్తం డిమాండ్ చేస్తున్నారట. దాంతో హీరోతో పాటు నిర్మాతలు షాక్ అయ్యారట.  

Also Read : పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లో యువ హీరోకి ఛాన్స్ - సిరీస్ నుంచి సినిమాకు 

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఓ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. కొన్ని రోజులుగా ఈ న్యూస్ వినబడుతోంది. 'అన్‌స్టాపబుల్‌ 2'కు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి వచ్చారు. వాళ్ళను ప్రభాస్ సినిమా గురించి బాలకృష్ణ అడగ్గా... కన్ఫర్మ్ చేశారు. 

''ప్రభాస్ గారు, హిందీ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్లాన్ చేస్తున్నాం. సల్మాన్ ఖాన్ హీరోగా కూడా ఒక సినిమా ప్లానింగులో ఉంది'' అని నవీన్ యెర్నేని తెలిపారు. 

హృతిక్ 'ఫైటర్' తర్వాతేనా?
షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన 'పఠాన్' ఈ నెల 25న విడుదల కానుంది. దీని తర్వాత అతడు చేయబోయే సినిమా ఎప్పుడో కన్ఫర్మ్ అయ్యింది. 'వార్' లాంటి సూపర్ డూపర్ హిట్ తీసే అవకాశం ఇచ్చిన హృతిక్ రోషన్ కథానాయకుడిగా 'ఫైటర్' తీయడానికి సిద్ధార్థ్ ఆనంద్ రెడీ అవుతున్నారు. అందులో దీపికా పదుకోన్ కథానాయిక. ఆ సినిమా తర్వాత ప్రభాస్ ఫిల్మ్ సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 'ఫైటర్' కంప్లీట్ అయ్యేలోపు ప్రభాస్ మూడు సినిమాలు పూర్తి చేయాలి. 

Also Read : 'పఠాన్' రివ్యూ : కింగ్ ఖాన్ షారుఖ్ ఈజ్ బ్యాక్! మరి, సినిమా ఎలా ఉంది?  

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు ఐదు భారీ సినిమాలు ఉన్నాయి. 'ఆదిపురుష్'ను తొలుత ఈ సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నా... వీఎఫ్ఎక్స్ క్వాలిటీ కోసం వాయిదా వేశారు. జూన్ 16న ఆ సినిమా విడుదల చేయనున్నారు. 'కెజియఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' చేస్తున్నారు. అది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్. రెండు భాగాలుగా విడుదల కానుంది. సెప్టెంబర్ 28న 'సలార్' రిలీజ్. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె' సినిమా సెట్స్ మీద ఉంది. అది సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ ఒకటి చేస్తున్నారు. 

ఇప్పుడు ప్రభాస్ అంగీకరించిన సినిమాలు అన్నీ సెట్స్ మీద ఉన్నాయి. వీటి తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ సినిమా స్టార్ట్ అవుతుంది. దీనిపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. 'సలార్', 'ప్రాజెక్ట్ కె' ఎప్పుడో స్టార్ట్ చేయడం వల్ల త్వరలో షూటింగ్ కంప్లీట్ అవుతాయి. మారుతి ఫాస్టుగా సినిమా తీసే దర్శకుడు. ఆయన కూడా కంప్లీట్ చేస్తారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Bigg Boss Rohini: రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
Telangana: మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Embed widget