By: Satya Pulagam | Updated at : 25 Jan 2023 02:46 PM (IST)
'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా ఆయన వీరాభిమాని హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustad Bhagat Singh). సెట్స్ మీదకు వెళ్ళడానికి కొంచెం టైమ్ ఉంది. అయితే, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జోరుగా సాగుతోంది. నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ఈ సినిమాలో నటించే అవకాశాన్ని ఓ యువ హీరో అందుకున్నారు. అతను ఎవరు? అంటే.... వీజే సన్నీ!
'ఏటీఎమ్'కు నుంచి
'ఉస్తాద్ భగత్ సింగ్'కు...
హరీష్ శంకర్ కథ అందించడంతో పాటు ఓ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన వెబ్ సిరీస్ 'ఏటీఎమ్'. ఇటీవల 'జీ 5' ఓటీటీలో విడుదల అయ్యింది. అందులో వీజే సన్నీ (VJ Sunny) హీరోగా నటించారు. సిరీస్ విడుదల ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ గారితో 'గబ్బర్ సింగ్' తీసిన హరీష్ శంకర్ తొలి వెబ్ సిరీస్ 'ఏటీఎమ్'లో తాను హీరో కావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమాతో నటించే ఛాన్స్ కూడా అందుకున్నారు.
'ఏటీఎమ్'కు లభిస్తున్న స్పందన తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపిన వీజే సన్నీ... దర్శకుడు చంద్రమోహన్, నటుడు రవిరాజ్‌తో కలిసి ABP Desamకు వీడియో ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పవన్ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పారు.
''పవన్ కళ్యాణ్ గారితో మీరు చేయబోయే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా సెట్స్‌కు ఒక్కసారి వస్తానని, మీతో ఫోటో దిగుతానని హరీష్ శంకర్ గారికి ఓసారి అడగాలని అనుకున్నాను. అయితే, ఓ రియాలిటీ షోకి వెళ్ళినప్పుడు ఆ సినిమాలో నేను కూడా నటిస్తున్నానని చెప్పారు. నాకు అది సర్‌ప్రైజ్. ఐయామ్ సో హ్యాపీ'' అని ఏబీపీ దేశం ఛానల్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో సన్నీ చెప్పారు.
స్క్రిప్ట్ విభాగంలో 'ఏటీఎమ్' దర్శకుడు
'ఏటీఎమ్' వెబ్ సిరీస్‌కు సి. చంద్రమోహన్ దర్శకత్వం వహించారు. ఆయనపై హరీష్ శంకర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఒకవేళ తాను దర్శకత్వం వహించినా అంత బాగా సిరీస్ తీయలేమోనని చెప్పారు. హరీష్ శంకర్ కథకు చంద్రమోహన్ చక్కటి స్క్రీన్ ప్లే రాశారు. బహుశా... అది నచ్చినట్టుంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' స్క్రిప్ట్ వర్క్ విభాగంలోకి 'ఏటీఎమ్' దర్శకుడిని హరీష్ శంకర్ ఆహ్వానించారు. తాను స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్లు ఏబీపీ దేశం ఛానల్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ చెప్పారు. ఆయనకు రచనా సహకారం క్రెడిట్స్ ఇచ్చారు.
స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో దశరధ్
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'మిస్టర్ పర్‌ఫెక్ట్' గుర్తు ఉందిగా!?కింగ్ అక్కినేని నాగార్జున 'సంతోషం' సినిమా!? ఆ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన దశరథ్ ఉన్నారుగా! ఇప్పుడు ఆయన కూడా పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'కు వర్క్ చేస్తున్నారు.
Also Read : 'పఠాన్' రివ్యూ : కింగ్ ఖాన్ షారుఖ్ ఈజ్ బ్యాక్! మరి, సినిమా ఎలా ఉంది?
డీవై చౌదరి దర్శకత్వం వహించడంతో పాటు దశరథ్‌తో కలిసి నిర్మించిన సినిమా 'లవ్ యు రామ్'. ఆ సినిమా టీజర్ విడుదల కార్యక్రమానికి హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తాను తీయబోయే తాజా సినిమా స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో దశరథ్ వర్క్ చేస్తున్నారని చెప్పారు. దశరథ్ స్క్రీన్ ప్లే రాస్తున్నారు.
'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించనున్నారు. సినిమాకు డిసెంబర్ లో పూజ చేశారు. త్వరలో సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది 'తెరి' రీమేక్ అయినప్పటికీ హరీష్ శంకర్ తనదైన శైలిలో మార్పులు చేర్పులు చేస్తున్నారని దశరథ్ తెలిపారు.
Also Read : విజయ్ ఆంటోనీ సేఫ్ - సర్జరీ పూర్తి, హాస్పిటల్ బెడ్ నుంచి అప్డేట్
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
సిద్దార్థ్- కియారా జంటకు క్షమాపణలు చెప్పిన ఉపాసన, ఎందుకంటే..
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
Pawan Kalyan As God : ప్రేమికుల రోజు నుంచి దేవుడిగా పవన్ కళ్యాణ్
Jailer vs Indian 2: ఒకే రోజు కమల్, రజినీ సినిమాలు విడుదల, 18 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్!
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !
No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్‌న్యూస్! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్ తెస్తున్నారు!
PM Modi On Opposition: ఈడీ దెబ్బకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి,ప్రజలే నా రక్షణ కవచం - ప్రధాని మోదీ