అన్వేషించండి

'భజే వాయు వేగం' టీజర్‌ అప్‌డేట్‌, తారకరత్న భార్య కీలక నిర్ణయం - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

Rana Naidu 2 Update: ఈరోజుల్లో స్టార్ హీరోలు సైతం ఓటీటీ కంటెంట్‌లో కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే గతేడాది దగ్గుబాటి ఫ్యామిలీ హీరో రానా, వెంకటేశ్ కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌లో కనిపించారు. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌గా తెరకెక్కిన ‘రానా నాయుడు’కు మిక్స్‌డ్ టాక్ లభించింది. అయినా కూడా ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్‌పై చూడడం ప్రేక్షకులకు చాలా నచ్చింది. అందుకే ఈ సిరీస్‌కు సీజన్ 2ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక సీజన్ 2లో పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర కోసం ‘ఏజెంట్’ నటుడిని రంగంలోకి దించనుందట మూవీ టీమ్. ప్రస్తుతం ‘రానా నాయుడు 2’కు సంబంధించిన ఈ అప్డేట్ వైరల్ అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Karthikeya Baje Vayu Vegam Teaser Out: గతేడాది హీరో కార్తికేయ ‘బెదురులంక 2012’ సినిమాతో మంచి విజయం సాధించాడు. చాలా గ్యాప్‌ తర్వాత ఈ చిత్రం కార్తికేయ చెప్పుకోదగ్గ హిట్‌ ఇచ్చింది. ఇప్పుడు 'భజే వాయి వేగం' అంటూ వస్తున్నాడు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లో వస్తున్న ఈ మూవీ టైటిల్‌, గ్లింప్స్‌ రీసెంట్‌గా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంతలో ఈ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా తాజాగా 'భజే వాయు వేగం' టీజర్‌ రిలీజ్‌ అయ్యింది. డ్రగ్స్‌ కేసు, హత్య, పోలీసు కేసు, రాజకీయాలు, డబ్బు ఇలా ఆసక్తికర అంశాలతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా టీజర్‌ సాగింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Taraka Ratna Wife Alekhya Reddy Support in AP Elections: దివంగత నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కీలక  నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఎన్నికల్లో భాగంగా ఆమె సపోర్టు చేసే పార్టీ ఏదో తేల్చేశారు. తాజాగా ఆమె షేర్‌ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో అలేఖ్యా రెడ్డి సపోర్టు చేసే పార్టీ ఏదో ఇన్‌డైరెక్ట్‌గా వెల్లడించారు. కాగా తారకరత్న మరణాంతరం ఆయన బదులుగా అలేఖ్యా రెడ్డి ఎమ్మెల్యే పోటీ చేస్తారంటూ గతంలోకి వార్తలు వచ్చాయి. అంతేకాదు అలేఖ్యా రెడ్డి ఏ పార్టీకి వెళ్లితే ఆ పార్టీకి లాభం చేకూరే అంశాలే ఎక్కువ ఉన్నాయి. దీంతో అలేఖ్యాను తమ పార్టీలోని తీసుకోవాలని వైసీపీ, టీడీపీలు పోటీ పడుతున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Hollywood Action Director Work for War 2: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ - హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ 'వార్‌ 2'. ఇటీవల ఎన్టీఆర్‌ ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొన్నాడు. పది రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్‌-హృతిక్‌లపై యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కించారు. ఇక షూటింగ్‌ కూడా కంప్లీట్‌ చేసుకున్ని హైదరాబాద్‌ వచ్చాడు ఎన్టీఆర్‌. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. హై వోల్టేజ్‌ యాక్షన్‌ అండ్‌ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ 'వార్‌ 2' కోసం హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్‌ని రంగంలోకి దింపాడట డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Priyadarshi and Nabha Natesh Darling Glimpse: రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో ప్రియదర్శి, నభా నటేష్‌ హడావుడే నడుస్తుంది. 'డార్లింగ్‌' వ్యవహరంపై వీరిద్దరు గొడవ పడుతూనే ఉన్నారు. నభా దబ్ స్మాష్ చేయడం,  దానికి ప్రియదర్శి రియాక్ట్ అవుతూ.. 'డార్లింగ్' అని పిలవడం, అలా పిలిచినందుకు ఆమె సీరియస్ అవ్వడం. ఇలా నెట్టింట వారి పంచాయతీ హాట్‌టాపిక్‌ అయ్యింది. ఆఖరికి వీరిద్దరి రచ్చకు హీరోయిన్‌ రితూ వర్మ ఎంటరై తన కామెంట్‌ సెక్షన్‌లో ఈ రచ్చ ఏంటంటూ అసహనం చూపించింది. దీంతో ఈ 'డార్లింగ్‌' పంచాయతీ తెలియక నెటిజన్లంత తికమకపడ్డారు. ఇప్పుడు ఈ 'డార్లింగ్‌' పంచాయతికి ఎండ్‌ కార్డ్‌ పడింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Champions Trophy Winner India: ఏకైక జట్టుగా భారత్ రికార్డ్, అసాధారణ ఆటతో అద్భుత ఫలితం: భారత జట్టుపై రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు
ఏకైక జట్టుగా భారత్ రికార్డ్, అసాధారణ ఆటతో అద్భుత ఫలితం: భారత జట్టుపై రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు
TDP MLC Candidates: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
Telangana Latest News: ఎమ్మెల్సీగా విజయశాంతి-  అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
ఎమ్మెల్సీగా విజయశాంతి- అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
Garimella Balakrishna Prasad Passes Away: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs Nz Champions Trophy 2025 Final | ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీమిండియా | ABP DesamInd vs nz First Half Highlights | Champions Trophy 2025 Final లో భారత్ దే ఫస్ట్ హాఫ్ | ABP DesamInd vs NZ CT Final 2025 | అప్పుడు అంతా బాగానే ఉంది..కానీ ఆ ఒక్క మ్యాచ్ తో కోలుకోలేని దెబ్బ తిన్నాంInd vs Nz Champions Trophy 2025 Final | MS Dhoni కథకు క్లైమాక్స్ ఈరోజే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Champions Trophy Winner India: ఏకైక జట్టుగా భారత్ రికార్డ్, అసాధారణ ఆటతో అద్భుత ఫలితం: భారత జట్టుపై రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు
ఏకైక జట్టుగా భారత్ రికార్డ్, అసాధారణ ఆటతో అద్భుత ఫలితం: భారత జట్టుపై రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు
TDP MLC Candidates: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
Telangana Latest News: ఎమ్మెల్సీగా విజయశాంతి-  అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
ఎమ్మెల్సీగా విజయశాంతి- అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
Garimella Balakrishna Prasad Passes Away: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
Ram Charan Upasana: రామ్ చరణ్ - ఉపాసన దంపతులతో నమ్రత, సితార... రీసెంట్ పార్టీ ఫోటోస్ చూశారా?
రామ్ చరణ్ - ఉపాసన దంపతులతో నమ్రత, సితార... రీసెంట్ పార్టీ ఫోటోస్ చూశారా?
Telangana Latest News: తెలంగాణ చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- లక్ష వరకు రుణమాఫీ!
తెలంగాణ చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- లక్ష వరకు రుణమాఫీ!
Prabhas Prashanth Varma Movie: బ్రహ్మ రాక్షస కాదు... ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమాకు కొత్త టైటిల్
బ్రహ్మ రాక్షస కాదు... ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమాకు కొత్త టైటిల్
BRS: 11న బీఆర్​ఎస్​ శాసనసభా పక్ష సమావేశం.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​!
11న బీఆర్​ఎస్​ శాసనసభా పక్ష సమావేశం.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​!
Embed widget