Darling Glimpse: ప్రియదర్శి-నభా నటేష్ సోషల్ మీడియా రచ్చకు ఎండ్ కార్డ్ - 'డార్లింగ్' మూవీ గ్లింప్స్‌తో క్లారిటీ ఇచ్చేశారు!
ప్రియదర్శి, నభా నటేష్ సోషల్ మీడియా రచ్చకు ఎండ్ కార్డు పడింది రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రియదర్శి, నభా నటేష్ హడావుడే నడుస్తుంది. 'డార్లింగ్' వ్యవహరంపై వీరిద్దరు గొడవ పడుతూనే ఉన్నారు.
Priyadarshi and Nabha Natesh Darling Glimpse: రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రియదర్శి, నభా నటేష్ హడావుడే నడుస్తుంది. 'డార్లింగ్' వ్యవహరంపై వీరిద్దరు గొడవ పడుతూనే ఉన్నారు. నభా దబ్ స్మాష్ చేయడం, దానికి ప్రియదర్శి రియాక్ట్ అవుతూ.. 'డార్లింగ్' అని పిలవడం, అలా పిలిచినందుకు ఆమె సీరియస్ అవ్వడం. ఇలా నెట్టింట వారి పంచాయతీ హాట్‌టాపిక్ అయ్యింది. ఆఖరికి వీరిద్దరి రచ్చకు హీరోయిన్ రితూ వర్మ ఎంటరై తన కామెంట్ సెక్షన్‌లో ఈ రచ్చ ఏంటంటూ అసహనం చూపించింది. దీంతో ఈ 'డార్లింగ్' పంచాయతీ తెలియక నెటిజన్లంత తికమకపడ్డారు. ఇప్పుడు ఈ 'డార్లింగ్' పంచాయతికి ఎండ్ కార్డ్ పడింది.
ఇదంతా సినిమా ప్రమోషన్స్ కోసం చేశారని అర్థమైమవుతుంది. ప్రియదర్శి, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ మూవీపై అధికారిక ప్రకటన ఇస్తూ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసి టైటిల్ గ్లింప్స్ ఆకట్టుకుంది. ప్రయదర్శి ఓ సెలూన్‌కి వెళ్లిన సీన్‌తో గ్లింప్స్ స్టార్ట్ అయ్యింది. "మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి హెయిర్ స్టైల్ కావాలా? ఏం అని అడగ్గా.. వాళ్ల లెక్క హెయిర్ కట్ చేస్తే మన జిందగీ కూడా వారి లెక్క మారుతుందా? కానీ, మాలిష్ చేయ్ అంటాడు. ఇక ఆ తర్వాత ఏమైందని అడగ్గా.. అసలు ఈ ఆడవాళ్లు ఎందుకిలా ఉంటారు. అమ్మలా ఉన్నప్పుడు ప్రేమగా, అప్యాయంగా ఉంటారు.. చెల్లిగా ఉంటే ప్రొటెక్టివ్‌గా, కెరింగ్‌తో ఉంటారు.
అదే అమ్మాయి లవర్‌గా ఉంటే క్యూట్‌గా, బబ్లిగా మనల్ని ఎంతో అండర్‌స్టాండింగ్ చేసుకున్నట్టు ఉంటారు. కానీ పెళ్లయి పెళ్లాం అయ్యాక ఎందుకు ఇలా మారతారు. జిందగీ మొత్తం తలకిందులు చేసి, మన ప్రపంచాన్ని తారుమారు చేసి.. మన తాటీ తీసి ముడిని తందూరి చేసుకుని వండుకుని తింటారు" అంటూ ప్రయదర్శి ఫ్రస్టెట్ అవుతాడు. చూస్తుంటే ఇందులో ప్రియదర్శి, నభా నటేష్ భార్యభర్తలుగా నటించబోతున్నట్టు అర్థమైపోతుంది. భార్యలతో ఇబ్బందులు పడే భర్తల కథే ఈ సినిమా స్టోరీ అని ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. కోలీవుడ్ డైరెక్టర్ అశ్విన్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాను హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్స్ నిర్మిస్తున్నారు. ఇక ప్రభాస్ హిట్ మూవీ ‘డార్లింగ్’ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.