War 2 Update: 'వార్ 2' కోసం రంగంలోకి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ - థియేటర్లో ఎన్టీఆర్ విశ్వరూపమే..!
War 2 Movie: 'వార్ 2'కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. హై వోల్టేజ్ యాక్షన్ కోసం కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ పని చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Hollywood Action Director Work for War 2: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ 'వార్ 2'. ఇటీవల ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొన్నాడు. పది రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్-హృతిక్‌లపై యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. ఇక షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్ని హైదరాబాద్ వచ్చాడు ఎన్టీఆర్. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. హై వోల్టేజ్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ 'వార్ 2' కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్‌ని రంగంలోకి దింపాడట డైరెక్టర్ అయాన్ ముఖర్జీ.
వార్ 2 కోసం రంగంలోకి డైరెక్టర్ స్పిరో రాజటోస్
ఆయన అమెరికన్ యాక్షన్ డైరెక్టర్ స్పిరో రాజటోస్. 'కెప్టెన్ అమెరికా సివిల్ వార్' వంటి చిత్రాలకు స్టంట్ డైరెక్టరైన ఆయన ఇప్పుడు వార్ 2కి పనిచేస్తున్నట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్. అంతేకాదు 'వార్ 2'కి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ అని ఆయనే డిజైన్ చేస్తున్నారని, స్పిరో ఆధ్వర్యంలోనే యాక్షన్ పార్ట్స్ తెరకెక్కనున్నట్టు సమాచారం. ఇక అప్‌డేట్స్ చూసి మూవీ లవర్స్ అంతా స్టన్ అవుతున్నారు. మొదటి పార్ట్ 'వార్'లో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలిసిందే. థియేటర్లో ఈ సినిమా చూసినవారంత యాక్షన్ సీక్వెన్స్ ఫిదా అయ్యారు. సెకండ్ పార్ట్‌కి అంతకు యాక్షన్ సీక్వెన్స్‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్-హృతిక్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు ఈ సినిమా నటిస్తున్నారు అనగానే ఆడియన్స్‌లో ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ మొదలయ్యాయి.
ఫుల్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్ 'వార్ 2'కి ఇప్పుడు హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ జతకావడంతో మూవీపై ఓ రేంజ్‌లో అంచనాలు మొదలయ్యాయి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ చూసి అంతా స్టన్ అయ్యారు. ఇక 'వార్ 2'లో తారక్ గన్స్ పట్టి యుద్ధమే చేయబోతున్నాడు. అదీ కూడా హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ దర్శకత్వంలో. ఇక ఎన్టీఆర్ విశ్వరూపం చూపిస్తాడేమో అంటూ ఫ్యాన్స్ అంతా అంచనాలు వేసుకుంటున్నారు. కాగా వార్ 2ని బ్రహ్మస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. YRF బ్యానర్లో ఆదిత్య రాజ్ చోప్రా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2025 ఆగస్ట్ 14వ రిలీజ్ చేస్తామని ఇప్పటికే మూవీ టీం ప్రకటిచింది.
'వార్ 2' మూవీలో ఎన్టీఆర్ రా ఎజెంట్‌గా కనిపిస్తాడని, తనది నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రని తెలుస్తోంది. ఈ సినిమాలో 'నాటూ నాటూ'సాంగ్ రేంజ్‌లో ఓ మాస్ ఉండబోతుందని టాక్. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్లో అదిరిపోయే మాస్ సాంగ్ తీసేందుకు అయాన్ ముఖర్జీ ఈ సాంగ్ చాలా స్పెషల్ గా డిజైన్ చేశాడట. త్వరలోనే ఈ పాటకు సంబంధించి చిత్రీకరణ జరుగనుందని సమాచారం. హృతిక్, తారక్ ఇద్దరు స్టైలిష్ మాస్ డాన్సర్స్ కావడంతో ఈ సాంగ్ కొరియోగ్రఫీ కోసం బెస్ట్ కొరియోగ్రాఫర్స్ ని రంగంలోకి దించబోతున్నారట. లేటెస్ట్ బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సాంగ్ కోసం బాలీవుడ్ నుంచి గణేష్ మాస్టర్, టాలీవుడ్ నుంచి జానీ మాస్టర్ ఇద్దరూ కలిసి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో కొన్ని హుక్ స్టెప్స్ ని డిజైన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Also Read: 'సలార్' మేకర్స్ భారీ ఆఫర్ - టీవీలో ఈ సినిమా చూస్తూ ప్రభాస్ నడిపిన బైక్ గెలవచ్చు, ఎలా అంటే!