Nara Lokesh: సాయం కోరిన గెడ్డం ఉమ - వెంటనే స్పందించిన నారా లోకేష్ - సోషల్ మీడియాలో ఇప్పుడిదే హాట్ టాపిక్ !
TDP: మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ సాయం వైరల్ అవుతోంది. దీనికి కారణం ఆ సాయం అడిగింది వైసీపీ మహిళా నేత కావడం.

Geddam Uma YSRCP : ఏపీలో రాజకీయ పార్టీలకు ఉండే సోషల్ మీడియా సైన్యాలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఎవరికి వారు శత్రువులు అన్నట్లుగా పోరాడుతూంటారు. నచ్చని పార్టీ అధినేతలపై విరుచుకుపడుతూంటారు. ఘోరంగా వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు కేసులు పెట్టారు.కానీ కొంత మందికి మాత్రం అప్పుడప్పుడూ విచిత్రమైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటిదే ఇది.
వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహిళా కార్యకర్తల్లో గెడ్డం ఉమ ఒకరు. విశాఖపట్నంకు చెందిన ఆమె వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు. బైబై బాబు వంటి క్యాంపెయిన్లను నడిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట సింహాచలం ఆలయ బోర్డు సభ్యురాలిగా పదవి ఇచ్చారు. అయితే వయసు చిన్నది కావడంతో ఆమె ఆ పదవిలో చేరలేదు. తర్వాత మహిళా కమిషన్ సభ్యురాలి పదవి ఇచ్చారు. ఈ పదవికి ఇంకా గడువు ఉండటంతో కొనసాగుతున్నారు. ఆమె ప్రస్తుతం మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్నారు.
గెడ్డం ఉమ నారా లోకేష్ పై కూడా ఘాటు ట్వీట్లు పెట్టారు. జగన్ మోహన్ రెడ్డిని ప్రశంసిస్తూ లోకేష్ ను విమర్శిస్తూ ట్వీట్లు పెట్టారు. అయితే ఇటీవల ఓ చిన్న పిల్లవాడికి ట్రీట్ మెంట్ కి సాయం అవసరం అడగడంతో సోషల్ మీడియా ద్వారా నారా లోకేష్ కు విజ్ఞప్తి చేశారు.
Respected @AndhraPradeshCM @APDeputyCMO @naralokesh , A one month old baby boy from Vizianagaram is battling Laryngomalacia, a severe condition causing breathing issues. His treatment costs ₹10,00,000, which his family cannot afford. Kindly help his father, T. Govindarao, save… pic.twitter.com/b3vCoJsFPS
— Uma geddam (@Iamumaa) January 16, 2025
నారా లోకేష్ కూడా వెంటనే స్పందించి.. సాయం అందేలా చేశారు. దాంతో ఆమె లోకేష్ కు ధ్యాంక్యూ చెప్పారు.
Thank you so much @naralokesh Sir🙏🏻. https://t.co/8fFYjUuam7
— Uma geddam (@Iamumaa) January 17, 2025
నారా లోకేష్ పార్టీలు చూడకుండా.. సాయం అవసరాన్ని బట్టి స్పందిస్తారని అక్కడ అప్పుడే పుట్టిన బిడ్డ ప్రాణం కాపాడాలి కాబట్టి గెడ్డం ఉమ అడిగారా లేకపోతే వైసీపీ నేత అడిగారా అన్నది చూడలేదని టీడీపీ వర్గాలంటున్నాయి. కారణం ఏదైనా నారా లోకేష్ స్పందన మాత్రం సోషల్ మీడియాలో ప్రశంసలు కారణం అవుతోంది.
గెడ్డం ఉమపై మాత్రం టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో పదవిలో ఉన్పన్పుడు ఇలా ఒక్కరి కోసం అయినా సాయం చేయాలని సోషల్ మీడియాలో నాటి సీఎంను అడిగారా.... ఎవరికైనా ఇప్పించారా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అయితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా సరిగ్గా వైద్యం చేయనివ్వలేదని గుర్తు చేస్తున్నారు. అయితే అందరి రాజకీయాలు ఒకలా ఉండవని.. లోకేష్ లా సాయం అవసరమైనప్పుడు.. పార్టీలు కూడా చూడకూడదని అలాగే ఉండాలని అంటున్నారు.





















