బాలీవుడ్‌పై ప్రశాంత్ వర్మ ఫోకస్, నితిన్ సినిమా నుంచి శ్రీలీల అవుట్? - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
Actor Chitti Babu Revealed Sharath Babu & Jayalalitha Relation: కమెడియన్ చిట్టిబాబు. అలనాటి నటుడు రాజాబాబు తమ్ముడిగా అందరికీ పరిచయం. ఇక చిట్టిబాబు కూడా ఎన్నో కామెడీ పాత్రలు వేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆయన చేసిన ప్రతి పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఆయన నటనకు కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే, చాలాకాలం తర్వాత ఆయన స్క్రీన్ మీద కనిపించారు. ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు చిట్టిబాబు. ఈ సందర్భంగా అప్పటి విషయాలను ఎన్నో గుర్తు చేసుకున్నారు. దాంట్లో భాగంగా రమాప్రభ, శరత్ బాబు గురించి చెప్పుకొచ్చారు. శరత్ బాబు, జయలలిత మధ్య ఉన్న సంబంధం గురించి ప్రస్తావించారు. ఇంకా ఎన్నో విషయాలు చెప్పారు ఆయన. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Sreeleela Again Replaced: టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీలా కెరీర్‌కి బ్రేక్‌లు పడుతున్నాయా? ఇక ఆమెకు ఎదురుదెబ్బలు తప్పవా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. 'ధమాకా' నుంచి వరుస హిట్స్, బిగ్ ప్రాజెక్ట్స్, స్టార్ హీరో మూవీస్ ఇలా కెరీర్‌లో ఫుల్ స్వీగ్‌తో దూసుకుపోయింది శ్రీలీలా. ఇలా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిందో లేదో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. స్టార్ హీరోయిన్స్ పూజా హెగ్డే, రష్మిక వంటి స్టార్స్ రిప్లేస్ చేసింది. వచ్చి రాగానే టాలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతున్న ఆమెకు కెరీర్‌కు ఇప్పుడు బ్రేక్స్ పడుతున్నాయి. మొన్నటి వరకు అందరిని హీరోయిన్లను ఆమె రిప్లేస్ చేస్తుంది.. ఇప్పుడు ఆమెనే రిప్లేస్ అవుతుంది. ఇటీవల విజయ్ దేవరకొండ (#VD12) మూవీ నుంచి ఆమెను తీసేసిన సంగతి తెలిసిందే. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Prasanth Varma Movie With Ranveer Singh: ‘హనుమాన్’తో కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు ప్రశాంత్ వర్మ. అప్పటివరకు ఈ డైరెక్టర్ గురించి చాలామంది ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోయినా.. ‘హనుమాన్’తో తానేంటో నిరూపించుకున్నాడు. కేవలం ప్రశాంత్ వర్మ మాత్రమే కాదు.. తేజ సజ్జా కూడా ఈ మూవీతోనే పాపులర్ అయ్యాడు. ప్రశాంత్ వర్మ అయితే తన సినిమాటిక్ యూనివర్స్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే కొన్నాళ్ల పాటు తన సినిమాటిక్ యూనివర్స్‌ను పక్కన పెట్టి ఒక బాలీవుడ్ స్టార్‌తో మూవీ చేయడానికి ప్రశాంత్ వర్మ సిద్ధమయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Boyapati Sreenu Gives Update On Akhanda 2: నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి కాంబోలో 'సింహా', 'లెజెండ్', 'అఖండ వంటి సినిమాలొచ్చాయి. ఇవి ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయ్యాయి. ముఖ్యంగా 'అఖండ' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. 2021లో విడుదలైన ఈ సినిమా ఆ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. బాలయ్యను రూ.100 కోట్ల క్లబ్ లో చేర్చిన సినిమా కూడా ఇదే. అలాంటి ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ ఉంటుందని మూవీ టీం గతంలోనే ప్రకటించారు. 'అఖండ' సీక్వెల్ కోసం బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ బోయపాటి శ్రీను సీక్వెల్ పై క్లారిటీ ఇస్తూ సీక్వెల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో కూడా వివరించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
సంయుక్తా మీనన్ (Samyuktha Menon)కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ ఇమేజ్ ఉంది. ఆమె చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం నమోదు చేసిందని చెప్పవచ్చు. 'సంయుక్త ఉంటే సినిమా హిట్టే' అని దర్శక నిర్మాతల్లో ఓ నమ్మకం ఏర్పడిందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. విజయాలకు తోడు నటిగానూ ఆమె ప్రూవ్ చేసుకున్నారు. దాంతో ఆమెకు ముంబై మూవీ ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే... (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)