అన్వేషించండి

Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను

బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన 'అఖండ' సినిమాకి సీక్వెల్ ఉంటుందని గతంలోని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన బోయపాటి శ్రీను 'అఖండ' సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు.

Boyapati Sreenu Gives Update On Akhanda 2: నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి కాంబోలో 'సింహా', 'లెజెండ్', 'అఖండ వంటి సినిమాలొచ్చాయి. ఇవి ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయ్యాయి. ముఖ్యంగా 'అఖండ' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. 2021లో విడుదలైన ఈ సినిమా ఆ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. బాలయ్యను రూ.100 కోట్ల క్లబ్ లో చేర్చిన సినిమా కూడా ఇదే. అలాంటి ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ ఉంటుందని మూవీ టీం గతంలోనే ప్రకటించారు. 'అఖండ' సీక్వెల్ కోసం బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ బోయపాటి శ్రీను సీక్వెల్ పై క్లారిటీ ఇస్తూ సీక్వెల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో కూడా వివరించారు.

ఎన్నికల తర్వాతే 'అఖండ' సీక్వెల్

బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఏపీలో ఎలక్షన్స్ హడావిడి మొదలవడంతో షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎలక్షన్ పూర్తయ్యాకే మళ్లీ బాలయ్య షూటింగ్లో పాల్గొంటారు. బాబీతో మూవీ పూర్తవ్వగానే వెంటనే అఖండ సీక్వెల్ ఉండబోతుందని తాజా సమాచారం. ఇదే విషయాన్ని దర్శకుడు బోయపాటి స్వయంగా మీడియా వేదికగా చెప్పారు. కోకాపేటలో నిర్మాత సురేష్ బాబు నిర్మించిన శివకేశవ మహా సన్నిధానం ఆలయం ప్రారంభోత్సవానికి వచ్చిన బోయపాటి మీడియాతో మాట్లాడుతూ.. "ప్రస్తుతం ఎన్నికల హడావిడి ఉంది. ఎలక్షన్స్ ఉండడంతోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ని హోల్డ్ లో పెట్టాం. ఎన్నికలయ్యాక 'అఖండ 2' సినిమా అనౌన్స్మెంట్ ఉంటుంది" అని అన్నారు.

'అఖండ 2'లో సమాజానికి కావాల్సిన కాన్సెప్ట్ ఉంటుంది

"మీరు అఖండ చూశారు. అందులో పసిబిడ్డ, ప్రకృతి, పరమాత్మ.. ఈ మూడింటి కాన్సెప్ట్ ని టచ్ చేశాం. ఈసారి 'అఖండ 2' లో కూడా సొసైటీకి కావలసిన మంచి కాన్సెప్ట్ ఉండబోతుంది. దాని మీదే కాన్సెంట్రేట్ చేసి ముందుకెళ్తున్నాం. ఇక దైవత్వం అంటారా! అది భారతీయుల నరనరాల్లో ఇంకిపోయి ఉంది. కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు" అని చెప్పుకొచ్చాడు. బోయపాటి చెప్పిందాన్ని బట్టి 'అఖండ 2'లో దైవత్వంతో పాటు ఓ సోషల్ మెసేజ్ కూడా ఇవ్వబోతున్నారని అర్థమవుతుంది. కాగా బోయపాటి గత ఏడాది 'స్కంద' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో 'అఖండ 2' స్క్రిప్ట్ విషయంలో బోయపాటి ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Also Read : కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?

టాప్ హెడ్ లైన్స్

Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Balakrishna Koratala Siva Movie: కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget