అన్వేషించండి

Kalki Movie: కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?

Kalki Movie Pre Release Business: ప్రభాస్ ఫ్లాప్ మూవీస్ సైతం మంచి ఓపెనింగ్స్ రాబడుతున్నాయి. దాంతో ఆయన కొత్త సినిమా 'కల్కి' రైట్స్ కోసం నిర్మాతలు భారీ మొత్తం కోట్ చేస్తున్నట్లు తెలిసింది.

రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ప్రతి సినిమాకు పెరుగుతూ వెళుతోంది. ఆయన హీరోగా నటించిన ఫ్లాప్, డిజాస్టర్ మూవీస్ సైతం మంచి ఓపెనింగ్స్ రాబట్టాయి. దాంతో హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రతి కొత్త సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరుగుతోంది. ప్రభాస్ (Prabhas) నుంచి నెక్స్ట్ రాబోయే పాన్ వరల్డ్ మూవీ 'కల్కి' (Kalki Movie - ప్రాజెక్ట్ కె) థియేట్రికల్ బిజినెస్ సైతం కళ్లు చెదిరే రేంజ్‌లో జరిగిందని ఫిల్మ్ నగర్ టాక్.

ఆంధ్ర ఏరియాస్ @ 100 కోట్లు!
Theatrical Rights Of Prabhas Kalki Andhra Pradesh Areas: 'మహానటి' తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'కల్కి 2989 ఏడీ'. సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ జానర్ కావడంతో సినిమాపై అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ స్థాయి హీరో ఉండటంతో పాటు నాగ్ అశ్విన్ క్వాలిటీ మూవీ తీస్తారని ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాల్లో నమ్మకం ఉండటం అందుకు కారణమని చెప్పాలి. 'కల్కి' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు. కానీ, ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయ్యింది. ఆంధ్రలో అన్ని ఏరియాలు కలిపి వంద కోట్లు కోట్ చేస్తున్నారట. అది కూడా నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ పద్ధతిలో ఇచ్చారట.

Also Read: వందే భారత్ ట్రైనులో సిగరెట్ కాలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ... తస్మాత్ జాగ్రత్త, ఇది మీ కోసమే

ప్రభాస్ ఫ్లాప్ మూవీస్ ఓపెనింగ్స్, నాగ్ అశ్విన్ ఫ్యాక్టర్, మూవీపై బజ్ వంటి లెక్కలు వేసుకుని డిస్ట్రిబ్యూటర్లు అంత అమౌంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నార్ట. ఒకవేళ ఏదైనా తేడా వచ్చినా రెండో పార్ట్ ఉంటుంది కాబట్టి అందులో సర్దుబాటు చేసే ఛాన్స్ ఉంటుందనే భరోసా. 

నైజాం @ 65 కోట్లు, సీడెడ్ కూడా వస్తే?
Kalki movie nizam rights price: 'కల్కి' సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్ 65 కోట్లకు అడ్వాన్స్ బేసిస్ మీద ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఏపీలో ఆంధ్ర ప్లస్ నైజాం కలిపితే 165 కోట్లు. సీడెడ్ 35 కోట్లు వస్తే... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'కల్కి' ప్రీ రిలీజ్ బిజినెస్ డబుల్ సెంచరీ టచ్ చేస్తుంది.

Also Readఎన్టీఆర్ 'టెంపర్', వరుణ్ 'తొలిప్రేమ' నటి అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి - తాళి కట్టిన వెంటనే భర్తకు ముద్దు!


వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. 'కల్కి' మూవీలో ప్రభాస్ జోడీగా బీ టౌన్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ యాక్ట్ చేస్తున్నారు. మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పాట్నీ కీ రోల్ చేస్తున్నారు. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ కాస్ట్ ఉండటంతో సినిమాపై బజ్ బావుంది. తొలుత మే 9న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశారు. కానీ, ఆ తేదీకి రిలీజ్ చెయ్యడం కుదరడం లేదు. జూన్ నెలలో రిలీజ్ కావచ్చని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్.

Also Readప్లాన్ మార్చిన దిల్ రాజు... ఈ నెలాఖరులోనే ఓటీటీలోకి విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్'?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PV Sunil vs Raghurama: ఐపీఎస్ పీవీ సునీల్ కుల రాజకీయాలు - వీడియో బయటపెట్టిన డిప్యూటీ స్పీకర్ -చర్యలు తప్పవా ?
ఐపీఎస్ పీవీ సునీల్ కుల రాజకీయాలు - వీడియో బయటపెట్టిన డిప్యూటీ స్పీకర్ -చర్యలు తప్పవా ?
Andhra MLCs: వైసీపీలో మరో కుదుపు - ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా - మండలి చైర్మన్ మోషేన్ రాజుతో భేటీ !
వైసీపీలో మరో కుదుపు - ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా - మండలి చైర్మన్ మోషేన్ రాజుతో భేటీ !
BLOs Death Issue:  SIR పని ఒత్తిడితో బీఎల్వోల బలవన్మరణాలు - ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు
SIR పని ఒత్తిడితో బీఎల్వోల బలవన్మరణాలు - ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు
Viral Love Story: వీరి ప్రేమకు మరణం లేదు - లవర్ డెడ్ బాడీని పెళ్లి చేసుకున్న ప్రేమికురాలు -కన్నీళ్లు పెట్టించే రియల్ స్టోరీ !
వీరి ప్రేమకు మరణం లేదు - లవర్ డెడ్ బాడీని పెళ్లి చేసుకున్న ప్రేమికురాలు -కన్నీళ్లు పెట్టించే రియల్ స్టోరీ !
Advertisement

వీడియోలు

India vs South Africa First ODI in Ranchi | సౌతాఫ్రికా సూపర్ ఫైట్
Virat Kohli about Test Retirement | క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లి
Virat Kohli Records in Ranchi ODI | రాంచీలో కోహ్లీ రికార్డుల మోత
BCCI Summons to Gautam, Ajit Agarkar | గంభీర్‌ పై బీసీసీఐ కీలక నిర్ణయం!
ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ టెంపుల్ మిస్టరీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sunil vs Raghurama: ఐపీఎస్ పీవీ సునీల్ కుల రాజకీయాలు - వీడియో బయటపెట్టిన డిప్యూటీ స్పీకర్ -చర్యలు తప్పవా ?
ఐపీఎస్ పీవీ సునీల్ కుల రాజకీయాలు - వీడియో బయటపెట్టిన డిప్యూటీ స్పీకర్ -చర్యలు తప్పవా ?
Andhra MLCs: వైసీపీలో మరో కుదుపు - ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా - మండలి చైర్మన్ మోషేన్ రాజుతో భేటీ !
వైసీపీలో మరో కుదుపు - ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా - మండలి చైర్మన్ మోషేన్ రాజుతో భేటీ !
BLOs Death Issue:  SIR పని ఒత్తిడితో బీఎల్వోల బలవన్మరణాలు - ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు
SIR పని ఒత్తిడితో బీఎల్వోల బలవన్మరణాలు - ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు
Viral Love Story: వీరి ప్రేమకు మరణం లేదు - లవర్ డెడ్ బాడీని పెళ్లి చేసుకున్న ప్రేమికురాలు -కన్నీళ్లు పెట్టించే రియల్ స్టోరీ !
వీరి ప్రేమకు మరణం లేదు - లవర్ డెడ్ బాడీని పెళ్లి చేసుకున్న ప్రేమికురాలు -కన్నీళ్లు పెట్టించే రియల్ స్టోరీ !
Bhuta Shuddhi Vivaha: భూత శుద్ధి వివాహం అంటే ఏమిటి? సమంత - రాజ్ పెళ్లి ఏ పద్ధతిలో, ఎలా జరిగిందో తెలుసా?
భూత శుద్ధి వివాహం అంటే ఏమిటి? సమంత - రాజ్ పెళ్లి ఏ పద్ధతిలో, ఎలా జరిగిందో తెలుసా?
Samantha Raj Nidimoru Marriage : సమంత రాజ్‌ల వెడ్డింగ్ - అసలెవరీ రాజ్ నిడిమోరు?... స్టార్ డైరెక్టర్‌గా ఎలా ఎదిగాడంటే?
సమంత రాజ్‌ల వెడ్డింగ్ - అసలెవరీ రాజ్ నిడిమోరు?... స్టార్ డైరెక్టర్‌గా ఎలా ఎదిగాడంటే?
Congress MP Renuka Chowdhury : కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంటులోకి కుక్కను తీసుకొచ్చే వీడియో వైరల్‌! 'ప్రజాస్వామ్యానికే అవమానం అంటున్న బీజేపీ!
కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంటులోకి కుక్కను తీసుకొచ్చే వీడియో వైరల్‌! 'ప్రజాస్వామ్యానికే అవమానం అంటున్న బీజేపీ!
Aan Paavam Pollathathu OTT : సొసైటీలో మగాడి బాధకు విలువేదీ? - భార్యా బాధితులకు పర్ఫెక్ట్ మూవీ 'ఆన్ పావమ్ పొల్లతత్తు'... తెలుగులోనూ స్ట్రీమింగ్
సొసైటీలో మగాడి బాధకు విలువేదీ? - భార్యా బాధితులకు పర్ఫెక్ట్ మూవీ 'ఆన్ పావమ్ పొల్లతత్తు'... తెలుగులోనూ స్ట్రీమింగ్
Embed widget