అన్వేషించండి

Samyuktha Bollywood Debut: సంయుక్తకు బాలీవుడ్ నుంచి ఆఫర్లు - తెలుగులో డబుల్ హ్యాట్రిక్ కొడుతుందా?

'భీమ్లా నాయక్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళీ భామ సంయుక్తా మీనన్. బ్యాక్ టు బ్యాక్ హిట్ ఫిలిమ్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. దాంతో ముంబై నుంచి పిలుపు వచ్చిందని టాక్.

సంయుక్తా మీనన్ (Samyuktha Menon)కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ ఇమేజ్ ఉంది. ఆమె చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం నమోదు చేసిందని చెప్పవచ్చు. 'సంయుక్త ఉంటే సినిమా హిట్టే' అని దర్శక నిర్మాతల్లో ఓ నమ్మకం ఏర్పడిందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. విజయాలకు తోడు నటిగానూ ఆమె ప్రూవ్ చేసుకున్నారు. దాంతో ఆమెకు ముంబై మూవీ ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే... 

హిందీ సినిమా చేయనున్న సంయుక్త!
Samyuktha: Bridging the Gap Between Tollywood Success and Bollywood Debut: ఇటీవల సంయుక్త హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించారు. ముంబై వెళ్లిన వీడియో, విజువల్స్ వైరల్ అయ్యాయి. మలయాళీ అమ్మాయి ముంబై ఎందుకు వెళుతుందని ఆరా తీయగా తెలిసిన కొత్త విషయం ఏమిటంటే... తెలుగులో సంయుక్త బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ఫుల్ ఫిలిమ్స్, వాటిలో ఆవిడ నటన చూసి బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయట. స్క్రిప్ట్ నేరేషన్ కోసం సంయుక్త ముంబై వెళ్లారని తెలిసింది. త్వరలో ఈ అమ్మాయి హిందీ సినిమాకు సంతకం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Also Read: కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?

రెండు పాన్ ఇండియా సినిమాలో...
Samyuktha Menon Upcoming Movies List: ప్రస్తుతం సంయుక్తా మీనన్ ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. నిఖిల్ సిద్ధార్థ హీరోగా రూపొందుతున్న 'స్వయంభు' సినిమాలో ఆమె ఓ కథానాయిక. అది కాకుండా శర్వానంద్ హీరోగా తెరకెక్కనున్న 'నారి నారి నడుమ మురారి'లో కూడా ఆమె నటిస్తున్నారు. మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయట.

Also Readఎన్టీఆర్ 'టెంపర్', వరుణ్ 'తొలిప్రేమ' నటి అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి - తాళి కట్టిన వెంటనే భర్తకు ముద్దు!


తెలుగులో డబుల్ హ్యాట్రిక్ కొడతారా?
Samyuktha Journey Into Tollywood: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'తో సంయుక్తా మీనన్ తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. ఆ సినిమాలో రానా దగ్గుబాటి భార్య పాత్రలో కనిపించారు. కథలో కీలకమైన పతాక సన్నివేశాల్లో 'అన్నా' అంటూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను పిలిచే సందర్భంలో ఆమె నటనకు పేరు వచ్చింది. ఆ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార' సినిమా చేశారు. అదీ హిట్టే. ఆ తర్వాత ధనుష్ 'సార్'లో కథానాయికగా నటించారు సంయుక్త. ఆ సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం అందుకున్నారు.
Samyuktha Bollywood Debut: సంయుక్తకు బాలీవుడ్ నుంచి ఆఫర్లు - తెలుగులో డబుల్ హ్యాట్రిక్ కొడుతుందా?

సాయి తేజ్ జోడీగా నటించిన 'విరూపాక్ష' ఆమె ప్రయాణంలో మైలురాయి అని చెప్పాలి. పతాక సన్నివేశాల్లో ఎంతో ప్రాధాన్యం ఉన్న రోల్ చేశారామె. 'డెవిల్' కూడా కమర్షియల్ సక్సెస్ సాధించింది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ఐదు హిట్స్ సంయుక్త ఖాతాలో ఉన్నాయి. నెక్స్ట్ మూవీ హిట్ అయితే డబుల్ హ్యాట్రిక్ వస్తుందని చెప్పవచ్చు.

Also Readవందే భారత్ ట్రైనులో సిగరెట్ కాలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ... తస్మాత్ జాగ్రత్త, ఇది మీ కోసమే

టాప్ హెడ్ లైన్స్

Part Timers Series OTT : ఓటీటీలోకి బిగ్ బాస్ తనూజ ఎంట్రీ - ఎమోషనల్ కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి బిగ్ బాస్ తనూజ ఎంట్రీ - ఎమోషనల్ కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
Rashmi Gautam: చీరాలలో కుక్కపై దాడి... కాలు తీసేశారు... ఇప్పుడు సేఫ్‌గా రష్మీ గౌతమ్ చేతుల్లోకి
చీరాలలో కుక్కపై దాడి... కాలు తీసేశారు... ఇప్పుడు సేఫ్‌గా రష్మీ గౌతమ్ చేతుల్లోకి
Oh Sukumari OTT : ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయి - భర్త ఏం చేశాడు?... ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ కామెడీ
ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయి - భర్త ఏం చేశాడు?... ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ కామెడీ

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Embed widget