అన్వేషించండి

Chitti Babu: జ‌య‌ల‌లిత‌తో తిర‌గొద్ద‌ని శ‌ర‌త్ బాబుకి చాలాసార్లు చెప్పా - నటుడు చిట్టిబాబు

Chitti Babu: క‌మెడియ‌న్ చిట్టిబాబు. అల‌నాటి న‌టుడు. ఎన్నో సినిమాలు చేసి, క‌డుపుబ్బా న‌వ్వించాడు ప్రేక్ష‌కుల‌ను. ఇప్పుడు చాలా ఏళ్ల త‌ర్వాత స్క్రీన్ పై క‌నిపించి అప్ప‌టి ఎన్నో విష‌యాలు పంచుకున్నారు.

Actor Chitti Babu Revealed Sharath Babu & Jayalalitha Relation: క‌మెడియ‌న్ చిట్టిబాబు. అల‌నాటి న‌టుడు రాజాబాబు త‌మ్ముడిగా అంద‌రికీ ప‌రిచ‌యం. ఇక చిట్టిబాబు కూడా ఎన్నో కామెడీ పాత్ర‌లు వేసి ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించారు. ఆయ‌న చేసిన ప్ర‌తి పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఆయ‌న న‌ట‌న‌కు కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే, చాలాకాలం త‌ర్వాత ఆయ‌న స్క్రీన్ మీద క‌నిపించారు. ఒక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు చిట్టిబాబు. ఈ సంద‌ర్భంగా అప్ప‌టి విష‌యాల‌ను ఎన్నో గుర్తు చేసుకున్నారు. దాంట్లో భాగంగా ర‌మాప్ర‌భ, శ‌ర‌త్ బాబు గురించి చెప్పుకొచ్చారు. శ‌ర‌త్ బాబు, జ‌య‌ల‌లిత మ‌ధ్య ఉన్న సంబంధం గురించి ప్ర‌స్తావించారు. ఇంకా ఎన్నో విష‌యాలు చెప్పారు ఆయ‌న‌. 

అన్న‌య్య ప‌ట్టించుకోలేదు.. 

రాజాబాబు, ర‌మాప్ర‌భ కాంబినేష‌న్ అప్ప‌ట్లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అనే చెప్పాలి. వాళ్లిద్ద‌రు క‌లిసి న‌టించిన సినిమా అద్భుతంగా ఉండేది. అలాంటిది ఆమె శ‌ర‌త్ బాబును పెళ్లి చేసుకున్న‌ప్పుడు రాజాబాబు ప‌ట్టించుకోలేద‌ని అది ఆమె ఇష్ట‌మ‌ని చెప్పాడ‌ని అన్నారు. "నిజం చెప్పాలంటే మా అన్నయ్య రమాప్రభతో మామూలుగానే మాట్లాడతాడు. ఆమెతో షూటింగ్స్ చేయడం.. అంతవరకే. అంతకు మించి ఏమీ లేదు. అన్న‌య్య‌కు, శ‌ర‌త్ బాబుకి పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. ర‌మాప్ర‌భ‌ను పెళ్లి చేసుకున్నాడు అని మాత్ర‌మే తెలుసు. అలా హాయ్ అంటే హాయ్ బాయ్.. అంటే బాయ్ అన్న‌ట్లు ఉండేవాడు అన్నయ్య‌. నేను ఏంటంటే? మేమంతా క‌లిసి డ్రామాకి రిహార్సెల్స్ చేసేవాళ్లం. దాంట్లో శ‌ర‌త్ బాబు హీరో..  అలా నెల‌లు నెల‌లు ఆయ‌న‌తో క‌లిసి ఉండేవాళ్లం. రాజేంద్ర‌ప్ర‌సాద్ అప్పుడు ఇన్ స్టిట్యూట్ లో చ‌దివేవాడు. రాజేంద్ర‌ప్ర‌సాద్ చేసుకుంది. ర‌మా ప్ర‌భ అక్క కూతురిని. అలా అలా మా అంద‌రికీ బాగా ప‌రిచ‌యం. ఆ అమ్మాయి ఇష్టం ఆ అమ్మాయిది. పెళ్లి చేసుకోవ‌డం అదంతా. అందుకే, ఆ విష‌యాన్ని అన్న‌య్య ప‌ట్టించుకోలేదు. ఏమీ అడ‌గ‌లేదు కూడా. త‌న ఇష్టం క‌దా. స్వ‌తంత్రంగా ఉండాలి, డెసిష‌న్ తీసుకోవాలి. అందుకే, క‌ల‌గ‌జేసుకోలేదు. ర‌మాప్ర‌భ‌ను అక్క అని పిలిచేవాడిని, శ‌ర‌త్ బాబును బావా అని పిలిచేవాడిని అంద‌రం క్లోజ్ గా ఉండేవాళ్లం. అలా ర‌మా ప్ర‌భ త‌మ్ముడు రెడ్డి పెళ్లి మేం ముగ్గురం ద‌గ్గ‌రుండి చేశాం. అలా రాజేంద్ర‌ప్ర‌సాద్ పెళ్లి కూడా మేమే ద‌గ్గ‌రుండి చేశాం. అంతేకాని, వాళ్లు విడిపోవ‌డం అదంతా మేం పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు" అని చెప్పారు చిట్టిబాబు. 

శ‌ర‌త్ బాబు వేదాంతి.. 

"శ‌ర‌త్ బాబు ఒక వేదాంతి. ఆ ప‌ర్స‌నాలిటీకి నేను 102 ఏళ్లు క‌చ్చితంగా బ‌తుకుతాను అనేవాడు. 20 సార్లు ఆ మాట చెప్పి ఉంటాడు. యాత్ర‌లు చేస్తుండేవాడు, నైమిశార‌ణ్యం వెళ్లేవాడు, పూజ‌లు చేసేవాడు. శ‌ర‌త్ బాబుకి ఇంటి బాధ్య‌త చాలా ఎక్కువ‌. వాళ్లు 12 మందో 14 మందో సంతానం. అక్క‌చెల్లెళ్లు, అన్న‌ద‌మ్ముల‌ను సెటిల్ చేశాడు. ఇలా షెడ‌న్ గా అవుతాడ‌ని అనుకోలేదు."

జ‌య‌ల‌లిత‌తో రిలేష‌న్ వ‌ద్దు అన్నాను.

"ఆర్టిస్ట్ జ‌య‌ల‌లితతో బాగా ఉండేవాడు. గుడికి అలా వెళ్లేవాడు. ఇవ‌న్నీ పెట్టుకోవ‌ద్దు అని చెప్పాను. అప్పుడు జ‌స్ట్ ఫ్రెండ్ షిప్ మాత్ర‌మే అనేవాడు. ఆ త‌ర్వాత త‌మిళ్ ఆర్టిస్ట్ కూతురిని ఏదో పెళ్లి చేసుకున్నాడు. కానీ, అత‌ను మాత్రం 102 ఏళ్లు బ‌తుకుతాన‌ని ఎప్పుడూ చెప్పేవాడు. అలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతే. కానీ, అన్న‌య్య పోయిన త‌ర్వాత మాత్రం ర‌మాప్ర‌భ ఒక మాట అన్నాది. పోయాడ‌ని తెలియ‌ప‌ర‌చ‌లేదు అని ఏడిచింది. మీ అన్న‌య్య చ‌చ్చిపోవ‌డం కాదురా.. వాడు న‌న్ను కూడా చంపేశాడురా. వాడు చ‌చ్చిపోయాక ఎవ‌రి ప‌క్క‌న యాక్ట్ చేయ‌బుద్ధి కావ‌డం లేదురా అని ఏడ్చేసింది. అంత మంచి జోడి వాళ్ల‌ది. ‘తోట రాముడు’ సినిమాలో నేను ర‌మాప్ర‌భ జోడీ. కానీ, జ‌నాలు రిసీవ్ చేసుకోరు అని చేయ‌లేదు" అని త‌నకు తెలిసిన విష‌యాల‌ను జ్ఞాప‌కాల‌ను పంచుకున్నారు చిట్టిబాబు.

Also Read: మీరంతా చిరంజీవిని కిడ్నాప్ చేశారు క‌దా? - ‘పారిజాత ప‌ర్వం’ టీమ్‌తో సుమ ఫ‌న్

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ డే కలెక్షన్లు... కిరణ్ అబ్బవరం సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ డే కలెక్షన్లు... కిరణ్ అబ్బవరం సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Jana Nayagan Box Office Collection Day 2: 'జన నాయకుడు' కలెక్షన్లు... రెండో రోజు ఢమాల్... విజయ్ సినిమాకు భారీ డ్రాప్! 
కలెక్షన్లలో విజయ్‌కు భారీ దెబ్బ... వంద కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... కానీ రెండో రోజు అంతేనా?
Nara Rohith Kapaali : సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నారా రోహిత్ - తెలియని ప్రపంచంలో న్యూ జర్నీ 'కపాలి'
సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నారా రోహిత్ - తెలియని ప్రపంచంలో న్యూ జర్నీ 'కపాలి'
The Odyssey Collections : ఇండియాలో ది ఒడిస్సీ రికార్డు కలెక్షన్స్ - వారం రోజుల్లోనే ఆ మార్క్ దాటేసిందిగా...
ఇండియాలో ది ఒడిస్సీ రికార్డు కలెక్షన్స్ - వారం రోజుల్లోనే ఆ మార్క్ దాటేసిందిగా...

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Prime Minister Modi:
"రీల్స్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండండి" కేబినెట్ మంత్రులకు మరోసారి ప్రధాని మోదీ సలహా 
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Jana Nayagan Box Office Collection Day 2: 'జన నాయకుడు' కలెక్షన్లు... రెండో రోజు ఢమాల్... విజయ్ సినిమాకు భారీ డ్రాప్! 
కలెక్షన్లలో విజయ్‌కు భారీ దెబ్బ... వంద కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... కానీ రెండో రోజు అంతేనా?
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
కన్వర్ యాత్రలో నిజమైన ప్రేమ: దివ్యాంగుడైన భర్తను 180 కి.మీ మోసిన భార్య!
కన్వర్ యాత్రలో నిజమైన ప్రేమ: దివ్యాంగుడైన భర్తను 180 కి.మీ మోసిన భార్య!
తొలి ఏకాదశి పూజా విధానం, ఉపవాస నియమాలు తెలుసుకోండి!
తొలి ఏకాదశి పూజా విధానం, ఉపవాస నియమాలు తెలుసుకోండి!
Embed widget