అన్వేషించండి

Tollywood Latest Updates : తెలుగులోనూ ధనుష్ సినిమా, రజనీతో తమన్నా, రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ!

దర్శక ధీరుడు రాజమౌళి కాళ్ళకు హీరోయిన్ అనుపమ నమస్కరించారు. తెలుగులో కూడా ధనుష్ సినిమా విడుదల కానుంది. రజనీకాంత్ జోడీగా తమన్నా నటిస్తున్నారని టాక్. ఇంకా లేటెస్ట్ టాలీవుడ్ అప్‌డేట్స్‌ ఏంటంటే... 

'లాల్ సింగ్ చడ్డా', 'మాచర్ల నియోజకవర్గం', 'కార్తికేయ 2'... థియేటర్లలో ఈ వారం మూడు సినిమాలు విడుదల అయ్యాయి. ఓటీటీలలో మరికొన్ని వచ్చాయి. లాంగ్ వీకెండ్ క్యాష్ చేసుకోవాలని చూశాయి. అవి పక్కన పెడితే... తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతోంది? టాలీవుడ్ లేటెస్ట్ అప్‌డేట్స్‌ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే...
 
రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ!
'కార్తికేయ 2' శనివారం థియేటర్లలో విడుదలైంది. కుటుంబ సభ్యులతో కలిసి దర్శక ధీరుడు రాజమౌళి (Karthikeya 2) ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో సినిమా చూడటానికి వెళ్లారు. షో కంప్లీట్ అయ్యాక... పార్కింగ్‌లో ఉన్నప్పుడు ఆయన్ను అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) చూశారు. వెంటనే వెళ్లి రాజమౌళి కాళ్ళకు నమస్కరించారు. ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 'కార్తికేయ 2'తో విజయం అందుకున్న అనుపమ... త్వరలో సిద్ధూ జొన్నలగడ్డ సరసన 'డీజే టిల్లు 2'లో నటించనున్నారని టాక్ (Anupama Parameswaran In DJ Tillu 2 Movie).

View this post on Instagram
 
A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

రజనీకి జోడిగా తమన్నా?
సీనియర్ హీరోల సరసన నటించడానికి తనకు ఎటువంటి అభ్యంతరాలు లేవని తమన్నా సినిమాల ద్వారా చెబుతున్నారు. చిరంజీవి, వెంకటేష్ సరసన ఆమె నటించారు. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్‌కు జంటగా నటించడానికి రెడీ అవుతున్నారని టాక్. 'డాక్టర్', 'బీస్ట్' ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'జైలర్' టైటిల్ (Rajinikanth Jailer Movie) కన్ఫర్మ్ చేశారు. ఇందులో తమన్నా నటించనున్నారని టాక్. తొలుత ఐశ్వర్యా రాజేష్‌ను అనుకున్నప్పటికీ... ఇతర సినిమాలతో ఆమె బిజీగా ఉండి 'నో' చెప్పడంతో అవకాశం తమన్నా చెంతకు వచ్చిందట!

ఆగస్టు 18న తెలుగులో ధనుష్ 'తిరు'
 ధనుష్ కథానాయకుడిగా... నిత్యా మీనన్, రాశీ ఖన్నా కథానాయికలుగా రూపొందిన సినిమా 'తిరు'. తమిళ సినిమా 'తిరుచిత్రాంబ‌లం'కు తెలుగు అనువాదమిది. లేటెస్టుగా ట్రైలర్ విడుదల చేశారు. ఆగస్టు 18న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

Also Read : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

'దిల్' రాజుకు కరోనా?
Dil Raju Down With Fever : ప్రముఖ నిర్మాత 'దిల్' రాజుకు ఫీవర్ వచ్చిందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. గత కొన్ని రోజులుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యలపై ఆయన చర్చలు జరుపుతున్నారు. ఫీవర్ రావడంతో ఆయనకు కరోనా వచ్చిందేమోనని అనుమానాలు మొదలయ్యాయట. 

చియాన్ విక్రమ్ హీరోగా, 'కెజియఫ్ 2' హీరోయిన్ శ్రీనిధి శెట్టి (KGF 2 Heroine Srinidhi Shetty) జంటగా నటించిన సినిమా 'కోబ్రా'. ఈ నెల 31న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో 'తరంగణి' పాటను 16న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 'మాచర్ల నియోజకవర్గం' చిత్రానికి తొలిరోజు వచ్చిన వసూళ్ళ పట్ల హీరో నితిన్ సంతోషం వ్యక్తం చేశారు. తన కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ అని ఆయన అన్నారు.     

Also Read : కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్
అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు
ITR: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Paravada Gas Leak: పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు లీక్, నలుగురు సిబ్బందికి తీవ్ర అస్వస్థత
పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు లీక్, నలుగురు సిబ్బందికి తీవ్ర అస్వస్థత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్
అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు
ITR: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Paravada Gas Leak: పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు లీక్, నలుగురు సిబ్బందికి తీవ్ర అస్వస్థత
పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు లీక్, నలుగురు సిబ్బందికి తీవ్ర అస్వస్థత
Chenab Rail Bridge: కాశ్మీర్ లోయలో రైల్వే ఇంజనీరింగ్ అద్భుతం, ప్రపంచంలోనే ఎత్తైన
కాశ్మీర్ లోయలో రైల్వే ఇంజనీరింగ్ అద్భుతం, ప్రపంచంలోనే ఎత్తైన "చినాబ్ రైల్ బ్రిడ్జ్ " విశేషాలివే
Congress vs Tollywood: సినీ ఇండస్టీని కాంగ్రెస్  ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?
సినీ ఇండస్టీని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?
AP Belt Shops: గ్రామాల్లో బెల్ట్‌ బాజా, గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
గ్రామాల్లో బెల్ట్‌ బాజా, గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
Embed widget