News
News
X

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Karthikeya 2 Telugu Movie Review : నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా... శ్రీనివాస రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'కార్తికేయ 2'. ఈ రోజు థియేటర్లలో విడుదలైంది.

FOLLOW US: 

సినిమా రివ్యూ : కార్తికేయ 2
రేటింగ్ : 3/5
నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌ రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, 'స్వామి రా రా' స‌త్య, 'వైవా' హ‌ర్ష‌ తదితరులు
మాటలు : మణి బాబు 
సినిమాటోగ్రఫీ : కార్తీక్ ఘట్టమనేని
సంగీతం : కాల భైరవ
సహ నిర్మాతలు : వివేక్ కూచిభొట్ల, అర్చనా అగర్వాల్  
నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ 
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చందూ మొండేటి 
విడుదల తేదీ: ఆగస్టు 13, 2022

కథానాయకుడిగా నిఖిల్ (Nikhil Siddharth) కు, దర్శకుడిగా చందూ మొండేటి (Chandoo Mondeti) కి పేరు తీసుకొచ్చిన సినిమా 'కార్తికేయ'. విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న చిత్రమది. ఇప్పుడు 'కార్తికేయ 2' (Karthikeya 2) అంటూ థియేటర్లలోకి వచ్చారు. ఇది సీక్వెల్ కాదు. కానీ, హీరో క్యారెక్టరైజేషన్ సేమ్ అన్నమాట. ఇందులో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్. 'ఐదు సహస్త్రాల ముందే పలికిన ప్రమాదం... ప్రమాదం లిఖితం, పరిష్కారం లిఖితం' అంటూ శ్రీకృష్ణుడి ద్వారకా నగరంలో ఏదో రహస్యం దాగుందంటూ ప్రచార చిత్రాలతో అంచనాలు పెంచారు. మరి, సినిమా ఎలా ఉంది?  

కథ (Karthikeya 2 Story) :  కార్తికేయ (నిఖిల్ సిద్ధార్థ్) డాక్టర్. అతనికి ఒక ప్రమాదం ఎదురైనప్పుడు... దాన్నుంచి బయటపడితే కుమారుడిని తీసుకుని ద్వారక వస్తానని తల్లి (తులసి) మొక్కుకుంటుంది. అది తీర్చడానికి శ్రీకృష్ణుడి నగరానికి కార్తికేయను తీసుకు వెళుతుంది. అక్కడ ఫేమస్ ఆర్కియాలజిస్ట్ రావు మరణిస్తాడు. అతడిని కార్తికేయ హత్య చేశాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. స్టేషన్ నుంచి అతడిని రావు మనవరాలు ముగ్ధ (అనుపమా పరమేశ్వరన్) తప్పిస్తుంది. ఎందుకు? కార్తికేయతో ముగ్ధ ఏం చెప్పింది? ఆ తర్వాత శ్రీకృష్ణుడి కంకణం సాధించాలని ఎందుకు బలంగా నిర్ణయించుకున్నాడు? ఈ అన్వేషణలో శాంతను (ఆదిత్యా మీనన్), ఇంకా అధీర తెగ నుంచి కార్తికేయకు ఎటువంటి ప్రమాదాలు ఎదురయ్యయాయి? చివరకు, ఏమైంది? ఆ కృష్ణుడి కంకణం ప్రత్యేకత ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ (Karthikeya 2 Review) : 'కార్తికేయ'కు, ఇప్పుడీ 'కార్తికేయ 2'కు ఎటువంటి సంబంధం లేదు. ఒక్క హీరో తప్ప! కథ పరంగా మొదటి సినిమాలో మిస్టరీ, థ్రిల్లర్ అంశాలు ఎక్కువ. సర్పం వచ్చే సన్నివేశాల్లో భయపెట్టారు కూడా! ఇప్పుడీ రెండో సినిమాలో మిస్టరీ ఏం లేదు. అడ్వెంచర్ ఎలిమెంట్స్, డ్రామా యాడ్ చేసి, హారర్ మిస్టరీ అంశాలను తప్పించారు. దాంతో సినిమా జానర్ మారింది.

కథ పరంగా చూస్తే... 'కార్తికేయ 2'లో గొప్ప అంశాలు లేవు. విశ్రాంతి వరకూ సినిమా సాధారణంగా ఉంటుంది. అధీరాలు, హీరో మీద విలన్స్ అట్టాక్ చేయడం వంటి అంశాలతో కొంచెం ఆసక్తి కలిగించినా... కథలో వావ్ మూమెంట్స్ ఎక్కువ లేవు. ఇంటర్వెల్ తర్వాతే కథలో వేగం మొదలైంది. అక్కడి నుంచి కథనం బావుంది. తర్వాత ఏం జరుగుతుంది? అని ఆసక్తి కలిగిస్తూ... పతాక సన్నివేశాల వరకూ సినిమా సాగింది. 

'కార్తికేయ 2'కు అసలైన బలం దర్శకుడు చందూ మొండేటి కథను చెప్పిన విధానం. ప్రారంభం నుంచి ముగింపు వరకూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మైంటైన్ చేశాడు. అయితే... అధీరాలు, విలన్ శాంతను నుంచి హీరోకు బలమైన ఆటంకాలు ఏవీ ఎదురు కాలేదు. హీరో తప్పించుకోలేడని అనుకున్న ప్రతిసారీ... ఆయా సన్నివేశాలను హడావిడిగా, చప్పగా ముగించారు. హీరోకి ఎదురు లేకపోవడంతో కొన్ని సీన్స్‌లో థ్రిల్, వావ్ మూమెంట్స్ మిస్ అయ్యాయి. కొన్ని సన్నివేశాల్లో మణి బాబు మాటలు బావున్నాయి. 'కార్తికేయ 2'లో దర్శకుడు చందూ మొండేటి హిందుత్వ స్టాండ్ తీసుకున్నారేమో అనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో సైన్స్ గురించి వివరించినప్పటికీ... కృష్ణుడిపై అభిమానం సినిమా అంతటా కనిపిస్తుంది. హీరో క్యారెక్టరైజేషన్‌లో బలం తగ్గింది. అధీరాలు, విలన్ విషయంలో క్లారిటీ మిస్ అయ్యింది. లూప్ హోల్స్ లేకుండా ఇంకా బాగా ఎగ్జిక్యూట్ చేసుంటే... సినిమా రిజల్ట్ మరో రేంజ్ లో ఉండేది. 

సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్... రెండూ బావున్నాయి. రెండు బాధ్యతలు నిర్వర్తించిన కార్తీక్ ఘట్టమనేని బెస్ట్ అవుట్‌పుట్‌ ఇచ్చారు. కాల భైరవ సంగీతం బావుంది. కొన్ని సీన్స్‌ను ఆయన మ్యూజిక్ ఎలివేట్ చేసింది. శ్రీకృష్ణుడిని చూపించే సన్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. 

నటీనటులు ఎలా చేశారు? : కథ కొత్తది. కానీ, క్యారెక్టర్ ఆల్రెడీ చేసినదే కావడంతో నిఖిల్ చక్కగా చేసుకుంటూ వెళ్లారు. నటుడిగా క్యారెక్టర్‌కు న్యాయం చేశారు. నిఖిల్ ఎక్స్‌ప్రెష‌న్స్‌లో ఇంటెన్స్, డ్రస్సింగ్ స్టైల్ బావున్నాయి. నిఖిల్‌తో పాటు అనుపమ పాత్ర కూడా ప్రయాణిస్తుంది. కానీ,  ఆమెకు ఇంపార్టెన్స్ తక్కువ. హీరోను సేవ్ చేసే రెండు మూడు సీన్స్‌ పడ్డాయి. సీన్స్‌లో స్ట్రెంగ్త్ ఉండటంతో అనుపమ ఎలివేట్ అవుతారు. 

అనుపమ్ ఖేర్ కనిపించేది ఒక్క సన్నివేశంలోనే! అయితేనేం? అదొక్కటీ చాలు... కృష్ణుడి గురించి ఆయన చెప్పే డైలాగులకు ఒక  సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి విజిల్స్ పడటం గ్యారెంటీ. శ్రీనివాస రెడ్డి, 'వైవా' హర్ష మధ్య మధ్యలో నవ్వించారు. తులసి, ప్రవీణ్, 'స్వామి రా రా' సత్య, అప్పాజీ అంబరీష తదితరుల పాత్రల నిడివి తక్కువ. ఉన్నంతలో తమ పాత్రలకు న్యాయం చేశారు. అధీరాగా నటించిన అతని ఫిజిక్ బావుంది. విగ్రహపుష్టి ఉండటంతో సీన్స్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యాడు. ఆదిత్యా మీనన్ పాత్రలో కొత్తదనం ఏమీ లేదు.  

Also Read : హలో వరల్డ్ రివ్యూ: ఆర్యన్ రాజేష్, సదా నటించిన వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'కార్తికేయ'తో పోలిస్తే... 'కార్తికేయ 2'లో కథ గొప్పగా ఉండదు. కానీ, కథనం ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా సెకండాఫ్, క్లైమాక్స్! కొన్ని సీన్స్, డ్రామా ఎక్స్‌ట్రాడిన‌రీగా ఉన్నాయి. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మంచి డ్రామా చూశామనే ఫీలింగ్ ఇస్తుంది. 

Also Read : కడవర్ రివ్యూ : డెడ్ బాడీ చెప్పిన కథ, అమలా పాల్ సినిమా ఎలా ఉందంటే?

Published at : 13 Aug 2022 12:18 PM (IST) Tags: ABPDesamReview Karthikeya 2 Review Karthikeya 2 Review In Telugu Karthikeya 2 Movie Review Karthikeya 2 Rating Karthikeya 2 Telugu Review Telugu Movie Karthikeya 2 Review

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Puri Jagannadh: పూరి జగన్నాథ్ ను నమ్మి మరో ఛాన్స్ ఇస్తాడా?

Puri Jagannadh: పూరి జగన్నాథ్ ను నమ్మి మరో ఛాన్స్ ఇస్తాడా?

టాప్ స్టోరీస్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

Zodiac Signs: జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉండాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి

Zodiac Signs:  జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉండాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి