![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vijay Varma on Tamannaah: విజయ్ వర్మలో నాకు నచ్చనిది అదొక్కటే, ఆసక్తికర విషయం చెప్పిన మిల్కీబ్యూటీ
గత కొద్ది కాలంగా తమన్నా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. విజయ్ తో ప్రేమాయణం, రొమాంటిక్ సీన్లలోనూ బాగా హైలెట్ అవుతోంది. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ లో అస్సలు నచ్చని విషయాన్ని వెల్లడించింది.
![Vijay Varma on Tamannaah: విజయ్ వర్మలో నాకు నచ్చనిది అదొక్కటే, ఆసక్తికర విషయం చెప్పిన మిల్కీబ్యూటీ Tamannaah Bhatia most annoying habit Revealed by Vijay Varma Tamannaah Obsessive about Workouts Plans Gym Vijay Varma on Tamannaah: విజయ్ వర్మలో నాకు నచ్చనిది అదొక్కటే, ఆసక్తికర విషయం చెప్పిన మిల్కీబ్యూటీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/22/deebc52749ecc3d68ce8cb0eadc17f591687437483394544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఒకప్పుడు తమన్నా పేరు వినగానే, నాజూకైన రూపం, అందమైన చిరునవ్వు, హద్దులు మీరని అందాల ప్రదర్శన మదిలో మెదిలేది. కానీ, ప్రస్తుతం మిల్కీబ్యూటీ పూర్తిగా మారిపోయింది. అందాల ప్రదర్శనకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోతోంది. `జీ కర్డా`, `లస్ట్ స్టోరీస్ 2`లో ఓ రేంజిలో బోల్డ్ గా కనిపించి అందరినీ షాక్ కి గురి చేసింది. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా విజయ్ గురించి కీలక విషయాలు వెల్లడించింది.
విజయ్ వర్మలో నాకు నచ్చనిది అదొక్కటే- తన్నా
విజయ్ వర్మ, తమన్నా భాటియా ప్రస్తుతం బి-టౌన్లో హాటెస్ట్ జంటగా చలామణి అవుతున్నారు. తమన్నా తన లవ్ ను కన్ఫామ్ చేసినప్పటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా విజయ్ తో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో విజయ్ లో తనకు నచ్చని ఓ విషయాన్ని రివీల్ చేసింది. ఆయన జిమ్ లో గంటల తరబడి గడపడం తనకు అస్సలు ఇష్టం లేదని చెప్పింది. “నాకు విజయ్ లోని అన్ని విషయాలు నచ్చుతాయి. కానీ, అస్సలు నచ్చని విషయం కూడా ఒకటి ఉంది. అదే జిమ్ చేయడం. ఎప్పుడూ విజయ్ జిమ్ వర్కౌట్స్ గురించి బాగా ఆలోచిస్తాడు. రోజూ వర్కౌట్ చేయాలి అని అనుకుంటాడు. జిమ్ కోసం తక్కువ నిద్రపోతాడు. బాగా నిద్రపోతే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అంటారు. కానీ, తను నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతాడు” అని చెప్పుకొచ్చింది. సినిమాల్లో ఎలాంటి క్యారెక్టర్స్ చేసినా, నిజ జీవితంలో చాలా ప్రశాంతంగా ఉంటాడని వివరించింది. అందుకే, తనంటే ఇష్టమని వెల్లడించింది.
జిమ్ కోసం ఏదైనా వదులుకుంటా- విజయ్
తమన్నా చెప్పిన ఈ విషయం గురించి విజయ్ రెస్పాండ్ అయ్యాడు. తనకు జిమ్ చేయడం అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. జిమ్ వర్కౌట్స్ కోసం దేనినైనా వదులుకుంటానని చెప్పాడు. తమన్నాను బాధ పెట్టాలని కాదు, కానీ, జిమ్ అలవాటు నాకు ముఖ్యం అయిపోయిందన్నాడు.
Read Also: 21 కట్స్, U/A సర్టిఫికేట్ - ‘మను చరిత్ర’ విషయంలో సెన్సార్ బోర్టు నిర్ణయం
వరుస ప్రాజెక్టులతో మిల్కీబ్యూటీ ఫుల్ బిజీ
ఇక తమన్నా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నాలుగు కథల సమాహారంగా రూపొందిన 'లస్ట్ స్టోరీస్ 2'లో మిల్కీ బ్యూటీ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాకు సుజోయ్ ఘోష్, ఆర్. బల్కి, నటి కొంకణ్ సేన్ శర్మ, అమిత్రవీంద్రనాథ్ శర్మ దర్శకులు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికలో జూన్ 29 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అటు తెలుగులో చిరంజీవితో `భోళాశంకర్` చిత్రంలో నటిస్తోంది. తమిళంలో సూపర్ స్టార్ రజనీతో `జైలర్` లో యాక్ట్ చేసింది. మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా అక్కడ ఓ సినిమా చేస్తోంది. నటిస్తుంది. మరోవైపు `జీ కర్డా`తో అందాల విందు చేస్తూ సినీ అభిమానులకు ఆకట్టుకుంది.
Also Read : రామ్ చరణ్ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)