Manu Charitra Censor Cuts: 21 కట్స్, U/A సర్టిఫికేట్ - ‘మను చరిత్ర’ విషయంలో సెన్సార్ బోర్టు నిర్ణయం
యంగ్ హీరో శివ కందుకూరి హీరోగా భరత్ పెదగాని దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘మను చరిత్ర’. రేపు(జూన్ 23న) ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 21 కట్స్ ఇచ్చింది.
శివ కందుకూరి హీరోగా, నూతన దర్శకుడు భరత్ పెదగాని తెరకెక్కించిన చిత్రం ‘మనుచరిత్ర’. మేఘా ఆకాశ్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎన్ శ్రీనివాసరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ బోర్డు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది.
‘మనుచరిత్ర’కు 21 కట్స్ ఇచ్చిన CBFC
తాజా సమాచారం ప్రకారం ‘మనుచరిత్ర’ సినిమాకు CBFC ఏకంగా 21 కట్స్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించి 13.44 నిమిషాల నిడివిగల సన్నివేశాలను తొలగించాలని చిత్ర నిర్మాతలను ఆదేశించింది. కొంత మేర అడల్డ్ కంటెంట్ ఉన్న కారణంగా ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ 170 నిమిషాలు ఉండబోతోంది.
‘ఆర్ఎక్స్100’ లాంటి హిట్ అందుకుంటుంది - కార్తికేయ
రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు ‘ఆర్ఎక్స్100’ హీరో కార్తికేయ గెస్టుగా వచ్చారు. ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. “ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ హార్డ్ హిట్టింగ్ గా ఉన్నాయి. ‘ఆర్ఎక్స్100’ సినిమా విడుదలకు ముందుక ఎలాంటి అంచనాలు ఉండేవో, ఈ సినిమా విషయంలోనూ అలాగే ఉన్నాయి. ఈ సినిమా ‘ఆర్ఎక్స్100’ మాదిరిగానే సంచలన విజయాన్ని అందుకుంటుంది” అని చెప్పారు.
నా కెరీర్ లో ఇదో ప్రత్యేకమైన చిత్రం- శివ కందుకూరి
అటు తన కెరీర్ లో ‘మనుచరిత్ర’ ప్రత్యేకమైన సినిమా అని హీరో శివ కందుకూరి అన్నారు. దర్శకుడు భరత్ తో చాలా ఎంజాయ్ గా ఈ సినిమా చేసినట్లు చెప్పారు. థియేటర్‌కి వచ్చిన ప్రతి సినీ అభిమానికి ఈ చిత్రం మంచి వినోదం పంచుతుందన్నారు. ఈ సినిమా ఓ స్వచ్ఛమైన ప్రేమకథగా రూపొందినట్లు వెల్లడించారు. హీరోయిన్లు సైతం ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారని చెప్పారు. వారి పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయని చెప్పారు. తమ కెరీర్ కు ఈ సినిమా ఒక మలుపుగా ఉండబోతోందన్నారు. ఈ కార్యక్రమంలో రక్షిత్, విజయ్ కుమార్ కొండా, అజయ్ భూపతి, శేఖర్ రెడ్డి, బెక్కం వేణుగోపాల్, రాజ్ కందుకూరి, ప్రగతి శ్రీవాత్సవ్, గరిమ సహా పలువురు పాల్గొన్నారు.
Read Also: ఆ న్యూడ్ ఫోటోలు నావి కాదు, అసలు నాకు ట్విట్టర్ అకౌంటే లేదు - నటి జయవాణి
నాకు ఇష్టమైన జోనర్ లో ఈ సినిమా తీశారు- విశ్వక్ సేన్
అంతకు ముందు ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేసిన యంగ్ హీరో విశ్వక్ సేన్, కచ్చితంగా ఈ మూవీ హిట్ కొడుతుందన్నారు. ‘‘లవ్, యాక్షన్ నాకు ఇష్టమైన జోనర్. ‘మనుచరిత్ర’ కూడా నాకు నచ్చిన జోనర్ లోనే రూపొందింది. ఈ సినిమా మంచి హిట్ అవుతుందని భావిస్తున్నాను. శివ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఆయన సినిమా హిట్ అయితే, నా సినిమా హిట్ అయినంత సంబరపడతాను” అని చెప్పారు. యాపిల్ ట్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎన్. శ్రీనివాస రెడ్డి, రాన్సన్ జోసెఫ్ ‘మనుచరిత్ర’ చిత్రాన్ని నిర్మించారు. సుందర్ సంగీతం అందించారు. ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial