Actress Jayavani: ఆ న్యూడ్ ఫోటోలు నావి కాదు, అసలు నాకు ట్విట్టర్ అకౌంటే లేదు - నటి జయవాణి
క్యారెక్టర్ ఆర్టిస్టు జయవాణి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. కొందరు ఆగంతకులు ఆమె పేరుతో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి అశ్లీల పోస్టులు పెట్టారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించింది.
నటి జయవాణి అంటే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ, ‘విక్రమార్కుడు’ చిత్రంలో ‘ఒరేయ్ సత్తిగా, బయటకు రారా సచ్చినోడా’ అనే డైలాగ్ వింటే మాత్రం వెంటనే గుర్తుకు వస్తుంది. ఆ ఒక్కడైలాగ్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంది. అగ్ర హీరోలు, అగ్ర దర్శకుల సినిమాలలో నటించింది. జూ. ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘యమదొంగ’ చిత్రంలోనూ మంచి పాత్ర పోషించింది. పలు చిన్న సినిమాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొంత కాలంగా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సినిమాలు చేయడం లేదు. తనకు నచ్చిన క్యారెక్టర్లు రాకపోవడం మూలంగానే సినిమాల్లో నటించడం లేదని చెప్పింది.
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్!
సినిమాలు చేయకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఫేస్ బుక్ లో నిత్యం ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. తన రోజు వారీ పనులకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా జయవాణి పేరుతో ట్విట్టర్ లో కొత్త అకౌంట్ ఓపెన్ అయ్యింది. దానికి వెరిఫైడ్ టిక్(బ్లూ టిక్) కూడా ఉంది. దీంతో అందరూ ఆ అకౌంట్ జయవాణిదే అనుకున్నారు. చాలా మంది ఆమెను ఫోలో అయ్యారు. అయితే, కొద్ది రోజుల పాటు ఆ అకౌంట్ నుంచి సినిమా అప్ డేట్స్ వచ్చాయి. తాజాగా అసభ్యకరమైన అడల్ట్ కంటెంట్ పోస్టు చేస్తున్నారు. పలు అభ్యంతరకర వీడియోలు కూడా అప్ లోడ్ అవుతున్నాయి.
జయవాణి పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్
అంతేకాదు, తాజాగా తాను ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు జయవాణి ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశారు. అంతేకాదు, ఇదే ఆ వెబ్ సిరీస్ ప్రీలుక్ అంటూ ఆమె నగ్న ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలను చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. జయవాణే ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తున్నారా? అని అందరిలో అనుమానం కలిగింది. ఆ అనుమానం నిజమే అని తేలింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పేరిట ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఆమెకు తెలియకుండానే ఈ పోస్టులు షేర్ చేస్తున్నారు.
Read Also: ‘నెట్‌ఫ్లిక్స్’లోని ఈ సినిమాలు చూశారా? భయంతో రెండు రోజులు నిద్రపోలేరు!
ఫేక్ ట్విట్టర్ నిర్వాహకులకు జయవాణి వార్నింగ్
తాజాగా ఈ విషయాన్ని స్వయంగా జయవాణి వెల్లడించింది. అసలు తనక ట్విట్టర్ అకౌంటే లేదని చెప్పింది. ఎవరో తన పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని చెప్పుకొచ్చింది. చాలా మంది తనను ‘శూర్పణఖ’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారా? అని అడుగుతున్నారని.. అయితే, వాళ్లు ట్విట్టర్ అకౌంట్ లో పోస్టులు చూసే అడుగుతున్నారని ఇప్పుడు అర్థం అయ్యిందన్నారు. ఆ అకౌంట్‌లో పోస్టు చేసిన న్యూడ్ ఫోటోలు కూడా తనవి కాదని చెప్పుకొచ్చారు. నెటిజన్లు ఎవరూ ఆ ట్వీట్స్ ను నమ్మకూడదన్నారు. ఇప్పటికైనా అకౌంట్ ను రన్ చేస్తున్నవాళ్లు వెంటనే క్లోజ్ చేయాలని వార్నింగ్ ఇచ్చింది. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial