అన్వేషించండి

Netflix Horror Movies: ‘నెట్‌ఫ్లిక్స్’లోని ఈ సినిమాలు చూశారా? భయంతో రెండు రోజులు నిద్రపోలేరు!

చాలా మంది ప్రేక్షకులు థ్రిల్లింగ్ కోసం హార్రర్ మూవీస్ ఇష్టపడుతారు. భయంతో ఒళ్లు జలదరించినా కళ్లు ఆర్పకుండా చూస్తారు. నెట్ల్ ఫ్లిక్స్ లోనూ కొన్ని అత్యంత భయకరమైన మూవీస్ ఉన్నాయి. మీరూ చూసేయండి!

సినిమాల విషయంలో ఒక్కో ప్రేక్షకుడికి ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంత మంది కామెడీని ఇష్టపడితే, మరికొంత మంది యాక్షన్ ను ఇష్టపడతారు. మరికొంత మంది సైన్స్ ను ఇష్టపడితే, ఇంకొంత మంది హార్రర్ ను చూస్తారు. అయితే, కేవలం హార్రర్ సినిమాలను చూసే వారి కోసమే ఈ న్యూస్. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఉన్న బెస్ట్ హార్రర్ మూవీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..  

1. అన్‌లాక్డ్(2023)

‘అన్‌లాక్డ్’.. ఇది కొరియన్ మూవీ. ఒక సాధారణ కార్యాలయ ఉద్యోగి ముఖ్యమైన వ్యక్తిగత సమాచారాన్ని కలిగి ఉన్న తన ఫోన్‌ను పోగొట్టుకుంటుంది. ఈ ఫోన్ కారణంగా ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో ఈ చిత్రంలో చూపిస్తారు. ఈ ఫోన్ ఆమె ప్రతి కదలికను ట్రాక్ చేయడానికి ఉపయోగించే వ్యక్తి చేతిలోకి వస్తుంది. ఆమెను పెద్ద ప్రమాదంలో పడేస్తుంది. కిమ్ టే-జూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇమ్ సి-వాన్, చున్ వూ-హీ, కిమ్ హీ-వోన్ నటించారు. ఇది అకిరా టెషిగవారా రచించిన జపనీస్ పుస్తకం ఆధారంగా రూపొందించబడింది. 

2. థింగ్స్ హియర్డ్ అండ్ సీన్(2021)

స్టెఫానీ పెర్కిన్స్ రచించిన 'దేయర్స్ సమ్‌వన్ ఇన్‌సైడ్ యువర్ హౌస్' అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు.  ఓ సీరియల్ కిల్లర్ హంతకుడికి చుట్టూ తిరిగే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. మకాని,  ఆమె ఒస్బోర్న్ హై స్కూల్ క్లాస్‌మేట్స్ బృందం కలిసి  సీరియల్ హంతకుడిని ఆపడానికి ఎలా ప్రయత్నిస్తుంది? ఆసమయంలో ఎదురయ్యే సమస్యల ఆధారంగా ఈ సినిమాను తీశారు.   

3. మిడ్ నైట్ మాస్ (2021)

‘మిడ్‌నైట్ మాస్’ అనే సినిమా రిలే ఫ్లిన్ (జాక్ గిల్‌ఫోర్డ్) తాగి డ్రైవింగ్ చేస్తూ ఒకరి చావుకు కారణం అవుతాడు. కొన్ని సంవత్సరాల జైలు శిక్ష తర్వాత క్రోకెట్ అనే చిన్న ద్వీప కుగ్రామానికి అతడు రావడంతో ప్రారంభమవుతుంది. రిలే తన తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి ఉంటాడు. 8 ఎనిమిది నెలల గర్భవతి అయిన తన చిన్ననాటి ప్రియురాలు ఎరిన్ గ్రీన్ (కేట్ సీగెల్)తో తిరిగి కలుస్తాడు. క్రోకెట్‌ లోని సెయింట్ పాట్రిక్స్ చర్చ్‌లో  కొత్త ఫాదర్ గా పాల్ (హమీష్ లింక్‌లేటర్) బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా జరిగిన అనుకోని ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 

4. ఎలి (2019)

నెట్‌ఫ్లిక్స్‌ లో అత్యంత భయంకరమైన చిత్రాల్లో 'ఎలి' ఒకటి. సియారాన్ ఫోయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఒక చిన్న పిల్లవాడు  అరుదైన వ్యాధిని కలిగి ఉంటాడు. ఈ వ్యాధి మూలంగా జరిగే భయంకర పరిస్థితులను ఇందులో చూపిస్తారు.   

5. ది ఫ్లాట్ ఫారమ్(2019)

ఇది ఓ స్పానిష్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ. ప్రతి అంతస్తులో ఇద్దరు దోషులను కలిగి ఉన్న ఒక  బహుళ అంతస్తులో ఉన్న వ్యక్తుల కథను వివరిస్తుంది. నేరస్తులకు ఆహారం ఎలివేటర్ లాంటి ప్లాట్‌ఫారమ్ ద్వారా డెలివరీ చేయబడుతుంది. నిర్ణీత సమయంలో తీసుకోకపోతే వెళ్లిపోతుంది. ఆహారం కోసం నేరస్తులు పడే ఘర్షణ ఈ చిత్రంలో చూపించారు. Iván Massague  ఈ చిత్రంలో హీరోగా నటించారు. ఈ చిత్రానికి దర్శకుడు గాల్డర్ గజ్తెలు ఉరుతియా.  

6. ఫ్రాక్చర్డ్ (2019)

నెట్‌ ఫ్లిక్స్  సైకలాజికల్ హార్రర్ మూవీ 'ఫ్రాక్చర్డ్'. రే మన్రో (సామ్ వర్తింగ్టన్), అతడి బిడ్డ పెరి (లూసీ కాప్రి)ను ఓ వీధి కుక్క వెంటాడుతుంది. ఆ సమయంలో రే ఓ పెద్ద రంధ్రంలో పడతాడు. అదే సమయంలో తన బిడ్డ, భార్య జోవాన్ (లిల్లీ రాబే)తప్పిపోయారని భావిస్తాడు. వారి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో తను ఎదుర్కొన్న ఇబ్బందులను ఇందులో చూపిస్తారు.  ఈ చిత్రానికి బ్రాడ్ ఆండర్సన్ దర్శకత్వం వహించారు.

7. ది పర్ఫెక్షన్ (2019)

నెట్‌ఫ్లిక్స్ అత్యంత భయంకరమైన చిత్రాల్లో 'ది పర్ఫెక్షన్' ఒకటి. ఈ మూవీలోని ప్రధాన పాత్ర షార్లెట్ (అల్లిసన్ విలియమ్స్), ఆమె గురువు ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైన సంగీత పాఠశాలకు ఆహ్వానం అందుతుంది. ఆమె పాఠశాలలోని అమ్మాయిలలో ఒకరైన లిజ్జీతో స్నేహం చేస్తుంది. అదే సమయంలో సంగీత పాఠశాల ముసుగులో ఏదో ఘోరం జరుగుతోందని వారు గ్రహిస్తారు. దీనిని ఎదుర్కొనేందుకు క్రూరమైన నేరస్తులను ఎలా ఎదిరించారు అనేది ఈ సినిమాలో చూపించారు. రిచర్డ్ షెపర్డ్ ఈ సినిమాను తెరకెక్కించారు.  

8. 'బర్డ్ బాక్స్'(2018)

'బర్డ్ బాక్స్' మూవీలో ఒక వ్యక్తికి అనుకోకుండా భయం ఏర్పడుతుంది. ఆ భయం అతడిని పిచ్చివాడిని చేసి చివరికి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంది. ఈ భయం నుంచి తప్పించుకునేందుకు, తన పిల్లలను సజీవంగా ఉంచడానికి ఓ మహిళ చేసే ప్రయత్నాలను ఈ సినిమాలో చూపిస్తారు. సుసానే బీర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం,  జోష్ మాలెర్‌ మాన్ 2014 నవల ఆధారంగా తెరకెక్కింది.    

9.'ఐ యామ్ ది ప్రెట్టీ థింగ్ దట్ లైవ్స్ ఇన్ ది హౌస్(2016)

'ఐ యామ్ ది ప్రెట్టీ థింగ్ దట్ లైవ్స్ ఇన్ ది హౌస్,' అనేది ఓ హార్రర్ మూవీ. ఇంటిలో రహస్య శక్తులను ఎదుర్కోనేందుకు ఓ మహిళ చేసే ప్రయత్నాన్ని ఈ చిత్రంలో చూపిస్తారు.  జీవించి ఉన్నవారు, చనిపోయిన వారు ఇద్దరూ ఈ చిత్రంలో సహజీవనం చేసినట్లుగా చూపిస్తారు. ఈ సినిమా ఆద్యంతం అందరినీ కలవరపాటుకుగురి చేస్తుంది.  

Read Also: శబరి రాముడిపై చూపించిన ప్రేమను చూడాలి, ఎంగిలి పండ్లను కాదు - కృతి సనన్ తల్లి గీత సనన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget